MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • అయోధ్య రామాలయ జిఎస్టియే అన్ని వందల కోట్లా!

అయోధ్య రామాలయ జిఎస్టియే అన్ని వందల కోట్లా!

 అయోధ్య రామమందిరం నిర్మాణానికి వసూలు చేసిన GST వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.  కేవలం జిఎస్టియే ఎన్ని వందల కోట్లో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 10 2024, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అయోధ్య ఆలయ జిఎస్టి

అయోధ్య ఆలయ జిఎస్టి

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ప్రాంతం సాక్షాత్తు ఆ రామచంద్రుడు పుట్టిపెరిగిన పవిత్ర ప్రాంతంగా హిందువులు నమ్ముతారు. అందువల్లే శతాబ్దాల పోరాటం తర్వాత ఇక్కడే రామమందిర నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు అయోధ్య  భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారింది.

రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్యకి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాదు  విదేశాల నుంచి వచ్చిమరీ హిందువులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామ మందిరం

రామ మందిరం

బాలరాముడు కొలువైన ప్రధాన ఆలయంతో పాటు చుట్టుపక్కల మరికొన్ని ఆలయాల నిర్మాణాలపనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఆసక్తికర వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తాజాగా వెల్లడించారు.

35
అయోధ్య ఆలయం

అయోధ్య ఆలయం

మహర్షి వాల్మీకి, శబరి,  తులసీదాస్ ఆలయాలతో సహా 70 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 18 ఆలయాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వానికి 100% పన్ను చెల్లిస్తామని... ఒక్క రూపాయి కూడా బకాయి పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

 

45
రామ మందిరం నిర్మాణం

రామ మందిరం నిర్మాణం

అయోధ్య రామాలయం దేశ ప్రజల సహకారంతో నిర్మితమైందని అన్నారు. రెండు లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా ఎలాంటి ఇబ్బందిలేకుండా ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో ఎందరో ప్రాణాలను సైతం త్యాగం చేసారన్నారు. స్వాతంత్ర పోరాటానికి ఈ పోరాటం సమానమైనదని అన్నారు.

 

55
GST

GST

ఆలయ ప్రాంగణంలోనే శివాలయం కూడా నిర్మిస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని బగవా గ్రామం అద్భుతమైన శివలింగాలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందని... ఇక్కడ తయారయ్యే శివలింగాలకు దేశ, విదేశాల్లో గిరాకీ ఉందన్నారు. ఇక్కడే రామమందిర ప్రాంగణంలో ప్రతిష్టించే శివలింగం కూడా రూపుదిద్దుకుంటోందని చంపత్ రాయ్ వెల్లడించారు.

అయోధ్యలో చేపడుతున్న ఆలయాల ద్వారా ప్రభుత్వానికి రూ.400 కోట్ల వరకు GST వసూలయ్యే అవకాశం వస్తాయని అంచనా వేసారు. పనులు పూర్తయిన తర్వాత ఖచ్చితమైన పన్ను మొత్తం తెలుస్తుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Panch Mahatirth Yatra: ఒకే టికెట్‌పై పూరి, కాశీ, అయోధ్య.. 5 పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ
Recommended image2
Now Playing
Nemmeli Project: ₹2,465 కోట్ల ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం విజయ్ | Asianet Telugu
Recommended image3
Now Playing
PM Modi Indonesia Tour: ఇండోనేషియాలో అడుగుపెట్టిన మోదీకి అదిరిపోయే వెల్ కమ్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved