MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • భారతదేశంలో అత్యధిక ఆదాయం కలిగిన జాాతీయ రహదారి ఏదో తెలుసా? ఒక్క నెలకే అన్ని కోట్లా!

భారతదేశంలో అత్యధిక ఆదాయం కలిగిన జాాతీయ రహదారి ఏదో తెలుసా? ఒక్క నెలకే అన్ని కోట్లా!

దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి వల్ల జాతీయ రహదారుల రూపురేఖలు మారాయి. ఈ రోడ్లు ప్రయాణికులకు సౌకర్యంతో పాటు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా టోల్ ద్వారా భారీ ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. ఒకే ఒక్క ఎక్స్‌ప్రెస్‌వే కేవలం ఒక్క నెలలో ఎంత సంపాదించిందో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 21 2025, 11:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ. 16,300 కోట్ల ఎక్స్‌ప్రెస్‌వే

రూ. 16,300 కోట్ల ఎక్స్‌ప్రెస్‌వే

దేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. 2025 బడ్జెట్‌లో దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలను కలుపుతూ బాగా పొడవైనవే కాదు చిన్న చిన్న ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా ఉన్నాయి. దేశంలో అత్యంత లాభదాయకమైన ఎక్స్‌ప్రెస్‌వే ఏదో తెలుసా? ఇది ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తుంది.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారి సంఖ్యను పెంచింది. దీని నిర్మాణం కోసం దాదాపు రూ. 16,300 కోట్లు ఖర్చయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఇంకేదో కాదు ముంబై టు పూణె మధ్య నిర్మించినదే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముంబై - పుణె ఎక్స్‌ప్రెస్‌వే

ముంబై - పుణె ఎక్స్‌ప్రెస్‌వే

ఈ ఎక్స్‌ప్రెస్‌వే నవీ ముంబైలోని కలంబోలిలో మొదలై పుణెలోని కివాలేలో ముగుస్తుంది. దీనిని NHAI తో కలిసి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) నిర్మించింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు ఇరువైపులా అదనంగా మూడు లేన్ల కాంక్రీట్ సర్వీస్ రోడ్లు నిర్మించారు.

2002లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ముంబై, పుణె నగరాలను కలుపుతూ ప్రయాణికుల సమయాన్ని బాగా ఆదా చేస్తుంది.

35
ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌వే

ఖరీదైన ఎక్స్‌ప్రెస్‌వే

ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అత్యంత ఖరీదైనది, రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వే. ఇది పురాతనమైన ఎక్స్‌ప్రెస్‌వేలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆర్థిక రాజధాని ముంబైని పుణెతో కలిపే ఈ రోడ్డు భారతదేశపు మొట్టమొదటి ఆరు లేన్ల రహదారి.

45
రూ. 163 కోట్ల ఆదాయం

రూ. 163 కోట్ల ఆదాయం

డిసెంబర్ 2024లో ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే టోల్ వసూళ్లలో అగ్రస్థానంలో ఉందని IRB ఇన్ఫ్రా ట్రస్ట్ విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. ఈ సమయంలో టోల్ వసూళ్లు రూ. 580 కోట్లకు చేరుకోగా, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే ఒక్కటే రూ. 163 కోట్లు వసూలు చేసింది. 2023 డిసెంబర్‌లో టోల్ వసూళ్లు రూ. 158.4 కోట్లుగా ఉన్నాయి.

55
అత్యధిక ఆదాయ

అత్యధిక ఆదాయ

ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం 94.5 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది, కానీ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. డిసెంబర్ 2024లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వే, NH48 కలిసి టోల్ టాక్స్ ద్వారా రూ. 70.7 కోట్లు వసూలు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలను కలుపుతూ జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నప్పటికీ, వచ్చే ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Recommended image2
Now Playing
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu
Recommended image3
Now Playing
CM Vijay Speech: సీఎం విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved