- Home
- Entertainment
- Movie Reviews
- `K ర్యాంప్` మూవీ రివ్యూ రేటింగ్.. కిరణ్ అబ్బవరం దీపావళి విన్నర్‌గా నిలిచాడా?
`K ర్యాంప్` మూవీ రివ్యూ రేటింగ్.. కిరణ్ అబ్బవరం దీపావళి విన్నర్‌గా నిలిచాడా?
కిరణ్ అబ్బవరం ఇప్పుడు `K ర్యాంప్`(కే ర్యాంప్) చిత్రంలో నటించాడు. ఇది దీపావళి పండుగని పురస్కరించుకుని శనివారం విడుదలైంది. మరి కిరణ్ థియేటర్లలో ర్యాంప్ ఆడిచ్చాడా?

కే ర్యాంప్ మూవీ రివ్యూ
కిరణ్ అబ్బవరం చివరగా `క` మూవీతో హిట్ కొట్టాడు. హీరోగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మధ్యలో `దిల్‌రూబా`నిరాశ పరిచింది. ఇప్పుడు `కే ర్యాంప్` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దీపావళి పండుగని పురస్కరించుకుని నేడు శనివారం(అక్టోబర్ 18న)న విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. యూత్‌ఫుల్ కంటెంట్‌తో సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. మరి థియేటర్లలో ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా?. కిరణ్ అబ్బవరి ఈ దీపావళి విన్నర్‌గా నిలిచాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కే ర్యాంప్ కథ ఏంటంటే?
కుమార్(కిరణ్ అబ్బవరం)కి రిచ్ ఫ్యామిలీలో జన్మించినా మాస్‌గా బతకడం ఇష్టం. చిన్నప్పుడే తల్లి మరణించడంతో అవారాగా పెరుగుతాడు. తల్లి లేదని చెప్పి నాన్న కృష్ణ(సాయికుమార్) కూడా గారాబం చేస్తాడు. ఏ లోటు లేకుండా పెంచుతాడు. కానీ తనకు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు కష్టపడటం అని చెప్పి కుమార్ జల్సాలు చేస్తుంటాడు. చదువుకోకుండా ఎప్పుడూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక్కడ ఉంటే ఇలానే పాడవుతున్నాడని చెప్పి కుమార్‌ని కేరళాకి పంపిస్తాడు వాళ్లనాన్న. అక్కడకు వెళ్లాక కూడా ఇదే అవారా పనులు చేస్తుంటాడు. బాగా తాగి పడిపోయినప్పుడు ఒక అమ్మాయి జెస్సీ(యుక్తీ తరేజా) అతన్ని సేవ్ చేసి ఆసుపత్రిలో చేర్పిస్తుంది. దీంతో ఆ క్షణంలోనే ఆమెకి కనెక్ట్ అవుతాడు కుమార్. ఆమెని ప్రేమించమని వెంటపడుతుంటాడు. ఓ సందర్భంలో ఆమె కోసం అతను నిలబడంతో తను ప్రేమలో పడుతుంది. అయితే మధ్యలో జెస్సీ ఫ్రెండ్, జెస్సీ ఫాదర్, ఇలా చాలా మంది ఆమెకు ఉన్న సమస్య గురించి చెప్పాలనుకుంటారు. కానీ కుమార్ వినడు. చివరికి తనే ఈ విషయం చెప్పాలనుకుంటుంది. అందుకో టైమ్ ఫిక్స్ చేస్తుంది. ఆ టైమ్‌కి కుమార్ రాకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. అప్పుడు గానీ ఆమెకి ఉన్నసమస్య ఏంటో కుమార్‌కి అర్థం కాదు. జెస్సీ చిన్నప్పట్నుంచి పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉంటుంది. దీని కారణంగా తనకు ఎవరైనా ప్రామిస్ చేస్తే, దాన్ని నిలబెట్టుకోలేకపోతే బాగా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రాబ్లమ్ గురించి తెలిశాక కుమార్ ఏం చేశాడు? వదిలించుకున్నాడా? ఆమెని పట్టుకుని నిలబడ్డాడా? ఈ క్రమంలో తన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏంటి? ఇందులో నరేష్ పాత్ర ఏంటి? చివరికి కుమార్, జెస్సీ లవ్ ట్రాక్ ఏ తీరం చేరిందనేది మూవీ.
కే ర్యాంప్ విశ్లేషణ
కే ర్యాంప్ రెగ్యూలర్ కమర్షియల్ మూవీనే. కాకపోతే కొత్త లవ్ ట్రాక్‌తో కూడిన కమర్షియల్ మూవీ. ఇందులో హీరోయిన్‌కి ఉన్న సమస్య, దాని కారణంగా హీరో ఎలాంటి బాధలు పడ్డాడు, దాన్ని ఎలా ఫేస్ చేశాడు, చివరికి ఎలా సెట్ చేసుకున్నారనేది కథ. అయితే దీని చుట్టూ మంచి కామెడీ ఎలిమెంట్లతో కథని అల్లుకున్న తీరు బాగుంది. సినిమా ఫస్టాఫ్ అంతా సరదాగా సాగిపోతుంది. మంచి మాస్ ఎలిమెంట్లని జోడించడంతో అవి మాస్ ఆడియెన్స్ కి ఆకట్టుకుంటాయి. పాటలు, కామెడీ సీన్లు అలరించేలా ఉన్నాయి. మొదటి భాగం హీరో ఎంజాయ్ చేయడం, లైఫ్‌మీద కేర్ లేకుండా తిరగడం వంటి సీన్లతో సాగుతుంది. కేరళాకి వెళ్లాక అక్కడ కూడా అలానే ఉండటం, అమ్మాయి పరిచయంతో ఆయనలో మార్పు రావడం, మొదట ఆమె వెంటపడటం, ఆ తర్వాత బాధపడటం వంటి సీన్ల ఫన్నీ వేలో ఉంటాయి. లవ్ ట్రాక్ రొమాంటిక్‌గా ఉండటంతో యూత్‌ని కనెక్టింగ్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ లో హీరోయిన్‌కి ఉన్న సమస్య తెలియడంతో దాన్ని హీరో, వాళ్ల ఫ్యామిలీ ఫేస్ చేయడం, దాన్నుంచి తప్పించుకోవాలనుకున్నా సాధ్యం కాకపోవడం, దీంతో హీరో పడే స్ట్రగుల్స్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంటాయి. క్లైమాక్స్ ని చాలా ఎమోషనల్‌గా తీసుకెళ్లారు. అది భావోద్వేగభరితంగా ఉంటుంది. ఇది రెగ్యూలర్ కమర్షియల్ మూవీ అయినా, దాన్ని కామెడీ అంశాలు, ఒక డిజార్డర్ సమస్యని జోడించి తీసుకెళ్లిన తీరు బాగుంది. ఈ సినిమాకి అదే హైలైట్‌గా చెప్పొచ్చు.
కే ర్యాంప్ హైలైట్స్, మైనస్‌లు
ఇందులో ఫస్టాఫ్ కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. కొంత ఓవర్‌గా అనిపిస్తుంది. బలవంతంగానూ అనిపిస్తుంది. కాకపోతే లవ్ ట్రాక్ అలరించేలా ఉంటుంది. పాటలు ఎంజాయ్ చేసేలా ఉంటాయి. యాక్షన్ సీన్లు కూడా బాగున్నాయి. అయితే సెకండాఫ్‌ని బాగా డీల్ చేశారు. నేచురల్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. వెన్నెల కిశోర్ వచ్చాక నవ్వులు రెట్టింపు అయ్యాయి. క్రేజీగా అనిపిస్తుంది. అమ్మాయి సమస్య వల్ల అంతా సఫర్ అవ్వడం. ఆమెకి ఇచ్చిన ప్రామిస్‌ని నిలబెట్టేందుకు హీరో నానా తంటాలు పడటం నవ్వులు పూయిస్తుంది. ఇందులో కిరణ్ రెచ్చిపోయి నటించాడు. ఇక క్లైమాక్స్ ని ఎమోషనల్‌గా డీల్ చేసిన తీరు బాగుంది. అదే సమయంలో నరేష్ కామెడీ కూడా ఇందులో హైలైట్‌గా నిలిచింది. కాకపోతే ఆయన్ని సరిగా వాడుకోలేదు. ఓవరాల్‌గా కొంత రొటీన్, కొంత రెగ్యూలర్ కమర్షియల్ మూవీగా అనిపించినా, నవ్వులు గ్యారంటీ అని చెప్పొచ్చు. ఎమోషన్స్ అదనపు ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది.
కే ర్యాంప్ నటీనటుల ప్రదర్శన
కుమార్ పాత్రలో కిరణ్ అబ్బవరం చాలా బాగా చేశాడు. నటుడిగా ఆయన చాలా ఫ్రీ అయి నటించాడు. కామెడీ బాగా చేశాడు. అదే సమయంలో ఎమోషనల్ సీన్లలోనూ రెచ్చిపోయాడు. ఇక హీరోయిన్‌తో రొమాన్స్ సీన్లు, కిస్ సీన్లలో అదరగొట్టాడు. కిరణ్ ఈ మూవీతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జెస్సీగా యుక్తి బాగా చేసింది. పాత్రకి యాప్ట్ గా నిలిచింది. ఆమె పాత్రలోని వేరియేషన్స్ అలరిస్తాయి. వెన్నెలకిశోర్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. సాయికుమార్ తండ్రిగా ఆకట్టుకున్నారు. ఎమోషనల్ సీన్లలో మెప్పించారు. నరేష్ తనకు యాప్ట్ అయిన పాత్రలో అలరించారు. ఆయన పాత్రలోని ఎమోషనల్ సీన్లు సైతం బాగున్నాయి. ఫాదర్‌గా మురళీధర్ గౌడ్ తన మార్క్ నటనతో అదరగొట్టారు. అలీ, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కూడా పాత్ర పరిధి మేరకు మెప్పించారు. ఇందులో ఒకప్పటి హీరోయిన్ కామ్నా జెఠల్మానీ ఓ మెరుపు మెవరడం విశేషం.
కే ర్యాంప్ టెక్నీషియన్ల పనితీరు
సతీష్ రెడ్డి మాసం కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఆకట్టుకున్నాయి. చేతన్ భరద్వాజ్ సంగీతం సినిమాకి మరో ప్లస్. పాటలు ఆకట్టుకున్నాయి. ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. బీజీఎం కూడా కొత్తగా అనిపించింది. డీసెంట్‌గా ఉంది. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. నిర్మాతలు రాజీపడలేదని చెప్పొచ్చు. దర్శకుడు జైన్స్ నాని డైరెక్టర్ గా సక్సెస్‌అయ్యాడు. ఆయన రెగ్యూలర్ కమర్షియల్ కథనే ఎంచుకున్నా, లవ్ ట్రాక్‌లోని కాన్ల్ఫిక్ట్ మాత్రం కొత్తగా ఉంది. అదే ఈ మూవీకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఆయా సీన్లని సైతం బాగా డీల్ చేశారు. నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యాడు. నవ్విస్తూ భావోద్వేగానికి గురిచేసిన తీరు కూడా ఆకట్టుకుంది. ఓవరాల్‌గా పండక్కి ఎంజాయ్ చేసే మూవీని అందించారని చెప్పొచ్చు.
ఫైనల్‌గాః సరదాగా టైమ్ పాస్‌కి ఎంజాయ్ చేసే మూవీ `కే ర్యాంప్`
రేటింగ్.2.75