MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Dasara Movie Review: ‘రా’, రస్టిక్, ఇంటెన్స్ కానీ... 'దసరా' రివ్యూ

Dasara Movie Review: ‘రా’, రస్టిక్, ఇంటెన్స్ కానీ... 'దసరా' రివ్యూ

ప్రెడిక్టబుల్ గా నడిచే కథ మరియు కొన్ని స్లో నేరేషన్ అయినప్పటికీ ...రా,రస్టిక్ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కథ,కథనం వెతుక్కుంటూ కూర్చుంటే మాత్రం నీరసం వస్తుంది.  

6 Min read
Surya Prakash
Published : Mar 30 2023, 12:41 PM IST | Updated : Mar 30 2023, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Dasara Telugu Movie Review

Dasara Telugu Movie Review


గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై దసరా మూవీ కబుర్లు బోలెడు వినిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి డైరక్టర్ మేకింగ్ గురించే అందరూ మాట్లాడుతున్నారు. విడుదలకు ముందే రూ.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘దసరా’ నానికి తొలి పాన్ ఇండియా చిత్రం.  భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్ ఇది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో నాని బాగా కష్టపడ్డాడు. అందుకు తగ్గట్లే భారీ అంచనాలు, భారీ ఓపినింగ్స్  .  నానిలో కొత్త యాంగిల్  పరిచయం చేసే అద్భుతమైన యాక్షన్-ప్యాక్డ్ చిత్రం గా ప్రచారం జరిగిన ఈ చిత్రం అంచనాలకు తగ్గ స్దాయిలోనే ఉందా..అసలు కథేంటి...నాని ఇమేజ్ ని అమాంతం పెంచే చిత్రమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

210
Asianet Image


కథాంశం:

1995 లో తెలంగాణా లోని వీరపల్లి అనే గ్రామంలో జరిగే ఈ కథ ఆనాటి రాజకీయ,సాంఘక,సాంస్కృతిక పరిస్దితులను పరిచయం చేయటంలో మొదలవుతుంది. ధరణి (నాని),సూరి(దీక్షిత్ శెట్టి) ఇద్దరూ అదే ఊరికి చెందిన జాన్ జిగిరీ దోస్త్ లు. వాళ్లిద్దరూ ఒకే అమ్మాయి వెన్నెల(కీర్తి సురేష్) తో ప్రేమలో పడతారు. తన ప్రెండ్ సూరి కూడా అదే అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకున్న ధరణి త్యాగం చేసి తప్పుకుంటాడు. సూరికి, వెన్నెలకు పెళ్లి అవుతుంది. అయితే అంతా సుఖంగా,ఆనందంగా నడిస్తే అది కథ ఎందుకు అవుతుంది. వాళ్ల జీవితాల్లోకి  ఊరి సర్పంచ్ నంబి (షైన్ టామ్ చాకో) వస్తాడు. మరో ప్రక్క (శివన్న(సముద్ర ఖని), రాజన్న(సాయికుమార్) రాజకీయం ఆడుతూంటారు.  అక్కడ నుంచి ప్రశాంతంగా నడుస్తున్న వాళ్ల జీవితా లు వేరే టర్న్ లు తీసుకుంటాయి. ఊహించని ఓ సంఘటనతో మొత్తం మారిపోతుంది. ధరణి వైల్డ్ గా మారతాడు. అందుకు దారి తీసిన సంఘటనలు ఏమిటి..అసలు ఏం జరిగింది... చివరకు ఏమైంది అనేది మిగతా కథ.

310
Asianet Image


విశ్లేషణ:

ఈ సినిమా రంగస్దలం సినిమాకు తెలంగాణా వెర్షన్ లా అనిపిస్తుంది. అవే పాత్రలు, కథనం కనిపిస్తాయి.  అలాగే యష్ రాజ్ వారి గూండే సినిమాని గుర్తు వస్తుంది.  గత ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లు వచ్చాయి. గర్వంగా చెబుతున్నా.. ఈ ఏడాది ‘దసరా’ వస్తోంది ఈ చిత్రం  ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని అన్నారు. ఆ స్దాయి ఉందా లేదా అన్నది కలెక్షన్స్ చెప్తాయి కానీ... కంటెంట్  మాత్రం యూనివర్సల్ అప్పీల్ ఉన్నదే.  ప్రేమ, ప్రెండ్షిప్, పాలిటిక్స్ ఈ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ప్రధానం.   ధరణి, వెన్నెల,సూరి ఈ మూడు పాత్రలు ఈ సినిమాలో కీలకం.  ఈ పాత్రలు, ఈ బేసిక్ ఎమోషన్స్ చుట్టూనే కథ,కథనం రాసుకున్నాడు.  అయితే కథ కొత్తగా అనిపించదు. కథనం అంతకన్నా రొటీన్ గా ఉంటుంది. ముఖ్యంగా కాంప్లిక్ట్ పాయింట్ రైజ్ చేసి కథనాన్ని పరుగెత్తించే విలన్ పాత్ర బలంగా ఉండదు. ఫలానా వాడు విలన్...అతనే సమస్యలకు మూలం అని హీరో కు తెలిసే సరికే కథ ఇంటర్వెల్ దాటేస్తుంది. అలాగే విలన్ ఎందుకోసం ఇదంతా చేస్తున్నాడనే కారణం రివీల్ అయ్యేసరికే సెకండాఫ్ సగం దాటిపోతుంది. అలా కథలో ఏదైతో కాంప్లిక్ట్ పాయింట్ ఉందో దాన్ని చెప్పకుండా ఇంటర్వెల్  సర్పైజ్ కోసం దాటి పెట్టడంతో బోర్ కొట్టేస్తుంది. పోనీ విషయం తెలిసాక అయినా హీరో ఎప్పుడు రైజ్ అవుతాడా అని ఎదురుచూడాల్సిన సిట్యువేషన్. అంత పవర్ ఫుల్ గా చెప్పబడే విలన్ సైతం అవకాసం కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తూంటాడు తప్పించి ముందుకు వెళ్లడు. విలనే ఖాళీగా ఉన్నప్పుడు హీరోకు ప్రత్యేకంగా పనే ముంటుంది. ఇద్దరు క్లైమాక్స్ కోసం ఎదురుచూడ్డం తప్పించి. మొత్తం కథ స్పీడుగా చెప్తే ఓ నలభై నిముషాలు కూడా రాదని పిస్తుంది. చాలా స్లో నేరేషన్ ఒక్కో అడుగు వేసుకుంటూ కథను నేరేట్ చేసాడు దర్శకుడు. ఫీల్ రిజిస్టర్ చేయాలని స్లో నేరేషన్ కు వెళ్లటం మంచిదే కానీ మరీ సహన పరీక్ష పెట్టకూడదు కదా. 

