MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `విద్య వాసుల అహం` మూవీ రివ్యూ, రేటింగ్‌

`విద్య వాసుల అహం` మూవీ రివ్యూ, రేటింగ్‌

శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ మరోసారి జంటగా నటించిన చిత్రం `విద్య వాసుల అహం`. ఈ మూవీ `ఆహా`లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

5 Min read
Author : Aithagoni Raju
| Updated : May 17 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

శివానీ రాజశేఖర్‌.. మొదటి సినిమా నుంచి ఓటీటీకే పరిమితమయ్యింది. చివరగా ఆమె `కోటబొమ్మాళి పీఎస్‌` చిత్రం థియేటర్‌లోకి వచ్చింది. ఇందులో రాహుల్‌ విజయ్‌తో కలిసి నటించింది. శ్రీకాంత్‌ మెయిన్ లీడ్‌ చేశారు. ఈ మూవీకి మంచి పేరొచ్చినా ఎన్నికల సమయంలో రావడంతో పెద్దగా ఆడలేదు. కానీ మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలతో అలరిస్తున్నారు శివానీ, రాహుల్‌ విజయ్‌. ఈ ఇద్దరు మరోసారి జోడీ కడుతూ  `విద్య వాసుల అహం` చిత్రంలో నటించారు. మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మించారు. ఇది ఈనెల 17(గురువారం అర్థరాత్రి) నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కథః 
వాసు(రాహుల్‌ విజయ్‌) మెకానికల్‌ ఇంజనీర్‌గా జాబ్‌ చేస్తుంటాడు. శాలరీ తక్కువే. పెళ్లీడుకొచ్చినా మ్యారేజ్‌ చేసుకునేందుకు వెనకాడుతుంటాడు. నచ్చిన అమ్మాయి రాదని, స్వేచ్ఛగా ఉండలేమనే ఆలోచనతో ఆయన పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినా నో చెబుతుంటాడు. మరోవైపు విద్య(శివానీ రాజశేఖర్‌) కూడా తనకు నచ్చిన వాడు, తనని ఇష్టపడేవాడు, ప్రాక్టీకల్‌గా ఉండేవాడు దొరకడం కష్టమని చెప్పి పెళ్లి ప్రస్తావనని దాటవేస్తూ వస్తుంది. పైగా వంట చేయాలి, ఇంట్లో పనులు చేయాలనే బద్దకం కూడా ఆమె మ్యారేజ్‌కి నో చెప్పడానికి ఓ కారణమని చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఓ రోజు గుడికి వెళ్తారు. అక్కడ పూజారి చెప్పిన ప్రవచనాలు విని వీరిలో మార్పు వస్తుంది. నందికి తమ కోరికలు చెప్పుకొని ఇంటికొస్తారు. ఇద్దరిలోనూ మ్యారేజ్‌పై పాజిటివ్‌ అభిప్రాయం వస్తుంది. ఇక పేరెంట్స్ మ్యారేజ్‌ ప్రస్తావన తేవడంతో ఎట్టకేలకు ఒప్పుకుంటారు. అయితే విద్య తాను చేసుకునే వాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం ఓ పరీక్షా పత్రాన్ని కూడా రెడీ చేస్తుంది. తాను నచ్చిన వాళ్లు ఆ పేపర్‌ ఫిల్‌ చేయాల్సి ఉంటుంది. అందులో ఫిల్టర్‌ చేయగా ఫైనల్‌గా వాసు ఫిల్‌ చేసిన పేపర్‌ నచ్చుతుంది. అతన్ని పెళ్లి చూపులకు రమ్మని చెబుతుంది. ఇద్దరు తొలి చూపులోనే ఇంప్రెస్‌ అవుతారు. పెళ్లి చూపుల టైమ్‌లోనే రోజంతా మాట్లాడుకుంటారు. ఒకరినొకరు నచ్చుతారు. పెళ్లికి ఓకే చెప్పడంతో ఆ తంతు పూర్తవుతుంది. మ్యారేజ్‌ తర్వాత ఫస్ట్ నైట్‌ రోజే ఇద్దరి మధ్య మనస్పర్థాలు స్టార్ట్ అవుతాయి. ఇద్దరు గత ప్రేమలకు సంబంధించిన చర్చ రాంగ్‌ రూట్‌లో వెళ్తుంది. దీంతో ఫస్ట్ నైట్‌ జరగక్కుండానే తెల్లారుతుంది. మరోవైపు ప్రారంభంలో ప్రేమతో ఉన్న ఈ ఇద్దరి మధ్య రాను రాను గొడవలు ప్రారంభమవుతాయి. మరి ఆ గొడవలకు కారణమేంటి? ఇద్దరి మధ్య వచ్చే గొడవలేంటి? ఆ గొడవలు ఎలాంటి మలుపులకు దారి తీశాయి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ. 
 

