MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • Bullet Train : హైదరాబాద్ టు బెంగళూరు 618 కి.మీ ... ఈ రైల్లో కేవలం 2 గంటలే జర్నీ!!

Bullet Train : హైదరాబాద్ టు బెంగళూరు 618 కి.మీ ... ఈ రైల్లో కేవలం 2 గంటలే జర్నీ!!

Bullet Trains in India :  ప్రస్తుతం భారతీయ రైల్వే అత్యధిక స్పీడ్ 200 కి.మీ పర్ అవర్ లోపే. కానీ ఈ స్పీడ్ ను డబుల్ చేసే ప్రయత్రాల్లో వుంది మోదీ సర్కార్. ఇదే జరిగితే హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 05 2025, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
bullet train

bullet train

Bullet Train : హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు... ఈ ఐటీ సిటీస్ మధ్య నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. కొందరు సొంత కార్లలో, మరికొందరు ట్రావెల్స్ బస్సులు, ఇంకొందరు రైళ్లలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణిస్తుంటారు... వీరికి 6 గంటల నుండి 10 గంటల సమయం పడుతుంది... రైలు ప్రయాణానికి ఏకంగా 12 గంటలు అంటే సగంరోజు ప్రయాణానికే పోతుంది. 

హైదరాబాద్-బెంగళూరు మధ్య వేగవంతమైన ప్రయాణం కోసం విమానం ఆశ్రయించాల్సిందే. విమానంలో అయినా గంటకు పైగానే సమయం పడుతుంది. అయితే ఇది బాగా ఖర్చుతో కూడుకున్నది... కాబట్టి ఐటీ నిపుణులు, వ్యాపారులు మాత్రమే ఎక్కువగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సామాన్యులు ఏ బస్సో, రైలో పట్టుకుని ప్రయాణించాల్సిందే. 

అయితే ఇలా ఐటీ సీటీస్ హైదరాబాద్-బెంగళూరు మధ్య  ఆపసోపాలు పడుతూ గంటల తరబడి ప్రయాణించేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య దేశంలోనే అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ ట్రైన్ ను ప్రతిపాదించింది... ఈ మేరకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. 

దేశంలోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలను కలుపుతూ ఈ బుల్లెట్ ట్రైన్ ను ప్రతిపాదించిది రైల్వే శాఖ. ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి కర్ణాటక రాజధాని బెంగళూరుకే కాదు తమిళనాడు రాజధాని చెన్నై, మహారాష్ట్ర రాజధాని ముంబైని కలిపేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది... అయితే ఒక్కసారి ఈ బుల్లెట్ రైలు పరుగులు ప్రారంభమైతే ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం విమాన ప్రయాణం స్థాయికి చేరుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
hyderabad to bangalore bullet train

hyderabad to bangalore bullet train

ఏఏ మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ నడవనుంది : 

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైళ్ళు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు. వివిధ మార్గాల్లో నడుస్తున్న ఈ రైళ్ల గరిష్ట వేగం 160 కిలోమీటర్లు పర్ అవర్ మాత్రమే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బుల్లెట్ రైలు వేగం ఏకంగా గంటకు 300 కి.మీ వుండనుంది. అంటే వందేబారత్ రైళ్ల కంటే ఇవి డబుల్ స్పీడ్ లో దూసుకుపోనున్నాయి. 

ప్రస్తుతం అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును చెప్పట్టారు. జపాన్ సాంకేతిక సహాయంలో ఈ  నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2028-29 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయాల్సి వుంది. ఈ బుల్లెట్ ట్రైన్ ఏకంగా 350 కి.మీ పర్ అవర్. అంటే కేవలం గంట గంటన్నరలో ముంబై టు అహ్మదాబాద్ ప్రయాణం సాగుతుందన్నమాట. 

ఇలా హైదరాబాద్, బెంగళూరు మధ్య కూడా హై స్పీడ్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. గంటకు 320 కి.మీ ప్రయాణించే ఈ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య దూరం 618 కి.మీ రైల్వే ట్రాక్ ను సిద్దం చేయనున్నారు. ఇది 2041 నాటికి అందుబాటులోకి రానుంది.

ఇలాగే హైదరాబాద్, ముంబై మధ్యకూడా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన వుంది. ఈ రెండు నగరాల మధ్య 711 కి.మీ మార్గాన్ని సిద్దం చేయనున్నారు. దీంతో దాదాపు రెండు రెండున్నర గంటల్లో ముంబై చేరుకోవచ్చు. ఇది 2051 లో పూర్తి కానుందని రైల్వే శాఖ చెబుతోంది.
 

33
bullet train

bullet train

బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదిత నగరాల పూర్తి జాబితా : 

1. ముంబై-అహ్మదాబాద్ - 508 కి.మీ మార్గం ‌- 2028 నాటికి పూర్తి - 2 గంటల్లోపే ప్రయాణం 

2. డిల్లి - అహ్మదాబాద్ -886 కి.మీ మార్గం -2031 నాటికి పూర్తి - 2‌-3 గంటల ప్రయాణం 

3. డిల్లి - వారణాసి -865 కి.మీ మార్గం - 2031 నాటికి పూర్తి  - 2‌-3 గంటల ప్రయాణం 

4. వారణాసి - హౌరా - 711 కి.మీ మార్గం -2031 నాటికి పూర్తి - 2 గంటల ప్రయాణం 

5. హైదరాబాద్ - బెంగళూరు - 618 కి.మీ మార్గం - 2041 నాటికి పూర్తి - 2 గంటల్లోపే ప్రయాణం

6. నాగ్ పూర్ - వారణాసి -855 కి.మీ మార్గం - 2041 నాటికి పూర్తి  - 2‌-3 గంటల ప్రయాణం 

7. చెన్నై - మైసూరు - 435 కి.మీ మార్గం -2051 నాటికి పూర్తి - 2 గంటల్లోపే ప్రయాణం

8. డిల్లి - అమృత్ సర్ - 480 కి.మీ మార్గం -2051 నాటికి పూర్తి - 2 గంటల్లోపే ప్రయాణం

9. అమృత్ సర్ - జమ్మూ - 190 కి.మీ మార్గం -2051 నాటికి పూర్తి - అరగంట నుండి గంటలోపే ప్రయాణం

10. ముంబై - హైదరాబాద్ - 711 కి.మీ మార్గం - 2051 నాటికి పూర్తి  - 2 గంటల్లోపే ప్రయాణం

11. ముంబై - నాగ్ పూర్ -736 కి.మీ మార్గం -2051 నాటికి పూర్తి  - 2 గంటల్లోపే ప్రయాణం

12. పాట్నా - గౌహతి - 850 కి.మీ మార్గం -2051 నాటికి పూర్తి - 2‌-3 గంటల ప్రయాణం 

(ఇందులో కొన్ని నిర్మాణదశలో ఇంకొన్ని డిపిఆర్, మరికొన్ని ప్రతిపాదిత దశలో వున్నాయి)
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
Recommended image2
Now Playing
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat
Recommended image3
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved