శర్వా, సిద్ధార్థ్ 'మహాసముద్రం' రివ్యూ
భావోద్వేగాల ప్రేమకథ అని విభిన్న పాత్రలుంటాయని, యాక్షన్ అదే స్థాయిలో ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు. పెరిగిన ఎక్సెపక్టేషన్స్ ని ఈ 'మహాసముద్రం' రీచ్ అవుతుందా, అసలు కథేంటి, 'ఆర్ఎక్స్ 100' స్దాయిలో భాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటంటే...
అర్జన్ (శర్వానంద్) జీప్ కు యాక్సిడెంట్ అవటం..అక్కడ నుంచి కథ ఫాష్ బ్యాక్ లోకి వెళ్ళటంతో మొదలవుతుంది. వైజాగ్ లో ఉండే అర్జున్ (శర్వానంద్) , విజయ్( సిద్దార్థ) ఇద్దరూ మంచి ప్రెండ్స్. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా కలిసే చేస్తూంటారు.. తిరుగుతూంటారు. ఇక విజయ్ కు పోలీస్ ఇన్ స్పెక్టర్ కావాలనే కోరిక. అందుకోసం పరీక్షరాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూంటాడు. సమాజంలో అన్యాయం జరిగితే ఎదుర్కొనే మనస్తత్వం అర్జున్ ది. ఇక అదే ఊళ్లో చుంచు ( జగపతిబాబు) అనే క్యారక్టర్. అతను సముద్రాన్ని నమ్ముకున్న చిన్న స్మగ్లర్. అతని జీవితాశయం సముద్రానికి కింగ్ అవ్వాలని, అతన్ని చుంచు మామా అని పిలుస్తూ,కలుస్తూంటాడు అర్జున్.
Maha Samudram Theme Poster
ఎస్సై అయితే లంచాలు సంపాదించుకోవచ్చు సెటిల్ అవ్వచ్చు అని ఎదురుచూస్తున్న విజయ్ తో డ్యాన్స్ మాస్టర్ మహాలక్ష్మి (అదితిరావు హైదరి) ప్రేమలో పడుతుంది. ఇద్దరూ శారీరకంగా కూడా కలుస్తారు. రేపో మాపో ఉద్యోగం వస్తుంది..ఇంక పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు అనుకున్న సమయంలో అనుకోకుండా ధనుంజయ్ అనే స్మగ్లర్ పై ఎటాక్ చేస్తాడు విజయ్. ధనుంజయ్ చచ్చిపోయాడు అనుకుని, అతని మనుషుల ప్రాణ భయం ఉండటంతో వైజాగ్ వదిలి ముంబై పారిపోతాడు. తన ప్రేయసి మహా లక్ష్మిని అక్కడే వదిలేస్తాడు. దాంతో తప్పనిసరి పరిస్దితుల్లో ఆ మహాలక్ష్మి బాధ్యలను అర్జున్ తీసుకుంటాడు.
Maha Samudram
ఈ లోగా చనిపోయాడనుకున్న ధనుంజయ్ బతికి వస్తాడు. విజయ్ ప్రేమించిన మహాలక్ష్మిని చంపాలనుకుంటాడు. దాన్ని అర్జున్ అడ్డుకునే క్రమంలో ధనుంజయ్ చంపేస్తాడు. ఈ సంఘటనతో అర్జున్ పోలీస్ ల నుంచి తనను తాను రక్షించుకోవటానికి స్మగ్లర్ అవతారమెత్తుతాడు. ధనుంజయ్ చనిపోవడంతో అతని అన్న గూని బాబ్జీ ( రావు రమేష్) చేతిలోకి తమ్ముడి సామ్రాజ్యం వెళ్లిపోతుంది. ఇప్పుడు లోకల్ మాఫియా అయిన అర్జున్, గూని బాబ్జీల మధ్య వార్ మొదలవుతుంది. మరో ప్రక్క మహాలక్ష్మికు కూతురు పుడుతుంది. ఆమె ఆలనా పాలనా భాద్యత తీసుకుంటాడు అర్జున్. ఇలాంటి టైమ్ లో విజయ్ సిటీలోకి వస్తే ..ఏమౌతుంది. ఎలాంటి పరిణామలు జరిగాయి? చివరికి ఈ కథ ఎలా ముగిసిందన్నదే ఈ మహాసముద్రం.
maha samudram
ఎనాలసిస్...
ఈ మధ్యకాలంలో మన తెలుగు తెరపై ఎమోషనల్ కథలు, మెలో డ్రామా నిండిన సీన్లుతో వచ్చే సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే ఏ మాత్రం గాడి తప్పినా అది టీవి సీరియల్ అయ్యిపోతుందనే భయం. అయితే భావోద్వేగాలను పట్టుకుని అప్పటి అత్తారింటికి దారేది, మొన్నటి రంగస్థలం కావచ్చు, నిన్న మజిలి వచ్చాయి. అయితే వాళ్లు ఎంచుకున్న సక్సెస్ ఫార్ములా.. ఎమోషనల్ సినిమాలో ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ ఛేయడం. కానీ ఈ దర్శకుడు ఫన్ వైపు ప్రయాణం పెట్టుకోలేదు. ఎక్కువగా సీన్స్ లో ఇంటెన్స్ ఉండేలా క్రైమ్ డ్రామా ప్లే చేసారు.దానికి లవ్ సీన్స్ తో ట్రీట్ మెంట్ అద్దాడు. పాయింట్ గా కొత్తదేమీ కాదు...అలాంటప్పుడు డీల్ చేసిన విధానం మాత్రం కొత్తగానే ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
కానీ ఇక్కడ చాలా ప్రెడిక్టుబుల్ గా కథనం మారిపోయింది. ఇలాంటి కథల్లో క్యారక్టర్స్ మధ్య సంఘర్షణ కీలకం. దర్శకుడు కూడా ఆ విషయంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాడు. అయితే కథ మొత్తం డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో నడపటంతో ఏ శర్వా,సిద్దార్దలలో ఏ పాత్రను ఫాలో అవ్వాలో తెలియని పరిస్దితి ఏర్పడింది. ఎవరూ కథను లీడ్ చేసే హీరోగా అనిపించరు. దాంతో సినిమాలో హైలెట్ గా నిలిచిన ఇంటెర్వెల్ ముందు వచ్చే ఫైట్ కూడా ఎమోషన్ లేకుండా వచ్చి వెళ్లిపోయింది. కనెక్ట్ కాలేకపోవటం జరిగింది.
Maha Samudram
సెకండాఫ్ లో ట్విస్టులు ఎక్కువటంతో అవి రొటీన్ అయ్యిపోయాయి. శర్వానంద్ తో అనూ ఇమ్మాన్యుయేల్ తో ప్రేమ వ్యవహారం అసంపూర్ణంగా ముగిసిపోవటం ఇబ్బందిగా ఉంటుంది. మంచి ఫ్రెండ్ అనుకున్నవాడు దూరమైతే అంత నెట్ వర్క్, వైజాగ్ అంతా తన చేతిలో ఉన్న వ్యక్తి వెతకలేడా. విలన్ వెతికి సిద్దార్ద్ ని పట్టుకుంటాడు కానీ శర్వా ఎక్కడా అతన్ని వెతికినట్లు కనిపించడు. వెళ్లిపోతే వెళ్లిపోయాడులే అని వదిలేసినట్లు ఉంటుంది. దాంతో ఆ పాత్ర ప్యాసివ్ గా మారి భారంగా కథనం సాగుతుంది. ముఖ్యంగా సిద్దార్ద్, శర్వా రెండు పాత్రల్లో ఇంటర్వెల్ ముందు సిద్దార్ద్ కే విలన్ ని చంపేసాడు అనే కాంప్లిక్ట్ ఉంటుంది కానీ శర్వాకు అదీ ఉండదు. మనకు శర్వా గత చిత్రం రణరంగం గుర్తు వస్తుంది. సినిమాలో రెండు మూడు సీన్స్ తప్ప చెప్పుకోడానికి ఏమీ లేదు.
Maha Samudram
హైలెట్స్
శర్వా,సిద్దార్ద్ లను ఎంచుకోవటం
సినిమాటోగ్రఫీ
రావు రమేష్
మైనస్ లు
రొటీన్ గా ఊహించగలిగే కథ
వీక్ నేరేషన్
సెకండాఫ్
Maha Samudram
టెక్నికల్ గా...
