MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Sound Party Review: `సౌండ్‌ పార్టీ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

Sound Party Review: `సౌండ్‌ పార్టీ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

బిగ్‌ బాస్‌ 5 విన్నర్‌ వీజే సన్నీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `సౌండ్‌ పార్టీ`. కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  

5 Min read
Author : Aithagoni Raju
Published : Nov 24 2023, 05:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

`బిగ్‌ బాస్‌ 5` విన్నర్‌గా నిలిచి పాపులర్‌ అయ్యాడు వీజే సన్నీ. ఈ షోతో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. అప్పటి వరకు హీరోగా రాణించేందుకు స్ట్రగుల్‌ అవుతున్న సన్నీకి మంచి బూస్ట్ ఇచ్చింది. బిగ్‌ బాస్‌ 5 విన్నర్‌ అయ్యాక ఆయనకు హీరోగా అవకాశాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఆ మధ్య `అన్‌స్టాపబుల్‌` అనే చిత్రంతో వచ్చాడు. కానీ ఈ మూవీ పెద్దగా ఆదరణ పొందలేదు. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలని `సౌండ్‌ పార్టీ` మూవీ చేశాడు. అప్‌కమింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ శేరి దర్శకత్వం వహించిన మూవీ ఇది. ఫుల్‌ మూన్‌ మీడియా, గజేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకాలపై జయశంకర్‌ సమర్పణలో  రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర,  శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(నవంబర్‌ 24)న విడుదలైంది. మరి సినిమా ఎలా (Sound Party Movie Review) ఉందో తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కథః
కుబేర్‌ కుమార్‌(శివన్నారాయణ) ఫ్యామిలీ ఫస్ట్ జనరేషన్‌ (తాతల నాటి) నుంచి కోటీశ్వరులు కావాలని కలలు కంటారు. కూర్చున్న చోట నుంచి కదలకుండా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ కాలం తీస్తారు. సెకండ్‌ జనరేషన్‌ కూడా అలానే సాగిపోతుంది. మూడో జనరేషన్‌లో కుబేర్‌ కుమార్‌ ఇంకా అదే పోరాటంలో ఉంటాడు. ప్రస్తుత జనరేషన్‌లో కుబేర్‌ కుమార్‌ కొడుకు డాలర్ కుమార్‌(వీజే సన్నీ) సైతం అదే ప్రయత్నాల్లో ఉంటారు. అయితే ఈ సారి కుబేర్‌ కుమార్‌తోపాటు డాలర్‌ కుమార్‌ డబ్బు సంపాదించేందుకు అనేక ప్లాన్స్ వేస్తారు. చివరికి ముప్పై లక్షలు అప్పు చేసి గోరుముద్ద హోటల్‌ ప్రారంభిస్తారు. అది ప్రారంభంలో బాగానే నడిచినా డాలర్‌ కుమార్‌ లవర్‌ సిరి(హృతిక శ్రీనివాస్‌) డాడీ చెడగొడతాడు. దీంతో హోటల్‌ సీజ్‌ అవుతుంది. రోడ్డున పడతారు. అప్పు ఇచ్చిన సేటు నాగభూషణం(నాగిరెడ్డి) డబ్బుల కోసం ఒత్తిడి తెస్తాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని, అప్పు తీర్చాలని ఆలోచిస్తూ తాగుడుకి బానిసలవుతారు. అంతలోనే ఎమ్మెల్యే వరప్రసాద్‌(పృథ్వీ) కొడుకు భువన్‌ ఓ అమ్మాయిని రేపు చేసిన కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు (Sound Party Movie Review) నుంచి బయటపడేందుకు కుబేర్‌ కుమార్‌, డాలర్‌ కుమార్‌లకు రెండు కోట్ల ఆఫర్‌ ఇస్తారు. దొంగతనం కేసు అంటూ అబద్దం చెప్పి వారిని ఆ కేసులో ఇరికిస్తారు. దీంతో ఆ రేప్‌ కేస్‌లో ఈ ఇద్దరికి ఉరిశిక్ష పడుతుంది. మరి దాన్నుంచి ఎలా బయటపడ్డారు? కోటీశ్వరులు కావాలనుకునే వారి కోరిక తీరిందా? డాలర్ కుమార్‌ లవ్‌ స్టోరీ ఏంటి? అనేది మిగిలిన కథ. 

38

విశ్లేషణః 
డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ తో, డబ్బు చుట్టూ కథలతో అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని విజయాలు సాధించాయి, మరికొన్ని రొటీన్‌గా వచ్చి వెళ్లిపోయాయి. అయితే డబ్బు సంపాదించే క్రమంలో జనరేట్‌ అయ్యే కామెడీని నమ్ముకుని మేకర్స్ ఇలాంటి సినిమాలు తీస్తుండటం విశేషం. ఇప్పుడు వీజే సన్నీ హీరోగా నటించిన `సౌండ్‌ పార్టీ` మూవీ కూడా అదే జోనర్‌లో వచ్చింది. పూర్తి ఫన్‌ ప్రధానంగా సిచ్చువేషనల్‌ కామెడీతో ఈ మూవీని తెరకెక్కించారు. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనుకునే ఓ ఫ్యామిలీ స్టోరీ ఇది. ముఖ్యంగా తండ్రీకొడుకుల కథ. సగం సగం నాలెడ్జ్ తో డబ్బు సంపాదించేందుకు వారు అనేక ప్రయత్నాలు  (Sound Party Movie Review) చేస్తుంటారు. బోల్తా పడుతుంటారు. వారు చేసే పనులతో సహజంగా ఫన్‌ జనరేట్‌ చేయాలని, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు సంజయ్‌ శేరి. ఆ విషయంలో కొంత వరకు మాత్రమే సక్సెస్‌ అయ్యాడని చెప్పాలి. 

48

`సౌండ్‌ పార్టీ` సినిమా మొత్తం... సన్నీ ఫ్యామిలీ మొత్తం చేసే పనులు బెడిసి కొట్టడం వల్ల పుట్టే కామెడీతో సాగుతుంది. లైఫ్‌లో సెటిల్‌ కాకపోవడం వల్ల సన్నీ పడే పాట్లు, ప్రియురాలి కోసం వచ్చి అడ్డంగా బుక్‌ కావడం, ఆ తర్వాత జీవితంలో సెటిల్‌ కావాలని, డబ్బులు సంపాదించాలని వాళ్లు హోటల్‌ పెట్టడం, అందులో అమ్మాయిల చేత గోరు ముద్దుల తినిపించడం వంటి సీన్లు నవ్వులు పూయించేలా ఉంటాయి. ఆ తర్వాత అది క్లోజ్‌ కావడం, రోడ్డున పడటం, అప్పు ఇచ్చిన వాడు బెదిరింపులకు (Sound Party Movie Review) దిగడం, తీరా దొంగతనం కేసు అని డబ్బులకు ఆశపడితే రేప్‌ కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లడం, అందులో జైల్‌ నుంచి తప్పించుకునేందుకు అనేకపాట్లు పడుతూ దొరికిపోవడం ఈ క్రమంలో పుట్టే కామెడీని నమ్ముకుని ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో కొంత వరకు మాత్రమే సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. 

58

అయితే చాలా సీన్లు ఆ స్థాయిలో మెప్పించలేకపోయాయి. రక్తికట్టించలేకపోయాయి. రొటీన్‌ రొడ్డకొట్టుడు అనే ఫీలింగ్‌ని కలిగించాయి. సన్నివేశాల ఆధారంగా పుట్టే కామెడీ అనేది కరెక్ట్ గా ఆ సీన్లు పండితేనే వర్కౌట్‌ అవుతాయి. లేదంటే బెడిసికొడతాయి. మొదటి భాగంలో చాలా వరకు అలాంటి సీన్లే ఉన్నాయి. కొన్ని సీన్లు మాత్రమే నవ్వించేలా ఉన్నాయి. హీరోయిన్‌ ఇంట్లో పేరెంట్స్ కి  దొరికిపోయినప్పుడు కవర్‌ చేసే సీన్లు పరమ రొటీన్‌ అనిపిస్తాయి. అలాంటి సీన్లు ఇందులో (Sound Party Movie Review) చాలానే ఉన్నాయి. చలాకీ చంటి సీన్లు కొంత వరకు ఓకే అనిపించాయి. మరోవైపు అప్పిచ్చిన సేటు తో  సీన్లు ఫర్వాలేదనిపించాయి. మిగిలినవి అంతగా వర్కౌట్‌ కాలేదు. ఇక సెకండాఫ్‌లో దొంగతనం కేసు అనుకుంటే రేప్‌ కేసులో ఇరుక్కోవడం ఓకే అనిపించింది. జైల్లో సీన్లు చాలా వరకు పేలాయి. ఓ పాపులర్‌ సినిమా స్ఫూప్‌ ఆశించిన స్థాయిలో పేలలేదు. క్లైమాక్స్ లోని సన్నివేశాలు, బిట్‌ కాయిన్‌ ఎపిసోడ్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది.  మొత్తంగా కొన్ని సీన్లు పేలాయి, కొన్ని రొటీన్‌ గా అనిపించాయి. ఓవరాల్‌గా మాత్రం ఫర్వాలేదనిపించింది.  

68

నటీనటులుః
కుబేర్‌ కుమార్‌ పాత్రలో శివన్నారాయణ, డాలర్‌ కుమార్‌ పాత్రలో సన్నీ అదరగొట్టారు. యాక్టింగ్‌ పరంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సినిమాని ఫన్‌ రైడ్‌గా నడిపించారు. సిరి పాత్రలో హృతిక ఫర్వాలేదనిపించింది. కానీ లవ్‌ స్టోరీకి పెద్దగా ప్రయారిటీ లేదు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కంటే తండ్రీ కొడుకుల కెమిస్ట్రీనే బాగుంది. ఎమ్మెల్యేగా పృథ్వీ మెప్పించాడు. సైంటిస్ట్ గా అలీ కాసేపు మెరిశాడు. అప్పు ఇచ్చే సేటు పాత్రలో నాగిరెడ్డి బాగా నవ్వించాడు. ఆయన తర్వాత చలాకీ చంటి నవ్వులు పూయించాడు. ఇక జైల్లో జైలర్‌గా సప్తగిరి రచ్చ చేశాడు. తన ఎపిసోడ్‌ కూడా సినిమాకి ప్లస్‌ అయ్యింది. సన్నీ మదర్‌గా ప్రియా ఆకట్టుకుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. చిత్ర దర్శకుడి పాత్ర కూడా నవ్వించేలా ఉంది. మిగిలిన పాత్రలు సైతం ఓకే అనిపించాయి. 
 

78

టెక్నీషియన్లుః 
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. మోహిత్‌ రెహమానికి మ్యూజిక్‌ సినిమాకి పెద్ద ప్లస్‌. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్‌ కూడా బాగుంది. సన్నివేశాలను ఎలివేట్‌ చేయడంలో మ్యూజిక్‌ పాత్ర చాలా కీలక పాత్ర పోషించింది. అలాగే శ్రీనివాస్‌ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా ఉంది. కలర్‌ ఫుల్‌గా ఉంది. పాటలు కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. జీపడకుండా నిర్మించారని సినిమా క్వాలిటీ చూస్తే తెలుస్తుంది. ఇక దర్శకుడు సంజయ్‌ శేరి జస్ట్ కామెడీని నమ్ముకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆ విషయంలో ఆయన చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు. అన్ని ఫన్‌ కొంత వరకు వర్కౌట్‌ అయ్యింది. ఆ విషయంలో ఇంకాస్త కేర్‌ తీసుకుంటే (Sound Party Movie Review) బాగుండేది. అయితే ఇలాంటి సినిమాల్లో ఏది పేలుతుందో ఏది పేలదో ముందే ఊహించడం కూడా కొంత కష్టమే. కానీ దర్శకుడు తన బెస్ట్ ఇచ్చాడని అర్థమవుతుంది.

88

ఫైనల్‌గాః జస్ట్ టైపాస్‌ మూవీ.  అంచనాలు లేకుండా చూస్తే ఎంజాయ్ చేయోచ్చు.
రేటింగ్‌ః 2.75

నటీనటులుః వీజే సన్నీ, శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు.

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి
ఎడిటర్ : జి. అవినాష్ 
సంగీతం: మోహిత్ రెహమానిక్ 
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
లిరిక్స్ : పూర్ణ చారి 
నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర 
సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ 
రచన - ద‌ర్శ‌కత్వం :  సంజ‌య్ శేరి 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiku Chiranjeevi Movie Review: కికు చిరంజీవి మూవీ రివ్యూ, గుండె కుడివైపు ఉంటే.. సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved