భార్యను చంపి, మృతదేహాన్ని మామిడితోటలో పాతిపెట్టిన భర్త.. ఆంధ్రానుంచి వెళ్లి తమిళనాడులో దారుణం..
భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసి మామిడితోటలో పాతిపెట్టాడు. ఆ తరువాత తన మూడేళ్ల కొడుకుతో కలిసి పారిపోయాడు.
చెన్నై : తమిళనాడులో దారుణం జరిగింది. తిరువళ్లూరు జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మామిడితోటలో పాతిపెట్టాడు. ఆ తరువాత తన మూడేళ్ల కొడుకుతో కలిసి పరారయ్యాడు.
ఈ 25 ఏళ్ల యువకుడి తోట యజమాని బైక్ తీసుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతురాలిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి లక్ష్మి (23)గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె భర్త ఎస్ ధర్మయ్య (25) మదర్‌పాక్కంలోని మామిడితోటలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
మార్చిలో ధర్మయ్య తన భార్య, కుమారుడిని తీసుకొచ్చి కేశవన్‌కు చెందిన తోట వద్దే ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.“ఏప్రిల్ 23న ధర్మయ్య తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాతి రోజు, కేశవన్ తన భార్య 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిందని తోటలోని మిగతా కార్మికులతో చెప్పాడు.
ఆ తరువాత భార్యను బంధువుల ఇంటినుంచి తీసుకురావాలని.. ధర్మయ్య కేశవన్ మోటర్‌బైక్‌ను అప్పుగా ఇవ్వమని అడిగాడు. ఆ తరువాత తిరిగి రాలేదు’’ అని పోలీసు అధికారి చెప్పాడు.
మరుసటి రోజు వరకు ధర్మయ్య తిరిగి రాకపోవడంతో, కేశవన్ ఏం జరిగిందో తెలుసుకుందామని.. అతని స్నేహితుడితో కలిసి ఆంధ్ర ప్రదేశ్‌లోని ధర్మయ్య గ్రామానికి వెళ్లారు. “ధర్మయ్య తన కొడుకుతో కలిసి నిన్ననే వచ్చాడని అతని బంధువులు కేశవన్‌కి చెప్పారు.
వచ్చిన మరుసటి తర్వాత రోజు బంధువుతో మద్యం సేవిస్తున్న సమయంలో ధర్మయ్య అసలు విషయం బయటపెట్టాడు. తన భార్యను హత్య చేసి శవాన్ని తోటలో పూడ్చిపెట్టినట్లు అంగీకరించాడు. షాక్ అయిన బంధువులు ప్రశ్నించడంతో హడావుడిగా అక్కడినుంచి జారుకున్నాడు’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
There will be a fight between husband and wife
కేశవన్ అక్కడినుంచి తన ఊరికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత తోటలో ఒకచోట పురుగులు, ఈగలు ముసురుతున్న ఇసుక కుప్పను గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. 8
శుక్రవారం ఉదయం గుమ్మిడిపూండి తహశీల్దార్ సమక్షంలో పతిర్వేడు పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.