అతనితో క్లోజ్ గా ఉండొద్దంటే వినలేదని.. భార్యను చంపి, ముక్కలుగా నరికిన భర్త..!
తాను ఇంట్లో లేని సమయంలో భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతందని గొడవపడ్డ భర్త.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత శరీరాన్ని ముక్కలుగా నరికాడు.

లక్నో: అనుమానం పెనుభూతంతో ఓ దారుణ ఘటనకు దారి తీసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త ఘాతుకానికి ఒడి గట్టాడు. ఆమెను క్రూరంగా హతమార్చడమే కాకుండా... అత్యంత పాశవికంగా మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. గ్రామస్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికిన 40 ఏళ్ల వ్యక్తిని గోండా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించి ఆదివారం భార్యతో గొడవపడి గొంతుకోసి హత్య చేశాడు. గ్రామస్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాశీపూర్ గ్రామ పరిధిలో ఈ నేరం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వజీర్‌గంజ్ ఎస్ ఓ చంద్ర ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి 2007లో వివాహం జరిగిందని, ఆ దంపతులకు 10, 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడికి ఆరు నెలల క్రితం నగరంలో ఉద్యోగం వచ్చింది. దీంతో రోజూ 70 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లేవాడు. ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడంతో ఇంటి నుంచి త్వరగా వెళ్లి.. రాత్రి ఆలస్యంగా వచ్చేవాడని సింగ్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే.. కొంతకాలంగా భార్యకు గ్రామంలోని ఓ వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అతనితో ఎక్కువ సమయం గడిపేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో కోపోద్రిక్తుడయ్యాడు. గ్రామస్థుడిని కలవవద్దని, మాట్లాడొద్దని హెచ్చరించాడు. అయితే, భార్య వినలేదు. దీంతో “శనివారం రాత్రి, భార్యాభర్తల మధ్య ఈ విషయంగా గొడవ జరిగింది. పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అరుచుకున్నారు.
In Banda sweeper having a love affair with married woman angry husband cut lovers corpse into so many pieces
వారి మధ్యలో జోక్యం చేసుకుని గొడవను ఆపేలోపే.., వ్యక్తి తన భార్యను చంపాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి, పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, తాము అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాం ”అని స్థానికుడైన రామ్ ప్రసాద్ తెలిపారు.