కశ్మీర్, కేరళ ట్రిప్ ... అతి తక్కువ ధరలోనే
క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐఆర్‌సీటీసీ కశ్మీర్, కేరళకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. డిసెంబర్‌లో ప్రయాణించాలనుకునేవారికి వసతి, భోజనం, ప్రయాణ ఏర్పాట్లతో కూడిన ఈ ప్యాకేజీలు తక్కువ ధరలో లభిస్తున్నాయి.
ఐఆర్‌సీటీసీ క్రిస్మస్ టూర్ ప్యాకేజీలు
క్రిస్మస్ హాలిడేస్ లో హాయిగా కుటుంబంతోనో లేక స్నేహితులతోనో ట్రిప్ కు వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మీ సన్నిహితులతో కలిసి అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు.
కశ్మీర్ టూర్ ప్యాకేజీ
"MYSTICAL KASHMIR WINTER SPECIAL EX HYDERABAD" పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ క్రిస్మస్ జరుపుకోవడానికి ఇది చక్కని అవకాశం. హైదరాబాద్ నుండి డిసెంబర్ 21 నుండి 26 వరకు 5 రాత్రులు, 6 పగళ్ళు ఈ ట్రిప్ ఉంటుంది.
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు
మంచుతో కప్పబడిన కొండల మధ్య క్రిస్మస్‌ను ఆస్వాదించండి. ఈ ప్యాకేజీపై 50% తగ్గింపు ఉంది. ఒక్కరికి ₹43,670, ఇద్దరు వెళ్లాలనుకుంటే కాస్త తగ్గి ఒక్కొక్కరికి ₹41,050 వుంటుంది. ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోండి.
కేరళ టూర్ ప్యాకేజీ
కేరళ టూర్ ప్యాకేజీ
అందాలతో కనువిందు చేసే కేరళను ఇప్పుడు తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు. కోల్‌కతా నుండి 7 రాత్రులు, 8 పగళ్ళు ట్రిప్ డిసెంబర్ 20 నుండి 26 వరకు ఉంది. ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఉంటుంది. మధ్యాహ్న భోజనానికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలి. ఇద్దరు వెళ్లాలనుకుంటే ఒక్కొక్కరికి ₹71,750, ముగ్గురు వెళితే ఒక్కొక్కరికి ₹62,900.