MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • Tamilnadu Results 2026 : తిరుమలలో త్రిష.. లీడింగ్ లో విజయ్

Tamilnadu Results 2026 : తిరుమలలో త్రిష.. లీడింగ్ లో విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. త్రిష తిరుమల శ్రీవారి సన్నిధిల్లో ఉన్నవేళ విజయ్ విజయం దిశగా దూసుకుపోవడంపై తీవ్ర చర్చ సాగుతోంది.

2 Min read
Author : Arun Kumar P
Published : May 04 2026, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయం దిశగా విజయ్ అడుగులు..
Image Credit : instagram

విజయం దిశగా విజయ్ అడుగులు..

Tamilnadu Assembly Election Results 2026 : దేశవ్యాప్తంగా ప్రస్తుతం పొలిటికల్ హీట్ కొనసాగుతోంది... వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది... ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు పరాభవం తప్పేలా లేదు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో నటుడు విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొదట్లో విజయ్ ను తక్కువ అంచనా వేసినా.. ఎగ్జిట్ పోల్స్ భారీ విజయాన్ని అంచనా వేశాయి. ఫలితాల్లోనూ ఇదే బైటపడుతోంది... ఇప్పటికే టివికే స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది... ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తిరుమలలో త్రిష...
Image Credit : x

తిరుమలలో త్రిష...

ఓవైపు తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నవేళ హీరోయిన్ త్రిష తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హీరో విజయ్ పార్టీ టివికే విజయం దిశగా దూసుకెళుతున్నవేళ త్రిష పూజలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయ్ విజయం కోసమే త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. 

ఇవాళ త్రిష పుట్టినరోజు... ఇదే రోజు విజయ్ విజయం దిశగా దూసుకెళ్లడం ఆసక్తికరం. తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళుతున్నట్లు త్రిష నిన్న ఆదివారమే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అప్పటినుండి విజయ్ కోసమే ఆమె తిరుమల వెళుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు త్రిష పూజల పలితంగానే విజయ్ గెలవబోతున్నాడని అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

35
విజయ్ పార్టీ.. తొలి ఎన్నికల్లోనే సంచలనమా?
Image Credit : X/ TVKPartyHQ

విజయ్ పార్టీ.. తొలి ఎన్నికల్లోనే సంచలనమా?

తమిళ రాజకీయాల్లో కొత్త శక్తిగా వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే, పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అధికారాన్ని అందుకుంటుందా..? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఆయన పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో TVK, AIADMK కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఎన్నికలకు ముందు వరకు, టీవీకే ఒక్క సీటు కూడా గెలవదని విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఈ అంచనాలను పూర్తిగా మార్చేశాయి. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ముఖ్యంగా ఇండియా టుడే, టీవీకే పార్టీ 92 నుంచి 120 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాకుండా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవి విడుదల చేసిన సర్వేలో ఏకంగా 121 సీట్లు వస్తాయని తేలింది.

45
విజయ్ వ్యూహాలు, నమ్మకం..
Image Credit : X/ TVKPartyHQ

విజయ్ వ్యూహాలు, నమ్మకం..

పార్టీని ప్రారంభించినప్పటి నుంచి విజయ్ తన టీమ్‌ను బలోపేతం చేయడంపై తీవ్రంగా దృష్టి పెట్టారు. గెలిచిన వెంటనే అందరూ పనైయూర్‌కు రావాలని ఆయన ఇచ్చిన పిలుపు, పార్టీ కార్యకర్తల్లో మరింత విశ్వాసాన్ని నింపింది. అభ్యర్థులు కూడా తాము గెలుస్తామనే ధీమాతో ఉన్నారు.

55
పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్: తొలి ఆధిక్యం
Image Credit : X/ TVKPartyHQ

పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్: తొలి ఆధిక్యం

ప్రస్తుత ఓట్ల లెక్కింపులో, పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో విజయ్ ఆధిక్యంలో ఉన్నారు. పెరంబూర్‌లో ఆయన తక్కవ ఓట్లతోనే అయినా ముందంజలో ఉండగా, డీఎంకే అభ్యర్థి ఆర్.టి. శేఖర్ వెనుకంజలో ఉన్నారు. తిరుచ్చి ఈస్ట్‌లో కూడా విజయ్ ఆధిక్యం కనబరచడం ఎన్నికల ఫలితాలపై మరింత ఆసక్తిని రేపుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Related Stories
Recommended image1
Now Playing
Thalapathy Vijay: Pawan Kalyanలా ట్రెండ్‌ సెట్టర్‌ అవుతాడా? | Tamilnadu Elections | Asianet Telugu
Recommended image2
Tamilnadu : ఆ రోజు డిఎంకేకు ఒక్క ఓటు పడదు... : ప్రధాని మోదీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved