#Paramporul: 'పరంపోరుల్' (తెలుగు) OTT మూవీ రివ్యూ!
కాన్సెప్ట్, జోనర్లు ఇవన్నీ తెలిసేలా టైటిల్ పెడితే మరింత మందికి బాగా రీచ్ అవుతుంది. అలాగే లవ్ .. రొమాన్స్ .. కామెడీ అనేవాటికి ...
Paramporul movie review
ఓటిటిలు వచ్చాక థ్రిల్లర్స్ కు బాగా ఆదరణ పెరిగింది. అలాగే డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్ లో రిలీజ్ కాకపోయినా ఓటిటిలో వచ్చి పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో లాస్ట్ ఇయిర్ తమిళంలో విడుదలై సక్సెస్ అయిన సినిమాల 'పరంపోరుల్' కూడా ఓటిటిలోకి వచ్చింది. 2023 సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చిన ఈ చిత్రం తాజాగా పిబ్రవరి 1 ,2024 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ఎలా ఉంది..చూడదగ్గదేనా వంటి విషయాలు చూద్దాం.
Paramporul Review
స్టోరీ లైన్
పైకి ఓ ఆర్ట్ గ్యాలరీ నడిపిస్తూ ..నిజానికి పురాతన పంచలోహ విగ్రహాలు స్మర్గింగ్ చేస్తూంటాడు సర్గుణన్ . అలా ఓ సారి ఓ విగ్రహం తీసుకు వస్తూంటే యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఆ విగ్రహం బాదా ఖరీదైందని సరిగ్గా డీల్ చేస్తే 50 - 60 కోట్లు వస్తాయని పోలీస్ ఆఫీసర్ మైత్రేయన్ (శరత్ కుమార్) కు తెలుస్తుంది. అతను ఫస్ట్ నుంచి లంచగొండే. దాంతో ఈ విగ్రహం అమ్ముకుని సెటిలై రిటైర్ అయ్యిపోదామనుకుంటాడు. అయితే ఈ విగ్రహంకు ఉన్న లింక్ .. గౌరీ(అమితాశ్ ప్రధాన్).మిడిల్ క్లాస్ కుర్రాడైన అతనికి చెల్లికి అనారోగ్యం కావడంతో డబ్బు బాగా అవసరం. దాంతో గౌరీ సాయింతో ఆ విగ్రహాన్ని అమ్మాలని మైత్రేయన్ ప్లాన్ చేస్తాడు. బెదిరించి ఒప్పిస్తాడు. అయితే ఒకరిపై మరొరికి అపనమ్మకం. మధ్యలో మరో మాఫియా ముఠా. అలాంటి వీళ్లద్దరూ కలిసి ఆ విగ్రహాన్ని అమ్మగలిగారా...చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది...
థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఫార్మెట్ ఉంటుంది. ఈ సినిమాల్లో స్టోరీ లైన్ ఎలా ఉన్నా..ఎంత ఇంట్రస్టింగ్ గా చెప్పామన్నదే సినిమాని నిలబెడుతుంది. అందులోనూ కథలో కొంత దూరం వెళ్లాక కొత్త పాత్రలు ప్రవేశించడం, అప్పుడే వాళ్ళ కథని ఫ్రెష్ గా చెప్పటం కలిసి వచ్చింది. నిజానికి ఇన్వెస్టగేషన్ థ్రిల్లర్ లో ఒకొక్క ముడి వీడినప్పుడు థ్రిల్ రావాలి. ఇందులో మాత్రం ఆ ముడి కాస్త లేటుగానే పడిందని చెప్పాలి. అందుకు కారణం సబ్ ప్లాట్స్ ఎక్కువైపోవడమే. కథ, ఉపకథలు ఈ రెండు కలిసి ప్రయాణం చేసే సెకండాఫ్ లో థ్రిల్స్ బాగా పండాయి. ఒక కథ ఆసక్తికరంగా చెప్పడానికి సబ్ ప్లాట్ సహకరిస్తుంది తప్పితే.. మూల కథనే ఉపకథలు డామినేట్ చేస్తే అది టార్గెట్ మిస్సైనట్లే. అయితే ఈ సినిమా లో మనని థ్రిల్ చేసే అంశాలు బాగా వున్నాయి. కాన్సెప్టు ఎలాంటిది అయినా ఎక్కడా హింసకు శృతిమించ కుండా రక్తపాతనికీ, అశ్లీలతకు తావు లేకుండా సినిమాని మలిచారు. పెద్దగా అంచనాల్లేకుండా చూస్తే బాగుందనిపిస్తుంది. టైటిల్ తెలుగులో డబ్బింగ్ వేరేది పెట్టి ఉండాల్సిందేమో. , కాన్సెప్ట్, జోనర్లు ఇవన్నీ తెలిసేలా టైటిల్ పెడితే మరింత మందికి బాగా రీచ్ అవుతుంది. అలాగే లవ్ .. రొమాన్స్ .. కామెడీ అనేవాటికి అసలు చోటే లేని కాన్సెప్ట్ ఇది. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రీ క్లైమాక్స్ - క్లైమాక్స్ ప్రాణమనే చెప్పాలి. క్లైమాక్స్ లోని ట్విస్టు ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.
Paramporul
టెక్నికల్ గానూ ...
ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. పాండి కుమార్ ఫొటోగ్రఫీ .. యువన్ శంకర్ రాజా కెమెరా వర్క్ సినిమాలో థ్రిల్స్ కు ప్రాణం పోసాయి. నగూరన్ రామచంద్రన్ ఎడిటింగ్ కూడా ఫెరఫెక్ట్. ల్యాగ్ సీన్స్ కనిపించవు.
శరత్ కుమార్ ఇందులో నెగెటివ్ ఛాయలున్నపోలీస్ గా కనపడతారు. డబ్బు కోసం ఏమైనా చేసే మైత్రేయన్‌గా వైవిధ్యమైన నటన ప్రదర్శించారు. సోదరిని బతికించుకునేందుకు దేనికైనా సిద్ధపడే అన్నయ్యగా గౌరి పాత్రలో అమితాష్ జీవించాడు అని చెప్పాలి.
Paramporul
చూడచ్చా
‘పరంపోరుల్’ అంటే .. పవర్స్ కలిగిన వాడు. టైటిల్ కు జస్టిఫికేషన్ బాగా చేసారు. ఈ మధ్య కాలంలో ఓటిటిలలో వచ్చిన ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాలలో ఇది ఒకటి. ఓ లుక్కేయచ్చు.
Rating:2.75
Paramporul movie review
నటీనటులు: శరత్ కుమార్, అమితాష్ ప్రధాన్, కశ్మీరా పరదేశి, బాలాజీ శక్తివేల్, టి. శివ, విన్సెంట్ అశోకన్ తదితరులు;
సంగీతం: యువన్ శంకర్ రాజా;
ఛాయాగ్రహణం: ఎస్. పాండికుమార్;
కూర్పు: నగూరన్ రామచంద్రన్;
నిర్మాతలు: మనోజ్, గిరీశ్;
రచన, దర్శకత్వం: సి. అరవింద్ రాజ్;
ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఈటీవీ విన్.