ఇప్పటికే ఆరు హత్యలు, మరోఇద్దరి హత్యకు ప్లాన్: జాలీ సైకోనా?
కేరళ రాష్ట్రంలో సంచలనం సృస్టించిన సైనేడ్ హత్యలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ హత్యల వెనుక జాలీ ఉందని పోలీసులు ప్రకటించారు. అయితే ఆమె ఈ హత్యలు చేయడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన జాలీ అనే వివాహిత మానసిక వ్యాధితో ఏమైనా బాధపడుతున్నారా అనే కోణంలో కూడ విచారణ చేస్తున్నారు.మరో వైపు జాలీ మరో ఇద్దరు పిల్లలను కూడ హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
ప్తంగా సంచలనం సృష్టించిన సైనేడ్ హత్యలకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి బలయ్యారు. ఈ ఆరుగురిలో భర్తతో పాటు రెండేళ్ల పాప కూడ ఉంది.ఆస్తి మీద కన్నేసిన జాలీథామస్ ఈ హత్యలకు ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి విచారిస్తున్నారు.
గతంలో ఆహారంలో సైనేడ్ కలిపి ఆరుగురిని ఎలా చంపిందో మరో ఇద్దరు పిల్లలను కూడ అలాగే చంపేందుకు జాలీ ప్రయత్నించిందని కోజికోడ్ రూరల్ ఎస్పీ కేజీ సిమన్ తెలిపారు.
జాలీ థామస్ సాధారణ మహిళగా కాకుండా సీరియల్ కిల్లర్ కావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహరా అభిప్రాయపడ్డారు.జాలీ థామస్ కు స్ల్పిట్ పర్సనాలిటీ ఉందని భావిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. తాను హత్య చేయాలనుకొన్న కుటుంబసభ్యులకు భోజనంలో సైనేడ్ కలిపినట్టుగా పోలీసులు గుర్తించారు.
అయితే ఈ కేసులో జాలీ ప్రమేయం ఏమీ లేదని ఆమె స్నేహితులు, బంధువులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా జాలీని అనుమానిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఒకే మనిషిలో భిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉండడంపై పోలీసులు సాంకేతికపరంగా విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు జాలీ థామస్‌కు సైకో అనాలిసిస్ పరీక్ష నిర్వహించేందుకు సిద్దమౌతున్నారు.
ఈ కేసులో సైకాలజిస్టుల సహకారాన్ని కూడ తీసుకోనున్నారు. ఈ కేసులో సాంకేతిక అంశాల ఆధారంగా వాస్తవాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ కేసు మాత్రం సంచలనం కల్గించింది.ఆస్తి కోసమే జాలీ ఈ పనిచేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ హత్యలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు కేరళ పోలీస్ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జాలీ మానసిక స్థితిని కనుగొనేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది.