జాహ్నవి కపూర్ ‘మిస్టర్ & మిసెస్ మహీ’ మూవీ రివ్యూ
‘మిస్టర్ & మిసెస్ మహీ’ సినిమా తను క్రికెట్ లో ఫెయిల్ అవ్వడంతో భార్య ట్యాలెంట్ ని గుర్తించి క్రికెటర్ గా చూడాలనుకునే భర్త కథ
Mr and Mrs Mahi review
స్పోర్ట్స్ డ్రామాలు అంటే మనందరికీ ఆసక్తే. ముఖ్యంగా క్రికెట్ నేపధ్యంలో సినిమా అంటే ఇంకాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. అది సినిమా వాళ్లు పసిగట్టారు. అందుకే లగాన్ నుంచి ఈ సినిమా దాకా ఎక్కువ శాతం క్రికెట్ నేపధ్యంలోనే తీస్తూ వస్తున్నారు. తాజాగా రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా , స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ లో రూపొందించిన ఈ చిత్రం ఎలా ఉంది. ఎక్సపెక్టేషన్స్ తగినట్లు ఉందా. చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
మహేంద్ర (రాజ్ కుమార్ రావ్) జీవితాశయం ఈ దేశంలో చాలా మందిలాగే ఓ గొప్ప క్రికెటర్ అవ్వాలని. అందుకోసం కృషి చేస్తాడు కానీ స్టేట్ లెవిల్ కు సెలెక్ట్ కాలేకపోతాడు. దాంతో తానొక ఫెయిల్యూర్ పర్శన్ గా ఫీలవుతాడు. దాంతో అతని తండ్రి తండ్రి బలవంతంగా తన స్పోర్ట్స్ షాప్ చూసుకోమని అప్పగిస్తాడు. అలానే డాక్టర్ అయిన మహిమ అగర్వాల్ (జాన్వీ కపూర్)తో పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత మాటల్లో భాగంగా తన ఫెయిల్యూర్ స్టోరీని భార్య మహిమకు చెబుతాడు.
అప్పుడు ఆమెకు కూడా క్రికెట్ అంటే ఇష్టమనే విషయం తెలుస్తుంది. ఆమె మళ్లీ క్రికెట్ వైపు వెళ్లమని ఎంకరేజ్ చేస్తుంది కానీ తన వయస్సు, ఫిట్నెస్ దానికి సహకరించవు. దాంతో తన భార్యని అయినా క్రికెటర్ ని చేయాలనుకుంటాడు. అందుకోసం తనే కోచ్ గా మారతాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. భార్యా భర్తల మధ్య ఎందుకు విభేధాలు వచ్చాయి. మహిమ చివరకు క్రికెటర్ అయ్యిందా... ఇవన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తెలుగులో వచ్చిన జెర్శీ సినిమాకే ఇంకో ఆర్డర్ వేసి రక్తి కట్టించటానికి చేసిన ప్రయత్నంలా ఈ సినిమా అనిపిస్తుంది. అది ప్రక్కన పెడితే సినిమాలో డ్రామా ని ప్రెడిక్టబులిటీ దెబ్బ తీసేసింది. ఎప్పుడైతే భార్యని క్రికెటర్ చేయాలనుకున్నాడో అక్కడ నుంచి కథ మలుపులు తిరిగి పరుగెత్తాలి. కానీ ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే ఉంటుంది. అంతా ఊహకు అంతే కథనం నడుస్తూంటుంది. కథలో హీరో లక్ష్యానికి అడ్డంకులు వస్తూంటే సినిమా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా అటువంటి మలుపులు కానీ , ట్విస్ట్ లు కానీ ద్రోహం కానీ ఏమి ఉండవు. అలా జరిగిపోతూంటుంది.
మధ్యలో మరీ బాగోదని హీరో,హీరోయిన్ మధ్య చిన్న చిన్న గొడవలు అదీ ఐడెంటిటీ కోసం పెట్టారు. ఇవి సరిపోదన్నట్లు మోటీ వేషన్ సాంగ్స్ తో బోర్ కొట్టించే పోగ్రామ్ లు. స్క్రిప్టు సరిగ్గా రాసుకోకపోవటంతో బాగా డ్రాగ్ అవుతూంటుంది. టిపికల్ బాలీవుడ్ ఎంటర్టైనర్ గా చేయాలనేై తపన ఒకట ఈ సినిమా చూస్తున్నప్పుడు జనాలను నిద్రలోకి తోసేస్తుంది. స్పోర్ట్స్ డ్రామా కు ఫెరఫెక్ట్ స్క్రిప్టు లేకపోతే ఎంత విసుగ్గా ఉంటుందో ఈ సినిమానే గొప్ప పాఠం. ఇక కథలు కీలకమైన క్లైమాక్స్ క్రికెట్ మ్యాచ్ జరిగే సీన్స్ అయితే ఎంత లాగ్ ఉంటుందంటే ఓ కునుకు తీసినా పెద్దగా కదిలిక ఉండదు.
ఎవరెలా చేసారు.
రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ ఇద్దరూ పోటీ పడి చేసారు. కానీ వారి క్యారక్టరైజేషన్ కు సరపడ కథ అయితే లేదు. కోచ్ బెన్నీగా రాజేశ్ శర్మ, హీరో మహేంద్ర తల్లిగా జరీనా వహాబ్, తండ్రిగా కుముద్ మిశ్రా మెయిన్ పిల్లర్స్.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా సౌండ్ గానే ఉంది. అనయ్ గోస్వామి కెమెరా వర్క్ ప్లెజెంట్ గా ఉంది. పాటలు జస్ట్ ఓకే. జాన్ స్టీవార్డ్ ఏడూరి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో విషయం లేకపోయినా లేపే ప్రయత్న్ం చేసింది. నిఖిల్ మల్హోత్ర, దర్శకుడు శరణ్ శర్మ స్క్రిప్ట్ వర్క్ చేశారు. అదే దెబ్బ కొట్టింది. బాగా ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చూడచ్చా
జాహ్నవి కపూర్ ని చూడటానికి అయితే ఈ సినిమా ఓ ఆప్షన్ తప్పించి క్రికెట్ మ్యాచ్ కోసం ఐపీఎల్ సీజన్ లో పనిగట్టుకుని చూడాల్సిన పనిలేదు.
Rating:2
నటీనటులు: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్, రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా తదితరులు;
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి;
ఎడిటింగ్: నితిన్ బైది;
రచన: నిఖిల్ మల్హోత్ర, శరణ్ శర్మ;
నిర్మాత: కరణ్ జోహార్, జీ స్టూడియోస్;
దర్శకత్వం: శరణ్ శర్మ