ఆరుగురిని చంపిన జాలీని కోర్టు వద్ద చూసేందుకు ఎగబడ్డ జనం
ఆరుగురిని హత్య చేసిన జాలీని చూసేందుకు జనం ఎగబడ్డారు. కోర్టులో ఆమెను చూసేందుకు జనం ఆసక్తిని ప్రదర్శించారు.
ఆస్తి కోసం తన భర్త కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన జాలీని చూసేందుకు తిరువనంతపురం కోర్టు వద్ద పెద్ద ఎత్తున జనం గుమికూడారు.
14 ఏళ్లలో ఆరుగురిని జాలీ హత్య చేసిందని పోలీసులు చెబుతున్నారు.ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. గురువారం నాడు తిరువనంతపురం కోర్టులో ఆమెను హాజరుపర్చారు.
ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన జాలీ మరో ఇద్దరు చిన్నారులను కూడ హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. అయితే ఆ చిన్నారులు మాత్రం ఆమె బారినపడకుండా బయటపడ్డారు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో జాలీని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ఈ విషయమై శాస్త్రీయమైన ఆదారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
జాలీ మానసిక స్థితి ఎలా ఉంటుందనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో జాలీని పోలీసులు తిరువనంతపురం కోర్టులో హాజరుపర్చారు. ఈ సమయంలో ఆమెను చూసేందుకు కోర్టు బయట జనం తండోపతండాలుగా వచ్చారు.
కొందరైతే కోపం ఆపులేక జాలీని తిట్టిపోశారు. జాలీకి ఈ కేసులో మరో ఇద్దరు సహకరించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఎంఎస్ మ్యాథ్స్ , ప్రజికుమార్ లను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజి కుమార్ జాలీకి సైనేడ్ ను సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. జాలీని ఈ నెల 5వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు.
తన మాజీ భర్తను హత్య చేసిన కేసులో జాలీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న సమయంలోనే మరో ఐదు హత్యలను కూడ తానే చేసినట్టుగా జాలీ ఒప్పుకొందని పోలీసులు తేల్చారు.
తన మాజీ భర్తను సైనేడ్ ఇచ్చి చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన ఐదుగురిని కూడ ఇదే తరహలోనే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఆమె ఒప్పుకొన్నారు.
అయితే ఈ కేసులో సాక్ష్యాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 2002 నుండి 2016 మధ్య కాలంలో ఈ ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆస్తిని కాజేసే ఉద్దేశ్యంతోనే జాలీ ఈ హత్యలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు.