MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు : ఓట్ల లెక్కింపు ప్రారంభం, కాంగ్రెస్, బిజెపి హోరాహోరీ

హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు : ఓట్ల లెక్కింపు ప్రారంభం, కాంగ్రెస్, బిజెపి హోరాహోరీ

హర్యానా రాష్ట్రంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో  కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో వెలువడనున్నాయి. ఈ ఫలితాలు ఎలా వుంటాయోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  

2 Min read
Arun Kumar P
Published : Oct 08 2024, 09:55 AM IST| Updated : Oct 08 2024, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Haryana, Jammu Kashmir Assembly Election Results 2024

Haryana, Jammu Kashmir Assembly Election Results 2024

Haryana, Jammu Kashmir Assembly Election Results 2024 : పార్లమెంఎట్ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఫలితాల కోసం కేవలం ఆ ప్రాంతాల ప్రజలే కాదు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

మంగళవారం ఉదయం 8 గంటలకు హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలట్స్ తో పాటు ఇప్పటికే పలు రౌండ్ల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు హర్యనాలో ఎవరి ఊహకు అందనివిధంగా బిజెపిదూసుకుపోతోంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యం కొనసాగుతోంది.  

హర్యానాలో మొత్తం 90 సీట్లకుగాను బిజెెపి అత్యధిక చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే బిజెపి 50కి పైగా సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది...కొన్న స్థానాల్లో విజయం కూడా ఖరారయ్యింది. విజయం ఖాయం అనుకున్న కాంగ్రెస్ కు మాత్రం నిరాశ తప్పడంలేదు. 

 
 

23
Haryana Assembly Election Results 2024

Haryana Assembly Election Results 2024

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు :  

హర్యానా రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు.  మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధాన పార్టీలనుండే అత్యధికమంది వుండగా 464 మంది ఇండిపెండెంట్లు కూడా పోటీపడ్డారు. ఎన్నికల నోటిఫికేన్ వెలువడిన నాటినుండి మొదలైన హడావిడి నామినేషన్లు, ప్రచారం, పోలింగ్ వరకు కొనసాగింది. అక్టోబర్ 5న పోలింగ్ ముగిసింది. 67.90 పోలింగ్ నమోదయ్యింది. 

పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఈసారి కాంగ్రెస్ దే అధికారమని తేల్చేసాయి. బిజెపికి షాక్ తప్పదని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసాయి. దీంతో అప్పటినుండే కాంగ్రెస్ ధీమాగా వుండగా బిజెపి మాత్రం ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అవుతాయని చెబుతూ వచ్చింది. కానీ ఇవాళ ఫలితాల సరళిని చూస్తుంటే బిజెపి వాదన నిజమని అర్థమవుతోంది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఆమ్ ఆద్మీ పార్టీ అసలు పోటీలోనే కనిపించడంలేదు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కాదని ఒంటరిగా బరిలోకి దిగిన ఆప్ ను హర్యానా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఆశించిన స్థాయి ప్రభావం ఆప్ చూపించలేకపోయింది. 

33
Jammu & Kashmir Assembly Election Results 2024

Jammu & Kashmir Assembly Election Results 2024

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు : 

జమ్మూ కాశ్మీర్ చాలా సున్నితమైన ప్రాంతం... అందువల్ల ఇక్కడ కేవలం 90 అసెంబ్లీ స్థానాలకే మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 63.45 శాతం పోలింగ్ నమోదయ్యింది. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి.   

మొత్తం 90 స్థానాల్లో 873 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రధాన పోటీ మాత్రం బిజెపి, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి మధ్యే వుంది. తాజాగా వెలువడుతున్న ఫలితాలు కూడా ఇలాగే వున్నాయి. బిజెపి 25, కాంగ్రెస్ కూటమి 41, ఇతరులు 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
Recommended image2
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
Recommended image3
Now Playing
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved