MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఛీ.. మద్యం కోసం స్నేహితుల దగ్గర భార్యను తాకట్టు పెట్టిన భర్త.. వారితో అత్యాచారం చేయించి...

ఛీ.. మద్యం కోసం స్నేహితుల దగ్గర భార్యను తాకట్టు పెట్టిన భర్త.. వారితో అత్యాచారం చేయించి...

మద్యం కోసం ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితుల దగ్గర పడుకోమని భార్యను వేధించాడు. వారితో ఆమె మీద అత్యాచారం చేయించాడు. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 29 2023, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఉత్తర ప్రదేశ్ : మద్యం కోసం స్నేహితుల దగ్గర భార్యను తాకట్టు పెట్టాడో నీచుడు. మద్యానికి బానిసైన ఆ భర్త.. తాగడానికి డబ్బులు లేకపోవడంతో స్నేహితులను అడిగాడు. అతని భార్య మీద కన్నేసిన ఆ స్నేహితులు..  ఆమెను తమ దగ్గరికి పంపిస్తే ఇస్తామని చెప్పారు. వెంటనే ఏమాత్రం సంకోచించకుండా  దీనికి ఒప్పుకున్నాడు ఆ కిరాతకుడు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అంతేకాదు... భార్యను తన స్నేహితుల దగ్గర పడుకోమని వేధించాడు. దీంతో షాక్ కు గురైన భార్య దీనికి ఒప్పుకోలేదు.. అంతేకాదు భర్తను  కొట్టింది. భార్య ఇలా తిరగబడుతుందని ఊహించని భర్త… ఆమెను దారుణంగా కొట్టాడు. 

38

ఆ స్నేహితులకు ఫోన్ చేసి రావాల్సిందిగా చెప్పాడు. వచ్చిన తర్వాత వారితో భార్య మీద అఘాయిత్యం చేయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సంబాల్ లో వెలుగు చూసింది. ఆ నీచుడైన భర్తపేరు తేజ్ పాల్.  ఆయన భార్య పేరు నఖాసా. కొద్దిరోజులుగా తేజ్పాల్ మద్యానికి బానిస అయ్యాడు. 

48

డబ్బులు ఎక్కడ కనిపించినా దానికే ఖర్చు పెట్టేవాడు. నిత్యం ఇంట్లో భార్యను డబ్బుల కోసం వేధిస్తుండేవాడు. అలా ఓ రోజు స్నేహితులను డబ్బులు అడగగా వారు  భార్యను తమతో పడుకొనివ్వాలని కండిషన్ పెట్టారు. దీనికి తేజ్పాల్ ఒప్పుకుని.. వారిని ఇంటికి తీసుకువెళ్లాడు.  వారితో పడుకోవాలని భార్య మీద ఒత్తిడి చేశాడు.

58

దీనికి ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత భార్య మీద స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఇంత అవమానాన్ని తట్టుకొని నఖాసా  ఏమీ చేయలేకపోయింది. లోలోపలేకుమిలిపోయింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. చెప్పుకోవడం వల్ల తన పరువు, కుటుంబ పరువు పోవడం తప్పితే ఇంకొకటి లేదని భావించింది. మౌనం  వహించింది. 

68

దీన్ని భర్త స్నేహితులైన దుర్మార్గులు ఆసరాగా తీసుకున్నారు. ఆమె ఎవరితోనూ చెప్పే సాహసం చేయదని అనుకున్నారు. తరచుగా ఇంటికి వస్తూ ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారికి భర్త సహకరించేవాడు. దీంతో ఓపిక నశించిన భార్య పోలీసులను ఆశ్రయించింది.

78

తన హృదయ విధారక గాధను వారికి తెలిపింది. మద్యం తాగడం కోసం అవసరమైన డబ్బుల కోసం భర్త తనను తన స్నేహితుల దగ్గర తాకట్టు పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వంకతో వారు తన మీద చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు… నిందితులపై 402, 504, 376డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

88

నఖాసా మీద అత్యాచారానికి పాల్పడ్డ తేజ్ పాల్ స్నేహితులు కుల్దీప్, అరుణ్, యోగేష్ లు ఈ విషయం తెలిసి పారిపోయారు. భర్త తేజ్ పాల్ కూడా పారిపోయాడు. పోలీసులు ఈ నలుగురికోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
80వ స్వాతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ముర్ము సందేశం | Droupadi Murmu Independence Day speech
Recommended image2
Now Playing
ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రిహార్సిల్స్ | Red Fort Independence Day rehearsal
Recommended image3
అది దేశం సాధించిన అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టి.. 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేళ రాష్ట్ర‌ప‌తి సందేశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved