'పెళ్లి సందD' మూవీ రివ్యూ
ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, యువ నటి శ్రీలీల జంటగా నటించిన చిత్రం ' పెళ్లి సందD'. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు Roshann, యువ నటి శ్రీలీల జంటగా నటించిన చిత్రం పెళ్లి ' పెళ్లి సందD'(Pelli SandaD) . రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్, పాటలలో రాఘవేంద్ర రావు మేకింగ్ స్టైల్ కనిపించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దసరాగా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలని అందుకుందా రాలేదా అనేది సమీక్షలో చూద్దాం.
కథ: తన మనసుకు ఎవరైతే నచ్చుతారో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడు వశిష్ట(రోషన్). తన సోదరుడి వివాహంలో అనుకోకుండా వశిష్టకు సహస్ర(శ్రీలీల) అనే యువతి ఎదురవుతుంది. ఆమె ప్రేమలో పడతాడు వశిష్ట. సహస్ర కూడా అతడిని ప్రేమిస్తుంది. ఎంతో అందంగా సాగిపోతున్న వీరి ప్రేమకు ఊహించని అడ్డంకి వస్తుంది. ఆ సమస్యని హీరో ఎలా అధికమించాడు ? తన ప్రేమని ఎలా నిలబెట్టుకున్నాడు ? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ: ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో శ్రీకాంత్. తన తనయుడు రోషన్ నటించిన ఈ పెళ్లి సందD చిత్రం యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన మూవీ. రోషన్ తన పాత్రకు తగ్గట్లుగా మంచి నటన అందించాడు. రోషన్ డైలాగ్ డెలివరీ చూస్తుంటే నటనలో అతడికి స్పార్క్ ఉన్నట్లు అనిపిస్తుంది. సరైన విధంగా హావభావాలు పండించడంలో రోషన్ సక్సెస్ అయ్యాడు. అలాగే హీరోయిన్ శ్రీలీల ఓకె అనిపించే విధంగా నటించింది. గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. కథ పరంగా దర్శకురాలి గౌరీ అండ్ టీం చాలా వీక్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక కథనంలో కూడా బలం లేకపోవడంతో సినిమా తేలిపోయింది. రాఘవేంద్ర రావు స్టైల్ లో విజువల్స్ కనిపిస్తాయి కానీ కథ ఏమాత్రం ఆసక్తిగా లేకపోవడంతో అవన్నీ సైడ్ అయిపోతాయి. అలాగే సెకండ్ హాఫ్ లో డ్రమాటిక్ సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. సహజత్వానికి దూరంగా ఉంటాయి.
నటీనటులు : ముందుగా చెప్పినట్లుగా రోషన్ కొంతవరకు సినిమాని సేవ్ చేసే ప్రయత్నం చేశాడు. కథలో అవకాశం ఉన్న మేరకు డైలాగులు, డాన్స్, పెర్ఫామెన్స్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ మిగిలిన కథ మొత్తం అతడి చేతుల్లో ఉండదు కదా. హీరోయిన్ కి కూడా నటించే స్కోప్ దక్కలేదు. ఛాన్స్ ఉన్న మేరకు గ్లామర్ గా కనిపిస్తూ మెప్పించే ప్రయత్నం చేసింది. కామెడీ బలవంతంగా పెట్టినట్లు ఉన్నపటికీ బోరింగ్ కథ నుంచి కొంత రిలీఫ్ లభించే విధంగా ఉంటుంది. రఘుబాబు, రావు రమేష్ కామెడీ డైలాగులతో మెప్పించే ప్రయత్నం చేశారు.
సాంకేతికంగా : ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలి అంటే బలమైన ఎమోషన్స్ ఉండాలి. ఆ సన్నివేశాలు వెండితెరపై పండాలి. అలాంటి స్క్రిప్ట్ రాసుకోవడంలో గౌరీ రోనంకి విఫలం అయ్యారు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మంచి విజువల్స్ రాబట్టడంలో కెమెరామెన్ సక్సెస్ అయ్యారు. ఇక కీరవాణి సంగీతం ఓల్డ్ స్టైల్ లో ఇప్పటి ట్రెండ్ కి దూరంగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరవాలేదు.
చివరగా: రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన పెళ్లి సందడి చిత్రం నిరాశపరిచే విధంగానే ఉంది. అక్కడక్కడా మెప్పించే ఎమోషనల్ సీన్స్, కామెడీ సన్నివేశాలతో బాక్సాఫీస్ వద్ద నిలబడడం కష్టం.
రేటింగ్: 2/5