38

విశ్లేషణః
కొత్తగా పెళ్లైన జంటలో ఉంటే ప్రేమాభిమానాలు, ఆ తర్వాత వచ్చే మనస్పర్థాలు, అహం ఎలాంటి గొడవలకు దారి తీస్తుందనేది, అర్థం చేసుకునే విషయంలో వచ్చే డిఫరెన్సెస్‌ వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. లవ్‌ అండ్‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు రొమాన్స్ అంటే బోల్డ్ గా మారిన నేపథ్యంలో చాలా పద్ధతిగా ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఎక్కడా వల్గారిటీ లేకుండా చాలా నీట్‌గా తెరకెక్కించారు. పద్ధతైన మాటలు, లోతైన అర్థాన్నిచ్చే మాటలు ఈ మూవీకి పెద్ద అసెట్‌గా, ప్లస్‌గా మారాయి. దీనికితోపాడు కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య ప్రేమల, అలకలు, మనస్పర్థాలు, గొడవలు అనే అంశాన్ని చాలా రియలిస్టిక్‌గా రూపొందించారు. ఇదొక సందేశాత్మక చిత్రమని చెప్పొచ్చు, కానీ ఎక్కడ అలాంటి ఓవర్‌ డ్రామాకి వెళ్లలేదు, ఏది ఎంత కావాలో అంతే చూపించారు. చాలా సింపుల్‌ వేలో మూవీని తెరకెక్కించాడు దర్శకుడు మణికాంత్‌ గెల్లి. 
 

48

సినిమా కథగా చెప్పాలంటే ఇది చాలా సింపుల్‌ స్టోరీ. ఎన్నో ఆశలు, అంచనాలతో పెళ్లి చేసుకున్న జంట ఆ తర్వాత ఎలాంటి ఈగోకి పోతుంది, అహం వల్లే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయి. అది ఫ్యామిలీని ఎలా డిస్టర్బ్ చేస్తుందనే విషయాన్ని ఈ మూవీలో చూపించాలనుకున్నారు దర్శకుడు మణికాంత్‌ గెల్లి. అయితే ఎందులోనైనా ఎమోషన్స్, డ్రామా చాలా ఇంపార్టెంట్‌. అది పండితేనే సినిమా రక్తికడుతుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. అయితే `విద్య వాసుల అహం` చిత్రం ఓటీటీలో రూపొందించింది. ఓటీటీ కోసం చేసింది. కంటెంట్‌ పరంగా చిన్న పాయింట్. దానితోనే సినిమాని లాగడం పెద్ద టాస్క్. దర్శకుడు గంటన్నరలోనే ఈ కథని ముగించాడు. అదే ఈ మూవీకి పెద్ద ప్లస్‌ అయ్యింది. కానీ లవ్‌లోగానీ, రొమాన్స్ లోగానీ డెప్త్ లేదు, ఎమోషనల్స్ రక్తికట్టలేదు. డ్రామా అసలే పండలేదు. అన్నింటిని లైటర్‌ వేలో చూపించాడు. మొదటి భాగం  చాలా వరకు చాలా అసహజంగా అనిపిస్తుంది. రొటీన్‌గా అనిపిస్తుంది. పైగా స్లోగా సాగుతుంది. వారి డైలాగ్‌ డెలివరీ, సీరియల్‌ని తలపిస్తుంటుంది. ఫస్టాఫ్‌ లో హీరోహీరోయిన్ల ఇంట్లో పెళ్లి మ్యాటర్‌, వాళ్ల సమాధానాలు రొటీన్‌గా ఉంటాయి. పైగా అవి చాలా వరకు సీరియస్ చూస్తున్నట్టుగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఈగోల మ్యాటర్‌ అంతగా పండలేదు. లాజిక్‌ లెస్‌గానూ అనిపిస్తుంది. 
 

58

అయితే భార్యాభర్తల మధ్య ఈగోలు, మనస్పర్థాలు చాలా ఉంటాయి. ఇంకా బాగా తీయోచ్చు. మరింతగా రక్తికట్టేలా ఆయా సీన్లని డిజైన్‌ చేయోచ్చు. కానీ ఈ సినిమాలో అది జరగడలేదు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలకు సంబంధించిన ఫన్‌ వర్కౌట్‌ కాలేదు. అక్కడక్కడ బలవంతంగా కొంత ఫన్‌ బాగుంది. తప్పితే మిగిలిన సీన్లు అన్నీ ఏదో అలా సాగిపోతున్నట్టుగానే ఉంటుంది. డ్రామా తేలిపోతుంది. భార్య భార్తల మధ్య రొమాన్స్ మోతాదు కూడా తగ్గింది. ఆ ఫీల్ ని‌ ఆడియెన్స్ ఫీల్‌ కాలేకపోతారు. ఇక పెళ్లి కొడుకుకోసం అమ్మాయి పెట్టే కండీషన్లు కొత్తగా ఉన్నా అసహజంగా అనిపిస్తాయి. దీంతో సినిమా ఆశించిన స్థాయిలో ఫన్‌నిగానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ని గానీ ఇవ్వలేకపోయింది. జనరల్‌గా థియేటర్లో కంటే ఓటీటీ సినిమాల్లోనే ఏదైనా ఎక్కువ డోస్‌ ఉంటుంది. కానీ ఇందులో తక్కువ డోస్‌ ఇవ్వడం కాస్త నిరాశ పరిచే అంశంగా చెప్పొచ్చు. టైమ్‌ పాస్‌గా మాత్రం ఓ సారి చూసేలా ఉండే మూవీ ఇది. 
 

68

నటీనటులుః 
వాసు పాత్రలో రాహుల్‌ విజయ్‌ బాగా చేశారు. పాత్రకి న్యాయం చేశాడు. బాగా సూట్‌ అయ్యాడు. ఇటీవల ఆయన మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వెళ్తున్న తీరు బాగుంది. లవర్‌ బాయ్‌గా, కాసేపు ఈగోలకు పోయే భర్తగా మెప్పించాడు. ఇక విద్య పాత్రలో శివానీ రాజశేఖర్‌ సినిమాకి హైలైట్‌ అని చెప్పొచ్చు. ఆమె కళ్లు చాలా బాగున్నాయి. కళ్లతోనే మాట్లాడింది, యాక్ట్ చేసింది. ఎక్స్ ప్రెషన్స్ గతంతో పోల్చితే చాలా బెటర్‌ అయ్యింది. ఆమెలో మంచి నటి ఉన్నారని మాత్రం చెప్పొచ్చు. ఈ రెండే సినిమా మొత్తం సాగుతాయి. ఇక మిగిలిన పాత్రల్లో పేరెంట్స్ గా రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ, రూపలక్ష్మి, రాజశ్రీ నాయర్‌ తమ పాత్రల మేరకు నటించారు. అయితే ఈ పాత్రలు వచ్చినప్పుడు మాత్రం సీరియల్‌ని తలపించడం గమనార్హం. శ్రీనివాస్‌ అవసరాల, అభినయ, శ్రీనివాస్‌ రెడ్డి, తనికెళ్ల భరణి ఇతర పాత్రల్లో ఓకే అనిపించారు. 
 

78

టెక్నీకల్‌గాః 
కళ్యాణ్‌ మాలిక్‌ సంగీతం సినిమాకి ప్లస్‌. చాలా వినసొంపైన పాటలు అందించారు. పాటలు, బీజీఎం బాగుంది. ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్‌ వల్లూరి కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సినిమా కలర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రిచ్‌గానూ ఉన్నాయి. సత్య గిడుతూరి ఎడిటింగ్‌కి ఇంకాస్త పని చెప్పాల్సింది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఉన్నంతలో బాగా చేశారు. ఇక దర్శకుడు మణికాంత్‌ గెల్లి ఎంచుకున్న కథ బాగుంది. ఇటీవల కాలంలో ఇలాంటి రామ్‌ కామ్‌ మూవీస్‌ చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే దాన్ని అంతే బాగా రక్తికట్టించేలా తెరకెక్కించి ఉంటే ఫలితం బాగుండేది. డ్రామా, ఈగోల మ్యాటర్‌ మరింతగా ఫోకస్‌ పెడిగే బాగుండేది. వాటి తాలుకూ డోస్‌ తగ్గింది. 
 

88

ఫైనల్‌గాః విద్య వాసులకు `అహం` తగ్గింది. కానీ సరదాగా చూసే మూవీ. 

రేటింగ్‌ః 2.75
 
తారాగణం:- రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్,  వైవ రాఘవ

 సాంకేతిక సిబ్బంది:
 స్క్రీన్ ప్లే & దర్శకత్వం:- మణికాంత్ గెల్లి 
 బ్యానర్:- ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్
 సమర్పణ: తన్విక జశ్విక క్రియేషన్స్.
 నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి 
సహ నిర్మాతలు: రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట
 తారాగణం:- రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్, వివరరాఘవ
 సంగీతం:- కళ్యాణి మాలిక్
 రచన:- వెంకటేష్ రౌతు
 డీఓపీ:- అఖిల్ వల్లూరి
 ఎడిటర్:- సత్య గిడుతూరి

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
1st T10 • ABDT10
Live
UABUAB
-
YASLYASL
(3.4 ov)31/0
UAB chose to bowl.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Scene Movie Review: సీన్‌ మూవీ రివ్యూ.. సూర్య హాట్రిక్‌ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Summer Holidays Movie Review: సమ్మర్‌ హాలిడేస్‌ మూవీ రివ్యూ.. రోహన్‌, అరుణ్‌ దేవ్‌ నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Ramayana Movie Review: రామాయణం మూవీ రివ్యూ.. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యష్‌ నటించిన మూవీ హిట్టా ఫట్టా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved