MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • షారూఖ్ ‘పఠాన్‌’ మూవీ రివ్యూ

షారూఖ్ ‘పఠాన్‌’ మూవీ రివ్యూ

 ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌తో రేగిన చిచ్చు కారణంగా అందరి దృష్టి ‘పఠాన్’పై పడింది. ‘జీరో’ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ లభించాయి. హిందీలో పాటు ‘పఠాన్’ తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ అయ్యి బుధవారం జనం ముందుకు వచ్చింది.

4 Min read
Surya Prakash
Published : Jan 25 2023, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Pathaan Movie Review

Pathaan Movie Review

బాలీవుడ్ బాద్షా గా చెప్పబడే షారూఖ్ ఖాన్ నాలుగు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించారు. ఆ సెలబ్రేషన్స్ ..అడ్వాన్స్ బుక్కింగ్స్, ఓపినింగ్స్ రూపంలో కనపడుతున్నాయి. యాక్షన్ స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం పాటతో వివాదం, ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసింది. స్టార్ పవర్, స్టైల్ , యాక్షన్, యాటిట్యూడ్, యాక్టింగ్... కలగలిసిన చిత్రంగా రూపొందిన పఠాన్ మనకు నచ్చుతుందా..అసలు ఈ చిత్రం కథేంటి...దీపికా పాత్ర ఏమిటి... షారూఖ్ కు గత వైభవం తెచ్చి పెడుతుందా, సినిమాలో సల్మాన్ పాత్ర ప్రత్యేకత ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

29


కథాంశం:

జిమ్ (జాన్ అబ్రహం)కు భారత దేశం అంటే మంట. దాని పరువుని, ప్రతిష్టను మంట గలిపేయాలని, అవసరమైతే దేశాన్ని నాశనం చేసేయాలని అతను ఆలోచన. లక్ష్యం..నిజానికి అతను ఇక్కడ RAW లో పనిచేసి వాడే...అయితే అతనికి ప్రొపిషనల్ గా జరిగిన కొన్ని సంఘటనలతో కుటుంబాన్ని కోల్పోయి ,విరక్తి భావం పెంచుకుంటాడు. అలాంటి జిమ్ కు ఓ ఆఫర్ వస్తుంది. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 (జమ్ము కాశ్మీర్ స్పెషల్ స్టేటస్) రద్దు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన పాకిస్తాన్ కల్నల్ ఒకరు ఓ మిషన్ అప్పగిస్తాడు. అతనికి తోడుగా రుబై(దీపిక పదుకొణె)  అనే ex ISI ఏజెంట్ తోడుగా ఉంటుంది. తన మిషన్ లో భాగంగా జిమ్... మన దేశంపై రక్తబీజ్ అనే బయో వార్ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. వైరస్ తో దేశ జనాలని చంపాలనుకుంటాడు.  అప్పుడే ఆ వార్ ని అడ్డుకునేందుకు సమర్దుడైన ఏజెంట్  పఠాన్ (షారుఖ్ ఖాన్) రంగంలోకి దూకుతాడు. 

 అనాథ అయిన పఠాన్ (షారూఖ్ ఖాన్) దేశాన్నే తన తల్లిగా భావిస్తూంటాడు. తన జీవితంలో  ఆమె రుణం తీర్చుకోవడానికి ఇండియన్ ఆర్మీలో చేరతాడు. ఓ ఆపరేషన్ నిమిత్తం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలను రక్షించి, కొద్దిలో చావు తప్పించుకుని కోమాలోకి వెళ్తాడు. తమ ప్రాణాలను కాపాడిన అతన్ని అక్కడి వారు సొంత బిడ్డగా ఆదరించి, ‘పఠాన్’ అని పిలుచుకుంటారు. అప్పటి నుండీ అదే అతని అసలు పేరుగా మారుతుంది. అలాంటి.జోకర్  (JOCR) అనే టీమ్ ను పఠాన్ ఎందుకు ఏర్పాటు చేస్తాడు? రక్త భీజ్ తో జరిగే అనర్దాలు ఏమిటి.. పఠాన్ ఆ బయోవార్ ని ఆపగలిగాడా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


   

39
Pathaan Movie Review

Pathaan Movie Review

 విశ్లేషణ:

'పఠాన్' కథగా చెప్పాలంటే ఎన్నో సార్లు చూసిందే. బాగా తెలిసిందే. అయితే దాన్ని ఎంగేజింగ్ గా చెప్పాలనే ప్రయత్నం చేసాడు డైరక్టర్. ఫస్టాఫ్ ట్విస్ట్ లతో నడిచిపోయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఎపిసోడ్ మధ్యలో ఆపి ఇచ్చారు. అది ఊహించగలిగిన ట్విస్ట్ అయినా బాగానే ఉందనిపిస్తుంది. అయితే సెకండాప్ లో వచ్చే మిగతా ట్విస్టులలో కిక్ లేదు. అయితే డైరక్టర్ పూర్తిగా షారూఖ్ ఖాన్ లోని యాక్షన్ ని బయిటకు తీసుకువచ్చారు. దాంతో సినిమా నిండా యాక్షన్ ఎపిసోడ్స్... ఒకరినొకరు కాల్చుకోవడాలు, పేల్చుకోవడాలుతో నిండిపోయింది. మధ్య మధ్యలో దేశభక్తి డైలాగులు మనని పలకరిస్తూంటాయి. దేశభక్తి సినిమాలు బాలీవుడ్ లో తగ్గాయి అనుకున్న టైమ్ లో ఈ సినిమా వచ్చి  మళ్ళీ ఆ సినిమాలను గుర్తు చేసింది. అలాగే సినిమా చూస్తున్నంత సేపూ ఇదే దర్శకుడు వార్ సినిమా గుర్తు వస్తుంది. అయితే ఆ చిత్రంలో ఎమోషన్ ఇక్కడ అంతగా లేదు.

49
Pathaan Movie Review

Pathaan Movie Review

అలాగే విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ఆఫ్ఘానిస్తాన్ విలేజ్ డ్రామా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు.  అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్‌ బ్యానర్ లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు రిఫరెన్సులు ఇందులో కనిపిస్తాయి. MCU (Marvel Cinematic Universe), లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లాగే  ప్లాన్ చేసారు. అయితే అది వర్కవుట్ అయ్యింది కూడా. ఇంటర్వెల్ తర్వాత  పఠాన్ కోసం టైగర్ సల్మాన్ ఖాన్ రావటం, ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమా చివర్లో  సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్ ఖాన్ కూర్చుని మాట్లాడుకునే సీన్ ని సైతం అభిమానులకు కిక్కిచ్చేలా చేశాడు డైరక్టర్. అయితే క్లైమాక్స్, ఇంకొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ...Mission Impossible, Fast and the Furious వంటి సినిమాలకు బ్లూ ప్రింట్ గా అనిపిస్తాయి.
 

59
Pathaan Movie Review

Pathaan Movie Review


టెక్నికల్ గా చూస్తే...
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తప్పిస్తే మిగతాదంతా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. ప్రారంభంలో జాన్ అబ్రహం, షారుఖ్ మధ్య వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. రష్యా,ఆప్గనిస్దాన్ ఇలా వరసపెట్టి దేశాలు చూపినప్పుడు కెమెరా వర్క్ .. విజువల్ వండర్‌గా అనిపించేలా చేసారు. ఇక దీపిక ఇంట్రడక్షన్ సాంగ్ లో ఆమె అందాలు, యాక్షన్ సీక్వెన్స్‌కు ఫస్టాఫ్ కు గిట్టుబాటు అనిపిస్తాయి. సెకండాఫ్ సల్మాన్ ఖాన్ తో షారూఖ్ సీన్స్ హైలెట్ గా అనిపిస్తాయి. అలా కమర్షియల్ వైబులిటీ వచ్చేలా ప్లాన్ చేసుకున్న స్క్రిప్టు ఇది. డైరక్టర్ సిద్దార్ద్ ఆనంద్..హాలీవుడ్ సినిమాలనుంచి ప్రేరణ పొంది తీసిన సీన్స్ ...పెద్ద తెరపై నిండుగా మెస్మరైజింగ్ గా అనిపిస్తాయి. Mr and Mrs Smith ఆధారంగా ఇదే డైరక్టర్ చేసిన Bang Bang  కూడా చాలా సార్లు మనకు హీరోయిన్ ట్రాక్ లో గుర్తు వస్తూనే ఉంటుంది. ! డైలాగులు, పాటలు, రీరికార్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అవుతాయి. సినిమాటోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్‌. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు మరోసారి తమ సత్తాని చాటాయి.
 

69
Pathaan Movie Review

Pathaan Movie Review


నటీనటుల్లో ..

ఇక షారూఖ్ ఖాన్ మనకు ఇండియన్  Vin Diesel లేదా Tom Cruise లా కనిపిస్తారు. ఇంకొన్ని సార్లు  Robert Downey Jr ...Tony Starkలాగాను కనిపిస్తూంటారు. వయస్సు మీద పడుతున్నా తగ్గది ఉత్సాహంతో చేసే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. పాకిస్తాన్  ISI ఏజెంట్ గా దీపిక కనపడటప్పుడు Scarlett Johansson గుర్తు వస్తే అది మీ తప్పు కాదు. జాన్ అబ్రహం ఫెరఫెక్ట్ బాడీతో విలన్ గా బాగా చేసారు. కానీ షారూఖ్ కు తగ్గ విలన్ అనిపించరు.
 

79
Pathaan Movie Review

Pathaan Movie Review


ప్లస్ లు ...

షారూఖ్ స్క్రీన్ ప్రెజెన్స్
ఇంటర్వెల్ తర్వాత ట్రైన్ ఫైట్ సీక్వెన్సు
 సల్మాన్ ఖాన్  కామెడీ టైమింగ్  
దీపికా అందాలు

మైనస్ లు
ఊహకు అందే కథ,కథనం
బాగా హాలీవుడ్ రిఫరెన్స్ లు వాడటం
ఎమోషన్ కంటెంట్ బలంగా లేకపోవటం

89
Pathaan Movie Review

Pathaan Movie Review

ఫైనల్ థాట్
షారూఖ్ ఖాన్  రీఎంట్రీ సినిమా బాగుంది కానీ ఇంకాస్త కొత్తగా ఉంటే మరింత బాగుండేది. షారూఖ్ రొమాంటిక్ యాంగిల్ ఉన్నంతలో ఆవిష్కరిస్తే ఫ్యాన్స్ కు ఇంకా బాగా నచ్చేది.
Rating:2.75
---సూర్య ప్రకాష్ జోశ్యుల

99
Pathaan Movie Review

Pathaan Movie Review


నటీనటులు : షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం, అశుతోష్ రానా,  డింపుల్ కపాడియా తదితరులతో పాటు అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవన్
ఛాయాగ్రహణం : సంచిత్ పౌలోస్
స్వరాలు : విశాల్ - చంద్రశేఖర్ 
నేపథ్య సంగీతం : సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా   
నిర్మాత : ఆదిత్య చోప్రా
కథ, దర్శకత్వం : సిద్ధార్థ్ ఆనంద్
విడుదల తేదీ: జనవరి 25, 2023  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved