‘రాజుగారి గది 3’ రివ్యూ!

First Published 18, Oct 2019, 1:51 PM

ఏంటో ఈ మధ్యన దెయ్యాలన్నీ పూర్తి స్దాయి కమిడియన్స్ గా మారిపోతున్నాయి. ఏ దెయ్యం చూసినా ఏముంది గర్వ కారణం...దెయ్యం జాతి సమస్తం కమెడీ క్యారక్టర్స్ మయం అన్నట్లు తయారైంది పరిస్దితి. పేరుకు హారర్ కామెడీ అంటున్నా...హారర్ అనేది ఎక్కడా కనపడటం లేదు..నవ్వించటానికి శ్రమ పడే దెయ్యాలే కనపడుతున్నాయి. 

ఏంటో ఈ మధ్యన దెయ్యాలన్నీ పూర్తి స్దాయి కమిడియన్స్ గా మారిపోతున్నాయి. ఏ దెయ్యం చూసినా ఏముంది గర్వ కారణం...దెయ్యం జాతి సమస్తం కమెడీ క్యారక్టర్స్ మయం అన్నట్లు తయారైంది పరిస్దితి. పేరుకు హారర్ కామెడీ అంటున్నా...హారర్ అనేది ఎక్కడా కనపడటం లేదు..నవ్వించటానికి శ్రమ పడే దెయ్యాలే కనపడుతున్నాయి. దాంతో చూస్తూంటే భవిష్యత్ లో తెలుగులో కామెడియన్స్ గా దెయ్యాలు స్దిరపడిపోతాయేమో అనిపిస్తోంది. ఇలాంటి నేపధ్యంలో మరో హారర్ కామెడీ ‘రాజుగారి గది 3’వచ్చింది. ఈ సినిమా కూడా అలాంటి బాపతేనా..నవ్విస్తుందా..భయపెడుతుందా..ఈ రెండు కాకుండా జనాలను ఏడిపిస్తుందా...ఓంకార్ అన్నయ్య ఎంతో మనసు పడి చేసిన ఈ సినిమా ఏ మేరకు జనాలకు పడుతుంది, అసలు కథేంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి : అనాధ అయిన అశ్విన్ (అశ్విన్ బాబు) ఆటో నడుపుతూంటాడు. అతనికో బేవార్స్ ప్రెండ్ అలీ . ఖాళీ దొరికినప్పుడల్లా మందు కొట్టేసి తన కాలనీలో వాళ్లందరికి విరక్తి పుట్టించే పోగ్రాం పెట్టుకుంటూంటాడు. దాంతో వాళ్ళంతా ఎలాగైనా అశ్విన్ ని వదిలించుకోవాలని ప్లాన్ చేస్తూంటారు ఈ క్రమంలో వాళ్లకో ఆలోచన వస్తుంది. డాక్టర్ మాయ (అవికాగోర్)మీదకు అశ్విన్ ని ఉసిగొలిపితే అని..అందుకు ఓ డాక్టర్‌ శశి (బ్రహ్మాజీ) సహకరిస్తానంటాడు. మాయ ఎవరు..ఆమె మీదకు ఉసిగొలపటమేమిటి అంటే...కొద్దిగా ఆమె గురించి తెలుసుకోవాలి.

ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో డాక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసే మాయ(అవికాగోర్‌) కు ఎవ‌రైనా ఐ ల‌వ్ యు అని చెబితే ఓ ఆత్మ వ‌చ్చి చావ‌ చితక్కొడుతుంటుంది. దాంతో ఆమెకు అంద‌రూ భ‌య‌ప‌డుతూ దూరంగా ఉంటూంటారు. రీసెంట్ గా మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న వాడు డాక్టర్‌ శశి (బ్రహ్మాజీ).. అతను కు అశ్విన్ అంటే మంట ఉంది. దాంతో ఓ ప్లాన్ చేసి అశ్విన్ కు, మాయ కు మధ్య ప్రేమ పుట్టేలా చేస్తాడు. దాంతో మాయకు ఓ ముహూర్తాన అశ్విన్ ఐలవ్యూ చెప్పేస్తాడు. అప్పుడు ఆ ఆత్మ వచ్చి అశ్విన్ ని విరగకొడుతుంది. ఎందుకిలా జరుగుతోంది..మాయకు కాపాలా కాస్తున్న ఆత్మ ఎవరు అని అశ్విన్ ఎంక్వీరీ మొదలెడతాడు. అప్పుడు ఆమె తండ్రి పేరు గరడపిళ్లై (అజయ్ ఘోష్) అని...ఆయన... కేరళలో పేరుమోసిన మాంత్రికుడు అని తెలుస్తుంది. ఆయనే ఓ యక్షిణి ఆత్మను తన కుమార్తెకు కాపాలాగా పెట్టాడని తెలుస్తుంది. దాంతో ఈ సంగతి అటో ఇటో తేల్చుకోవాలని అశ్విన్ ..కేరళ బయిలు దేరతాడు. అక్కడకి వెళ్లాక కొన్ని నిజాలు రివీల్ అవుతాయి. అసలు మాయను కాపాడే ఆ యక్షిణి ఆత్మ ఏమిటి..ఆ ఆత్మకు ఈ బాడీ గార్డ్ డ్యూటీ ఏమిటి... చివరకు అశ్విన్ ప్రేమ కథ ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందీ అంటే... : దెయ్యాలనే నమ్ముకుని తన సినిమాలను అమ్ముకుంటున్న ఓంకార్ రాజుగారి 2 కు ప్రేతమ్ అంటూ ఓ మళయాళ దెయ్యాన్ని రీమేక్ అంటూ తీసుకొచ్చి మనకు పరిచయం చేసాడు. ఈ సారి అరవదెయ్యానికి తెలుగు వేషం వేసి దింపాడు. తమిళంలో హాస్య నటుడు కమ్ హీరో సంతానం చేసిన 'దిల్లుకు దుడ్డు 2' సినిమాకు ఈ సినిమా రీమేక్. అక్కడ సంతానం తన యాంటిక్స్ తో చితక్కొట్టేసాడు. సినిమమాలో కథ, కామెడీ ఉన్నా లేకపోయినా తన దైన స్టైల్ లో నవ్వించి న్యాయం చేసేసాడు. అయితే తెలుగుకు వచ్చేసరికి అశ్విన్ బాబుకు అంత కామెడీ సెన్స్ లేదు. తెరపై పండించే సీన్ లేదు. అలా కథలోకి నడుచుకుంటూ పోవటమే కానీ ఆగి ఫన్ చేయటం చేతకాదు. ఇదే కథ ఏ అల్లరి నరేష్ చేస్తే అదిరిపోయేది అనిపిస్తుంది.

ఫస్టాఫ్ ఫన్ జస్ట్ ఓకే అనిపించినా, సెకండాఫ్ కు వచ్చేసిరికి ఫన్ ఫరవాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ పొలోమంటూ వచ్చి పిచ్చ కామెడీ చేసినా...హారర్ లేక ఛల్తాహై అనిపిస్తుంది. ఒరిజనల్ కథ లో కొద్దో గొప్పో విషయం ఉండటంతో సినిమా సేవైంది. లేకపోతే చివరి దాకా భరించటం కష్టమైంది. ఇక లాజిక్ లు విషయానికి చూస్తే ఈ సినిమా కాస్సేపు కూడా నిలబడదు. అలాగే సినిమాలో నవ్వించటం కోసం సీరియస్ గా నడిచే దెయ్యం ట్రాక్ ని ఫన్ చేసేయటమే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. హారర్ అనేది ఈ సినిమాలో మచ్చుకు కూడా కనపడదు. అక్కడక్కడా దెయ్యం భయపెట్టినా అదీ నవ్వు వచ్చేస్తూంటుంది. కాబట్టి దెయ్యం సినిమాలు అంటే భయపడేవాళ్ళు ఈ సినిమాకు ధైర్యే సాహసే..దెయ్యం అనుకుంటూ వెళ్లచ్చు.

ఎవరెవరు ఎలా : ఈ సినిమాలో అశ్విన్ బాబునుంచి పెద్దగా నటన ఎక్సపెక్ట్ చేయలేం. అవికగోర్...ఉయ్యాల జంపాల నాటికు ఇప్పటికి చాలా మారింది..బొద్దుగా మారింది. అయితే ఆమె మంచి నటి కావటం ప్లస్. అజయ్ ఘోష్, అలీ, సీనియర్ నటి ఊర్వసి వంటివారు సరదాగా చేసుకుంటూ పోయారు. సెంకండాఫ్ లో అజయ్ ఘోష్, ఊర్వసి బాగానే నవ్వించారు.

టెక్నికల్ గా ... : ఇలాంటి సినిమాలకు కెమెరా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా ఉండాలి. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. ష‌బీర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగానే వర్కవుట్ అయ్యాయి. డైలాగులు రాసిన బుర్ర సాయిమాధవ్‌ పెన్ను ఫన్ విషయంలో కాస్త తడబడిందనిపిస్తుంది. ఓంకార్ మేకింగ్ బాగుంది.

ఫైనల్ పంచ్ : అక్కడక్కడా నవ్వించే ఈ సినిమా వీకెండ్ కు ఓ మాదిరి కాలక్షేపం.

Rating: 2.5/5

Rating: 2.5/5