Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Ramam Raghavam Movie Review: `రామం రాఘవం` మూవీ రివ్యూ, రేటింగ్‌

Ramam Raghavam Movie Review: `రామం రాఘవం` మూవీ రివ్యూ, రేటింగ్‌

కమెడియన్‌గా రాణిస్తున్న ధన్‌ రాజ్‌ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం `రామం రాఘవం`. సముద్రఖని, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

Aithagoni Raju | Updated : Feb 21 2025, 08:47 AM
4 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
ramam raghavam movie review

ramam raghavam movie review

Ramam Raghavam Movie Review: ధన్‌ రాజ్‌ ఒకప్పుడు కామెడియన్‌గా రాణించాడు. క్రమక్రమంగా నటుడిగా తనని తాను మార్చుకుంటూ వస్తున్నాడు. హీరోకి ఫ్రెండ్‌గా చేశాడు. కీలక పాత్రలతో మెప్పించారు. బలమైన పాత్రలతోనూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు దర్శకుడిగా మారి `రామం రాఘవం` అనే సినిమాని రూపొందించారు.

ఇందులో తనే హీరోగా నటించగా, సముద్రఖని ముఖ్య పాత్ర పోషించారు. సత్య, ప్రమోదిని, సునీల్‌, మోక్ష, హరీష్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటించారు. స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ బ్యానర్‌పై పృథ్వీ పోలవరపు బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ శుక్రవారం(ఫిబ్రవరి 21)న తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

26
Asianet Image

కథః
దశరథ రామం(సముద్రఖని) సిన్సియర్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌. లంచం తీసుకోడు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీకి మారుపేరుగా నిలుస్తుంటాడు. ఆయన కొడుకు రాఘవ(ధన్‌రాజ్‌) బేవార్స్ గా తిరుగుతుంటాడు. రామం లాంటి సిన్సియర్‌ ఆఫీసర్‌కి ఇలాంటి అవారాగా తిరిగే కొడుకు ఉండటమేంటి? కొడుకు ఇలా కావడమేంటనేది పెద్ద మిస్టరీ.

ఈజీ మనీ కోసం తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. ప్రతిసారి దొరికిపోతుంటాడు. తండ్రి ఎంత తిట్టినా బుద్ది రాదు. బెట్టింగ్‌ల్లో డబ్బులు పోగొట్టుకుంటాడు. చివరికి తండ్రి సంతకాన్నే పోర్జరీ చేసి దొరికిపోతాడు. దీంతో తండ్రినే రాఘవని పోలీసులకు అప్పగిస్తాడు. అయినా అతనిలో మార్పు రాదు.

చివరికి తండ్రినే చంపాలనుకుంటాడు. లారీ డ్రైవర్‌ అయిన ఫ్రెండ్‌(హరీష్‌ ఉత్తమన్‌)తో ప్లాన్‌ చేస్తాడు. మరి తండ్రిని ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ అసలు ప్లానేంటి? రాఘవలో వచ్చిన మార్పేంటి?  ఇందులో సునీల్ పాత్రేంటి? చివరికి ఏం జరిగింది? తండ్రీ కొడుకుల డ్రామా ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా. 
 

36
Asianet Image

విశ్లేషణః
డబ్బుల కోసం తల్లితండ్రులను చంపడమనేది రియల్‌లైఫ్‌లో అడపాదడపా చూస్తున్నాం. అలాంటి కాన్సెప్ట్ తోనే సినిమాలు వస్తున్నాయంటే ఆ ప్రభావం రియల్‌ లైఫ్‌లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. `రామం రాఘవం`లో తండ్రిని చంపాలనుకున్నదే మెయిన్‌ పాయింట్‌. అయితే దేని కోసం ఆ పని చేశారు? అది ఎలా చేశారు? దాన్ని సినిమాగా ఎంత బాగా చూపించారనేది ఇక్కడ ముఖ్యం.

అదే సమయంలో ఇలాంటి పాయింట్‌ చాలా సెన్సిటివ్‌గానూ ఉంటుంది. రిస్క్ తో కూడి ఉంటుంది. దాన్ని ఎంత బాగా డీల్‌ చేశారనేది చాలా ఇంపార్టెంట్‌. ఆ విషయంలో దర్శకుడిగా మారిన నటుడు ధన్‌ రాజ్‌  రిస్క్ చేసినా సినిమాగా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. ఫస్టాఫ్‌ ని చాలా సాదాసీదాగానే తీసుకెళ్లారు.

తండ్రి సిన్సియర్‌ అధికారి, కొడుకు అవారా అనేది చాలా సినిమాల్లో చూస్తున్నాం. ఇది కూడా అలానే అనిపిస్తుంది. కాకపోతే రాను రాను దాని సీరియస్‌ నెస్‌ పెరగడంతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్‌ అవుతుంది. కొడుకు తప్పుల మీద తప్పులు చేయడం, దొరికిపోవడం ఆడియెన్స్ ని ఉత్కంఠకి గురి చేస్తుంది. కొడుకు చేసే తప్పులకు తండ్రి రియాక్షన్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది. అయితే లెక్కకు మించి చేసే తప్పులే ఇక్కడ మెయిన్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. సాధారణంగా కొన్ని తప్పులు చేయడం, అనంతరం మార్పు రావడం జరుగుతుంటుంది.

ఇందులో తప్పులనేవి పీక్లో చేయడమే విశేషం. ఆ సన్నివేశాలు చూస్తుంటే చూసే ఆడియెన్స్ కే కోపం రగిల్చేలా, ఆవేశం కలిగేలా, ఆ పాత్రని అసహ్యించుకునేలా ఉంటాయి. అదే ఇక్కడ దర్శకుడి టాలెంట్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు.  
 

46
Asianet Image

ఇంత వరకు ఓకే, కానీ తండ్రిని చంపాలనుకునే ఆలోచనతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్‌ అవుతుంది. సినిమా సరదా ఎంటర్‌టైనర్‌ నుంచి సీరియస్‌ థ్రిల్లర్‌ సైడ్‌ టర్న్ తీసుకుంటుంది. తండ్రిని చంపేసేందుకు కొడుకు చేసే ప్లాన్‌, ఆయన చేసే తప్పులు మరింత ఉత్కంఠకి గురి చేస్తుంటాయి. చివరి వరకు ఆ సస్పెన్స్ రన్‌ అవుతుంది. కానీ క్లైమాక్స్ ని మాత్రం పూర్తి ఎమోషనల్‌గా మార్చేశాడు ధన్‌రాజ్.

తండ్రికొడుకుల అనుబంధాన్ని, వారి మధ్య డ్రామాని, ఆ బాండింగ్‌ని ఆవిష్కరించిన తీరు అదిరిపోయింది. అది ఆద్యంతం భావోద్వేగ భరితంగా సాగుతుంది. ఇక క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది. దాన్ని డీల్‌ చేసిన తీరు, తెరపై ఆవిష్కరించిన తీరు అదిరిపోయింది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అయితే ఫస్టాఫ్‌ని మరింత బలంగా రాసుకుని, మరింత బాగా చేయాల్సింది.

రొటీన్‌గా సాగడంతో బోర్‌ అనిపిస్తుంది. పైగా ల్యాగ్‌ అనిపిస్తుంది. కామెడీ సీన్లు ఒకటి అరా తప్పితే పెద్దగా లేవు. కానీ ఫన్‌ కి స్కోప్‌ ఉంది. అయినా ఆ దిశగా ఫోకస్‌ లేదు. లవ్‌ ట్రాక్‌ కూడా ఏమాత్రం సెట్‌ కాలేదు. మ్యూజిక్‌ పరంగానూ కొంత పాత సినిమాలను గుర్తు చేస్తుంది. ఆ విషయంలో కొత్తదనం లోపించిందా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ పక్కన పెడితే `రామం రాఘవం` తండ్రి కొడుకుల ఎమోషనల్‌ డ్రామా అని చెప్పొచ్చు. 
 

56
Asianet Image

నటీనటులుః 
రామం పాత్రలో సముద్రఖని జీవించాడు. తనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. దీంతో ఈజీగా చేశాడు. ఆద్యంతం అలరించారు. క్లైమాక్స్ సీన్లలో గుండె బరువెక్కించారు. ఇక రాఘవ పాత్రలో ధన్‌రాజ్‌ నటన సైతం అదిరిపోయింది. పాజిటివ్‌గా, ఇన్నోసెంట్‌గా, కన్నింగ్‌గా, విలన్‌గా, ఆ తర్వాత మారిన కొడుకుగా ఇలా విభిన్నమైన షేడ్స్ చూపించి అదరగొట్టాడు. సినిమాని తనదైన స్టయిల్‌లో నడిపించాడు.

అనేక ట్విస్ట్ లతో రక్తికట్టించాడు. నటుడిగా మరో పది మెట్లు ఎక్కాడనే చెప్పాలి. అమ్మగా ప్రమోదినికి కూడా నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర దక్కింది. ఆమె కూడా అంతే బాగా చేసింది. చివర్లో మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఫ్రెండ్‌గా సత్య అడపాదడపా మెరిశారు. నవ్వించాడు. హరీష్‌ ఉత్తమన్‌ ఎక్కువగా నెగటివ్‌ షేడ్స్ లో కనిపిస్తుంటాడు.

కానీ ఇందులో పాజిటివ్‌ రోల్‌లో మెప్పించాడు. ఆయన పాత్రలోనూ ఎమోషన్‌ ఉంది. సునీల్‌ కి మరో మంచి పాత్ర దక్కింది. 30 ఇయర్స్ పృథ్వీ, రచ్చ రవి, రాకెట్‌ రాఘవ సైతం కాసేపు మెరిశారు. హీరోయిన్‌ మోక్ష పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. మిగిలిన ఆర్టిస్ట్ జస్ట్ ఓకే అనిపించారు. 
 

66
Asianet Image

టెక్నీషియన్లుః 
సినిమా విజువల్ గా బాగుంది. దుర్గా ప్రసాద్‌ కొల్లి బాగా చిత్రీకరించారు. విజువల్స్ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. రిచ్‌ లుక్‌ని తెచ్చాయి. మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటింగ్‌ బాగానే ఉంది. కానీ ఫస్టాఫ్‌లో మరింత కట్‌ చేయాల్సింది. మ్యూజిక్‌ అరుణ్‌ చిలువేరు సంగీతం సినిమాకి మరో ప్లస్‌ అయితే. కొన్ని సార్లు పాత సినిమాలను గుర్తు చేసేలా ఆర్‌ఆర్‌ సాగింది. ఫ్లేవర్‌ కూడా అలానే అనిపిస్తుంది.

బీజీఎం విషయంలో ఇంకా బాగా చేయాల్సింది. క్లైమాక్స్ లో మాత్రం అదిరిపోయింది. ధన్‌ రాజ్‌ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిది. దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. సినిమాని డీల్‌ చేసిన తీరు బాగుంది. ఎమోషనల్‌గా నడిపించిన తీరు బాగుంది. కథ, కథనం సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఎక్కడ కొత్త దర్శకుడు అనే ఫీలింగ్‌ లేదు. కాకపోతే ఫస్టాఫ్‌ విషయంలో, ఫన్‌ విషయంలో ఇంకా బాగా కేర్‌ తీసుకోవాల్సింది. కొన్ని రొటీన్‌ సీన్ల విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది. క్లైమాక్స్ లో మాత్రం చించేశాడు. నటన పరంగా, డైరెక్షన్‌ పరంగా అదరగొట్టాడు. 

ఫైనల్‌గాః `రామం రాఘవం` తండ్రికొడుకుల ఎమోషనల్‌ డ్రామా. తండ్రి విలువని తెలిపే మూవీ. 
రేటింగ్‌ః 2.75
 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories