Prati Roju Pandage: ‘ప్రతిరోజు పండగే’ రివ్యూ..!

First Published 20, Dec 2019, 12:47 PM

ప్రతీ రోజు పండగ చేసుకోవాలని ఎవరికి ఉండదు. అయితే అవకాశం,సమయం రెండూ కలిసి రావాలి. అలాగే పండుగ జరిపించేవాళ్లూ కావాలి.  ఓ పెద్దాయనకు కాన్సర్ వస్తే కొడుకులు ఎవరూ పట్టించుకోకపోతే మనవడు వచ్చి మ్యాజిక్ చేసి  ఆకాశాన్ని అంటే ఆనందాన్ని ఇచ్చి, కొడుకులను దగ్గర చేస్తాడు.

(--- Review By సూర్య ప్రకాష్ జోశ్యుల) ప్రతీ రోజు పండగ చేసుకోవాలని ఎవరికి ఉండదు. అయితే అవకాశం,సమయం రెండూ కలిసి రావాలి. అలాగే పండుగ జరిపించేవాళ్లూ కావాలి. ఓ పెద్దాయనకు కాన్సర్ వస్తే కొడుకులు ఎవరూ పట్టించుకోకపోతే మనవడు వచ్చి మ్యాజిక్ చేసి ఆకాశాన్ని అంటే ఆనందాన్ని ఇచ్చి, కొడుకులను దగ్గర చేస్తాడు. ప్రతి రోజు పండగ జరిపిస్తాడు..ఇదీ మనకు ట్రైలర్ ద్వారా అర్దమైన విషయం.వినటానికి బాగున్న ఈ లైన్..సినిమాగా ఎంతవరకూ సెటిలైంది...కొత్తగా అనిపించే కథగా ఎలా విస్తరించారు. ఎమోషన్స్ ,కామెడీ బాగా పండాయా..సాయి తేజ కెరీర్ కు ప్లస్ అవుతుందా వంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానం రివ్యూలో చూద్దాం.

కథేంటి.. : రాజమండ్రిలో ఉండే రఘు రామయ్య (సత్యరాజ్) ఒంటరిగా తన ఇంట్లో మహేష్ (మహేష్ ఆచంట)తో కాలక్షేపం చేస్తూంటాడు. అయితే ఓ రోజు ఆయనకు తను కాన్సర్ తో ఎక్కువ కాలం బ్రతకననే విషయం తెలుస్తుంది. ఉన్న ఈ కొద్ది రోజుల్లో తన కొడుకులు,కూతురు, మనవలతో గడపాలని అనిపిస్తుంది. కానీ వాళ్లంతా విదేశాల్లో సెటిలై, బిజీ జీవితాలు గడుపుతున్నారు. వాళ్లకు విషయం చెప్పినా, వీలు చూసుకుని వస్తామంటారే కానీ వెంటనే రారు. ఈ నేపధ్యంలో ఆయన మనవడు సాయి (సాయి తేజ)..తాతయ్యా..నేను ఉన్నా అంటూ రాజమండ్రిలో దిగుతాడు. తాత జీవితంలో మిగిలిపోయిన కోరికలు తీర్చుకోవటానికి, చెయ్యాలనుకున్న పనులు పూర్తి చేయటానికి సాయం చేయటం మొదలెడతాడు.

ఆ పెద్దాయన కోరికల్లో ఒకటి...తన పాత స్నేహితుడు(విజయ్ కుమార్) కుమార్తె రాశి ఖన్నాని తన మనవడుకి ఇఛ్చి పెళ్లి చేయాలి. ఆమె ఓ టిక్ టాక్ సెలబ్రెటీ. ఆమెను లైన్ లో పెట్టాలని ఫిక్స్ అవుతాడు. ఈ లోగా సాయి తండ్రి రావు రమేష్...అక్కడ అమెరికాలో మురళి శర్మ కూతురుని తన కొడుక్కు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఇప్పుడు సాయి పెళ్లికి అదో ఇబ్బంది. ఇక తాతకు చెందిన లాండ్ వివాదంలో సింక్ బ్రదర్శ్ (సత్యం రాజేష్, అజయ్) ఎంటరవుతారు. వాళ్లని డీల్ చేస్తాడు. ఇలా తాతని ఆనందంగా ఉంచటం కోసం చేసే పనుల్లో సాయికి రకరకాల సమస్యలు ఎదురౌతాయి. వాటిని ఎలా ఎదుర్కొని ప్రతీ రోజు పండగలా తాతను బ్రతికి ఉన్న నాలుగు రోజులు ఉంచగలిగాడు. తన తాతతో గడపటానికి టైమ్ సరిపోదంతూ తప్పుకునే తన ఫ్యామిలికు ఎలా బుద్ది చెప్తాడు, రాశిఖన్నా తో ప్రేమ మ్యాటర్ పెళ్లి దాకా వెళ్లిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎమోషనల్ ఎంటర్టైనరే కానీ.. : సాగితే రోగం అంత భోగం లేదని సామెత. చక్కగా కాలక్షేపం అందిస్తూ...ఆనందంగా చూసుకునే మన వాళ్లు చుట్టూ ఉంటే కాన్సర్ వస్తే ఏంటి..మరొకటి వస్తే ఏంటి ..మాట్లాడుతూ..మాట్లాడుతూ మృత్యువుని ముద్దెట్టేసుకోవచ్చు ...ఇదే ఈ కథ ద్వారా చెప్పారని అనను కానీ..అటు వంటి మృత్యు ముఖంలో ఉన్న వాళ్లను పెద్దైన,చిన్నైనా కాస్తంత పట్టించుకుంటే వాళ్లు చివర రోజుల్లో చింత లేకుండా ప్రయాణానికి రెడీ అవుతారు..వాళ్లకూ ఆనందం, మనకూ తృప్తీ అని చెప్పే ప్రయత్నం చేసారు. పాయింట్ మంచిదే. మనకు తెలిసిందే. మనకు కనెక్ట్ అయ్యేదే. అయితే ఈ కథని ప్యాక్ చేసే విధానమే పాత చింతకాయ పచ్చడి ఫీల్ తెచ్చేసింది.

అప్పట్లో గురువుగారు దాసరి ఇలాంటి సెంటిమెంట్ కలబోసిన ఫ్యామిలీ సినిమాలు అప్పుడప్పుడూ తీసి హిట్ కొడుతూండేవారు. అదే ఇంటిపేరు గల ఈ దర్శకుడు కూడా ఆ దారిలోనే ప్రయాణం పెట్టుకున్నట్లున్నాడు. దాసరి గారి తొలి సినిమా తాత-మనవడులాగ..ఇదీ ఓ తాతగారు..మనవడు కథే. కొడుకులు హ్యాండిస్తే.. మనవడు వచ్చి చెయ్యిచ్చి తాతకు తందానా అంటాడు. ఇది యూనివర్శిల్ ఫార్మలానే. ఫార్ములా తో సినిమా తీస్తే కాస్త రొటీన్ అనిపించవచ్చేమో కానీ పాసై పోకుండా మాత్రం పోదు. అదే మారుతి,నిర్మాతలు నమ్మినట్లున్నారు. హీరోని నమ్మించినట్లున్నారు.

ఫస్టాఫ్ చివరి దాకా అంటే ఇంటర్వెల్ దాకా బాగుందనిపించింది. సింపుల్ కథనే మంచి కామెడీ, ఎమోషన్ సీన్స్ తో బాగా చేసాడనిపించింది. అయితే సెకండాఫ్ లోకు ఎంట్రి ఇచ్చిన దగ్గర నుంచి కథ కదలటం ఆగిపోయింది. ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉండిపోయింది. డెప్త్ లోకి వెళ్లకుండా పైపైనే రాసుకున్న సీన్స్ రిపీట్ అనిపించాయి. అవసరానికి మించి ఎక్కువ సెంటిమెంట్ ని అద్దే ప్రయత్నం చేసారు. సాయి తేజ పాత్ర కూడా సెకండాఫ్ లో చాలా తక్కువే.

స్టోరీ ట్రీట్మెంట్ లో అంత ఎమోషన్స్ ఫీలయ్యే గొప్ప మలుపులు లేకపోవటంతో...ఇక్కడ ప్రీ క్లైమాక్స్ లో ఒక్క సారి ఏడిపించకపోతే బాగోదు, సత్యరాజ్ కొడుకుల్లో మార్పు వచ్చేయాలి ఇలా ఆలోచించి ఫోర్సెడ్ గా సీన్స్ పెట్టినట్లు అనిపించింది. సెకండాఫ్ లో మారుతి రైటింగ్ మ్యాజిక్ ఒక్క సారిగా మాయమైపోయింది.క్లైమాక్స్ అయితే మరీను. యంగ్ జనరేషన్ ఎన్నారై లు ఎలా పెద్దవాళ్లైన తమ తల్లి,తండ్రులను చూసుకోవాలో చెప్తూ స్పీచ్ లు ఇచ్చారు. దాంతో ఇంటర్వెల్ దగ్గర పడటం మొదలైన గ్రాఫ్ మెల్లిగా పడిపోవటం మొదలైంది. ప్రీ క్లైమాక్స్ లో మళ్ళీ బ్యాక్ కు వెళ్లి నిలబెట్టే ప్రయత్నం చేసారు. అయితే ఆధునిక స‌మాజంలో మాన‌వ సంబంధాలు బంధాలు అనుబంధాలు ఎలా ఉన్నాయి? అన్న‌ చర్చకు ఈ సినిమా పూనుకోవటం మాత్రం గొప్ప విషయం. అందుకు దర్శక,రచయిత మారుతిని అభినందిచాల్సిందే.

కాపీ రాగమా? : తాతా మ‌న‌వ‌ళ్ల క‌థ‌లో హీరోయిన్ తో రొమాన్స్ కలిగలిపి కొట్టడంతో `శ‌త‌మానం భ‌వ‌తి`కి కాపీ సినిమా అని ప్ర‌చార‌మైంది. అయితే ఆ సినిమాకు దీనికి ఫ్యామిలీ ఎమోషన్స్ లో తప్ప పోలిక లేదు. అలాగే హాలీవుడ్ చిత్రం ఫేర్ వెల్ కు దీనికి కేవలం స్టోరీ లైన్ లో సిమిలారిటి తప్ప ట్రీట్మెంట్ కు సంభంధం లేదు.

మేజర్ హైలెట్స్ : స్టోరీ లైన్ గా సీరియస్ డ్రామా అయిన ఈ చిత్రం మారుతి ...తనదైన మార్క్ ఫన్ తో కామెడిగా మార్చేసాడు.ముఖ్యంగా రావు రమేష్ కామెడీ సీన్స్ మేజర్ హైలెట్. అలాగే టిక్ టాక్ సెలబ్రెటీ ఏంజిల్ ఆర్నా గా రాశిఖన్నా బాగా చేసింది. సాయితో ఆమె కాంబినేషన్ బాగుంది. సాయి తేజ్ ఎంట్రీ సీన్.. ఫ్యామిలీ వచ్చే కామెడీ సన్నివేశాలన్నీ బాగానే అల్లుకున్నాడు మారుతి.  ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా సినిమాకు ఓ లుక్ తీసుకువచ్చాయి.

మేజర్ మైనస్ : కథని కామెడీతో నడిపినా అక్కడక్కడా కాస్త హార్ట్ టచింగ్ సీన్స్ లేకపోవటంతో, స్టోరీ లైన్ లో ఉన్న సీరియెస్ నెస్ మిస్సైపోయింది. అలాగే కథలో కొద్దిగా కూడా నావెల్టీ అనేది లేదు. అంతా ప్రెడిక్టుబుల్ గా జరుగుతుంది. నావల్టీ కనక ఉండి ఉంటే ఈ సినిమా స్దాయి వేరే విధంగా ఉండేది. అలాగే మరీ ఈ రోజుల్లో ఎవరు..ఎలా ఉండాలనే క్లాసులు పీకితే వినటం కష్టం అనే విషయం మర్చిపోయారు.

టెక్నికల్ గా .. : డైరక్టర్ గా మారుతి...చాలా నీట్ గా డీల్ చేసారు. అలాగే రైటర్ గా ఫన్, ఎమోషన్, యాక్షన్ అన్ని కలిసేలా కథను తయారు చేసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లేనే ఇంట్రస్టింగ్ గా నడపలేకపోవటంతో రొటీన్ గా అనిపించింది చాలా చోట్ల. అలాగే మళ్లీ ఫామ్ లోకి వచ్చిన థ‌మ‌న్ పాటల్లో ‘ఓహ్ బావ ‘ , ‘ ప్రతి రోజు పండగే’ సాంగ్స్ తెరపై బాగున్నాయి. అలాగే ‘ తకిట తకిట ‘ సాంగ్ లో సాయి డాన్సింగ్ స్కిల్స్ మనకు నచ్చుతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫ్రెష్ గా ఉంది. ప‌ల్లె అందాల్ని పట్టుకోవటంలో జ‌య‌కుమార్ కెమెరా సక్సెస్ అయ్యింది. నటీనటుల్లో సత్యరాజ్, రావు రమేష్ ఇరగదీసారు. సాయి తేజ, రాశి ఖన్నా డీసెంట్ ఫెరఫార్మెన్స్.

ఫైనల్ థాట్ : 'పండగ' భోజనం పెట్టి...ఫైనల్ గా క్లాసులు పీకితే కష్టం అనిపిస్తుంది: Rating: 3/5

loader