స్క్రిప్టే ఈ సినిమాకు మైనస్ గా నిలిచింది. అయితే దర్శకుడు కథ చెప్పే విధానం..నాచురల్ లోకేషన్లలో, సహజమైన లుక్స్,అందుకు తగ్గ మేకింగ్ తో ఈ జనరేషన్ ను ఆకట్టుకునేలా చేసారు. సినిమాను నాచురల్ లోకేషన్లు, నాచురల్ ప్రాపర్టీస్ మధ్య తీయడం ఓ కొత్త ఎక్సపీరియన్స్ ఇచ్చింది. డైరక్టర్ ప్రత్యేకత ఏమిటంటే, సన్నివేశాలని కథని దాటి వెళ్లకుండా చూడటం. వీలయిన చోటల్లా ఎమోషన్ తో లాక్ చేస్తూ డిటైల్డ్ నెరేషన్ చేసారు.అయితే ఈ క్రమంలో సినిమా స్లో అవుతున్నట్లు,ఏమీ జరగనట్లు,ఒక్కోసారి రిపీట్ అవుతున్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ లో జోష్ తీసుకొచ్చారు. సినిమా సెకండాఫ్ లో ప్రవేశించాక, ఎమోషనల్ డోస్,మెలో డ్రామా పెంచాడు దర్శకుడు.
Maha Samudram
అయితే చిత్రంగా సెకండాఫ్ మొత్తాన్ని జగపతిబాబు, రావు రమేష్ కలిసి శర్వాని, సిద్దార్దని డామినేట్ చేసే స్దితి వచ్చేసింది. చాలా చోట్ల డైలాగులుతో కథ నడుస్తుంది. క్లయిమాక్స్ కు లీడ్ చేసే రీజన్ కూడా మరీ బలంగా ఏమీ అనిపించదు. సాంకేతికంగా సినిమాలో పాటలు జస్ట్ ఓకే . నేపథ్యసంగీతం బాగుంది. అజయ్ భూపతి ఫ్రేమింగ్, డిటైల్డ్ ఎక్స్ ప్రెషన్లు చాలాసార్లు వర్మను గుర్తుకు తెస్తాయి. అవి గతంలోని ఆయన సినిమాల్లోనూ వున్నాయి. సినిమా మేకింగ్ లో కన్నా, క్యారక్టర్స్ రూపకల్పన మీద డైరక్టర్ ఎక్కవ దృష్టి పెట్టారు. ఫొటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం చాలా లెగ్తీ సినిమా చూసిన ఫీల్ ని పోగెట్టేలా ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
Maha Samudram
నటీనటుల్లో ...
సిద్దార్ద్, శర్వానంద్, రావురమేష్, జగపతిబాబు తదితరులు పెర్ ఫార్మెన్స్ లు సినిమాకు ప్లస్ అయ్యాయి. పెయిన్ ఫీలయ్యే పాత్రలో అదితిరావు హైదరీ చాలా బాగా చేసింది. ఈ సినిమాని ఆమె క్యారక్టర్ ని నమ్మే చేసారనిపిస్తుంది. ఆ స్దాయి ఫెర్ ఫార్మర్ కాబట్టే అంత బరువైన పాత్ర ని మోయగలిగింది. శర్వానంద్,సిద్దార్ద్ కూడా ఫస్ట్ సీన్ నుంచి డిఫరెంట్ ఫెర్ ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేసారు. చిన్న నటులు కూడా మంచి నటన అందించారు.
Maha Samudram
ఫైనల్ ధాట్
శర్వానంద్ కు... ఇంతకు ముందు చేసింది 'రణరంగం' అయితే ఇది 'మహా రణరంగం'
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
Maha Samudram Theme Poster
ఎవరెవరు...
నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, జగపతి బాబు, శరణ్య తదితరులు
సంగీతం: చేతన్ భరద్వాజ్,
కెమెరా: రాజ్ తోట,
ఎడిటింగ్: ప్రవీణ్ కెఎల్,
పాటలు: భాస్కరభట్ల, చైతన్య ప్రసాద్, కిట్టు విస్సాప్రగడ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి
నిర్మాణం: ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేదీ: 14-10-2021