#OoruPeruBhairavakonaReview: సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' రివ్యూ
చాలా కాలంగా హిట్స్ లేని సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాకు ఇప్పటికే ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ రోజు రిలీజైంది.
Ooru peru Bhairavakona review
ఫాంటసీ జానర్ ఫిల్మ్స్ అంటే అందరీకీ ఆసక్తే. బాగుంటే చిన్నా,పెద్దా కలిసి వచ్చి మరీ చూస్తూంటారు. అయితే అవి గ్రాఫిక్స్ కూడుకుని ఉంటాయి. టైమ్,బడ్జెట్ భారీగా కోరుకుంటారు. ఏ మాత్రం వాటికి తక్కువ చేసినా మరీ లోకువ చేసేస్తాయి. అందుకే పెద్ద హీరోలే ఇలాంటి ఎటెమ్ట్ లు చేస్తూంటారు. అయితే మీడియం రేంజి సినిమాలు చేసే సందీప్ కిషన్ తో నమ్మి ఈ సినిమా చేసారు. పోస్టర్,ట్రైలర్స్ సినిమాపై ఇంట్రస్ట్ కలగ చేసాయి. వాటికి తగ్గ స్దాయిలో సినిమా ఉందా..అసలు ఈ భైరవ కోన కథేంటి వంటి విషయాలు చూద్దాం.
Ooru peru Bhairavakona review
స్టోరీ లైన్
సినిమాల్లో స్టంట్ మ్యాన్ గా పనిచేసే బసవలింగం (సందీప్ కిషన్) కొద్దిగా స్పీడు ఎక్కువే. అతను కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో దొంగగా మారతాడు. ఓ పెద్ద దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో భైరవకోన అనే ఊరిలోకి వెళ్తారు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. ఆ భైరవకోనలోకి వెళ్ళిన వాళ్ళే తప్పించి ప్రాణాలతో బయటకు వచ్చిన వారు లేరు. అలాంటి గ్రామంలోకి బసవ, తన ఫ్రెండ్ జాన్ (వైవా హర్ష)తోపాటు మరో అమ్మాయి అగ్రహారం గీత (కావ్య థాపర్) ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఏమైంది..అసలు భైరవ కోన లో ఏం జరుగుతోంది. ఎందుకు వెళ్లిన వాళ్ళు వెనక్కి తిరిగి రాలేకపోతున్నారు... అలాగే స్టంట్ మ్యాన్ కాస్తా దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది..బసవకు ఉన్న గతం ఏమిటి..ఆ గతంలో ఉన్న భూమి (వర్ష బొల్లమ్మ) ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Ooru peru Bhairavakona review
ఎనాలసిస్...
దర్శకుడుగా వీఐ ఆనంద్ కు డిఫరెంట్ ఫిల్మ్ లు తీస్తాడనే పేరుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కోరాజా వంటి సినిమాలు చేసిన అనుభవం అతనిది. ఈ క్రమంలోనే ఈ దర్శకుడు సినిమా అనగానే ఎలర్ట్ గా కూర్చుంటాం. ప్రారంభం ఇంట్రస్టింగ్ గానే మొదలవుతుంది. టైటిల్ సీక్వెన్స్ క్యూరియాసిటీ కలగచేస్తుంది. భైరవకోనలోకి వెళ్లినవాళ్లు తిరిగి రారు అని మొదలెట్టి... హీరో అక్కడికి ఫోర్స్ గా అయినా వెళ్లాల్సి రావటంతో ముడిబాగానే వేసారు. అయితే ఆ ముడి విప్పే ప్రాసెస్ సోసాగా మారిపోయింది. ముఖ్యంగా ఇంట్రవెల్ దగ్గరకు వచ్చేసరికి ఆ భైరవకోనలో ఉన్న మెలిక రివీల్ చేసారు. ఆ తర్వాత ఇంక అంతకు మించిన మెలిక కథలో దొరకలేదు. అందులోనూ ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచి గరుడపురాణం, నాలుగు పేజీలు మిస్ అంటూ కాస్త ఎక్కువ గానే చెప్తూ వచ్చారు. కానీ సినిమాలో ఆ గరుడపురాణం ఎపిసోడ్స్ మిస్సయ్యాయి. ఏదో మొక్కుబడిగా ఉందీ అంటే ఉంది అన్నట్లు గరుణపురాణం గురించి చెప్పి కథకు ముడి పెట్టే ప్రయత్నం చేసారు. గరుడ పురాణం ప్రసక్తి లేకపోయినా సినిమాకు వచ్చే నష్టం కానీ, కథలో సమస్య కానీ ఏమీ ఉండదు.
Ooru peru Bhairavakona review
ఇక భైరవకోనలో హీరో ఎంట్రీ అయ్యిన తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లో రిపీట్ కనపడుతుంది. మొదట అవి ఇంట్రస్ట్ గా అనిపించినా తర్వాత తర్వాత అక్కడే కథ తిరుగుతూండటంతో సెకండాఫ్ లో ఆసక్తి పోతూ వచ్చింది.మరో ప్రక్క మనకు దొంగరాముడు అండ్ పార్టీ వంటి సినిమాలు మనస్సులో మెదులుతూంటాయి. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. సామజవరగమన రైటర్స్ ..కు ఫన్ మీద ఉన్న గ్రిప్ ఆ సీన్స్ లో కనపడుతుంది. ఇక హీరోయిన్ తో లవ్ ఎపిసోడ్ అయితే చాలా విసిగిస్తుంది. ఆ ఎపిసోడ్స్ ..గరుడపురాణంలో శిక్షలా అనిపిస్తూంటాయి. ఎందుకంటే లవ్ స్టోరీ చూడటానికి మనం ఈ సినిమాకు రాము. కాబట్టి ఏ మాత్రం ఆ సీన్స్ ఎక్కువైనా చిరాకుగా ఉంటుంది. భైరవ కోన లో ప్రవేశించముందు ..అలాంటి ఎపిసోడ్స్ పెట్టినా ఓకే... ఒక్కసారి కథలోకి వచ్చేసాక..ఇక్కడ ఏం జరుగుతుందనేదే ముఖ్యం. మిగతా ఎలిమెంట్స్ ఎంత గొప్పగా ఉన్నా..ఎలా ఉన్నా ఇంట్రస్ట్ కలిగించవు.
Ooru peru Bhairavakona review
నటీనటుల్లో ...
సందీప్ కిషన్ ఏదో కొత్తదనం తన సినిమాల్లో ప్రయత్నిస్తూనే ఉంటున్నాడు. అదే అతనికి కలిసి వచ్చింది.సినిమాలు ఆడకపోయినా మంచి ఓపినింగ్స్ వస్తున్నాయంటే అదే కారణం. ఈ సినిమా లో స్లాంగ్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ దాకా కొత్తగాట్రై చేసారు. వర్ష బొల్లమ్మ సినిమాలో కీ రోల్. కానీ హీరోతో కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యినట్లు కనిపించదు. ఆమె ఎమోషన్ ని హీరో తన భుజాలుపై వేసుకుటంతలా అనిపించదు. కావ్యా థాఫర్ ..సినిమాకు కాస్తంత గ్లామర్ అద్దే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్, రవి శంకర్, వడివుక్కరసి వంటి నటులు ఛల్తాహై అన్నట్లు తమ సీనియార్టీతో లాగేసారు.
Ooru Peru Bhairavakona
టెక్నికల్ గా ..
దర్శకుడుగా విఐ ఆనంద్..ఓ డిఫరెంట్ ప్రయత్నం చేద్దామనుకున్నారు. అయితే అది కొంతదూరం వెళ్లాక రొటీన్ లోకి జారిపోతోందని గమనించలేకపోయారు. టెక్నికల్ గా అన్ని డిపార్టమెంట్స్ బాగా వర్క్ చేసాయి. శేఖర్ చంద్ర పాటలు జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతం కాదు కానీ సింక్ లో నడిచింది. విఎఫ్ ఎక్స్ ఈ సినిమా స్దాయికి తగ్గట్లు ఉన్నాయి. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ మాత్రం మెచ్చుకోవాలి. భైరవకోన ఊరు డిజైన్ బాగాచేసారు. సినిమాటోగ్రఫీ పెరఫెక్ట్. ముఖ్యంగా మిస్టీరియస్ గా ఉన్న సీన్స్ లో బాగా హైలెట్ అయ్యింది. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాస్త ఎక్కువే ఖర్చుపెట్టారనిపించింది. ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. అయితే ...సెకండాఫ్ లవ్ సీన్స్ ని ట్రిమ్ చేస్తే బాగుందనిపించింది.
Bhairavakona
బాగున్నవి
స్టోరీ ఐడియా, విజువల్స్
వెన్నెల కిషోర్ ఫన్
ఇంట్రవెల్ ఎపిసోడ్
బాగోలేనివి
సెకండాఫ్ లో వచ్చే ప్లాట్ నేరేషన్
లవ్ ట్రాక్
Ooru Peru Bhairavakona
ఫైనల్ థాట్
మరీ తీసిపాడేసి సినిమా కాదు..అలాగని పరుగెత్తుకువెళ్లి చేసేయాలి అనిపించే కంటెంట్ లేదు. ప్రతీ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా అవ్వదు.
Rating:2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Ooru Peru Bhairavakona
బ్యానర్: హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పీ రవిశంకర్, వడివుక్క రాశి తదితరులు
దర్శకత్వం: వీఐ ఆనంద్
నిర్మాతలు: అనిల్ సుంకర, రాజేశ్ దండా
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి: రాజ్ తోట
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
రిలీజ్ డేట్: 2024-02-16