410
nani dasara movie-know the truth behind silk smitha connection

nani dasara movie-know the truth behind silk smitha connection

ఫస్టాఫ్ లో వీరపల్లి విలేజ్ ని ఎంతలా రిజిస్టర్ చేస్తారంటే మనకు ఆ ఊరు ఇంతకు ముందే పరిచయం ఉందేమో అనిపించేలా. డైరక్టర్ కు ఇక్కడ బాగా సక్సెస్ అయ్యారు.  అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఊహించగలిగేదే అయినా మంచి ఇంపాక్ట్  ఇస్తుంది. సెకండాఫ్ పై అంచనాలు పెంచేస్తుంది. థియేటర్ కు వెళ్లేముందు మనం సినిమాపై ఏ స్దాయి అంచనాలు పెట్టుకున్నామో అంతకు రెట్టింపు ఇక్కడ ఎక్సపెక్ట్ చేసేలా చేస్తుంది. అయితే సెకండాఫ్ ని ఆ స్దాయిలో సస్టైన్ చేయలేకపోయారు. ట్విస్ట్ లు, టర్న్ లు, సర్పైజ్ లు,సస్పెన్స్ ఎలిమెంట్స్ లేకుండా  ప్లాట్ గా నడుస్తూంటుంది. ఫస్టాఫ్ లో ఉన్న ఎక్సైట్మెంట్ ఇక్కడ మనకు కనపడదు. నిజానికి సెకండాఫ్ లో డ్రామా వేడెక్కి నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాలి. కానీ అది జరగదు. అయితే అదిరిపోయే విజువల్స్ మనని బోర్ వైపు ప్రయాణించకుండా కాపాడుతూంటాయి. క్లైమాక్స్ లో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసి థ్రిల్ చేస్తాడు.  స్లోగా సాగే ఈ  కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే  సినిమా ఆల్-ఇండియన్ సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. సినిమా  లొకలైజ్డ్, ఒరిజినల్, డీప్ రూటేడ్ గా ఉండటంతో  కొన్ని ప్రాంతాలకు పరిమితం అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఉన్న స్జాయిలో సెకండాఫ్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. పోనీ సెకండాఫ్ లాగ ఫస్టాఫ్ , ఫస్టాప్ లాగ సెకండాఫ్ ఉన్నా గ్రాఫ్ నిలబడేది.  క్లైమాక్స్ కాస్త హెవీగా అనిపించింది నిజం. అయితే ఇలాంటి కథలకు ఆ మాత్రం డోస్ అవసరం. డోస్ అంటే గుర్తు వచ్చింది. సినిమాలో మందు కొట్టని, మందు బాటిల్ లేని సీన్స్ వేళ్ల మీద లెక్క కట్టచ్చు. చివర్లో మందు తాగితే నాశనమైపోతారు అనే నీతి సైతం చెప్పారు. ఓవరాల్ గా..  ‘దసరా’ ‘రా’, రస్టిక్, ఇంటెన్స్  విత్ రొటీన్ స్టఫ్.

510
Dasara

Dasara

కొత్త దర్శకుడు ఎలా చేసారంటే..

కొత్త దర్శకుడు   దర్శకుడు శ్రీకాంత్ ఓదెల...కథలో ప్రధాన పాత్ర ధరణి ప్రపంచాన్ని దర్శకుడు  చాలా వైల్డ్ గా ప్రెజెంట్ చేసారు. కొన్ని దుష్టశక్తులు తమ గ్రామంలో సామరస్యానికి భంగం కలిగించినప్పుడు అతని ఆగ్రహం కట్టలు తెంచుకునే భావోద్వేగాన్ని సహజంగా ప్రెజెంట్ చేసాడు . తాను కొత్త దర్శకుడుని అయినా ఎక్కడా అది కనపడనివ్వకుండా విజువల్స్ ని తెరపై పరిచే ప్రయత్నం చేసారు.  హీరో నానితో  కలసి  ఒక అద్భుతాని అందించాలని తపించారు. కానీ కథ అతనికి పూర్తిగా సహకారం ఇవ్వలేదు. అలాగే కథనం సైతం విసిగించింది.  కథని ఎక్కడా మలుపులు లేకుండా స్లో నేరేషన్ లో చెప్పాలని ప్రయత్నించాడు. కొన్ని సార్లు ఏదో ఆర్ట్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది. ఇక ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీర్చిదిద్ది సహకరించాడు కెమెరామెన్.  ముఖ్యంగా  నాని క్యారెక్టర్‌లోని కీ ఎలిమెంట్స్ ని  మంచి యీజ్ తో ప్రజంట్ చేశారు. 

610
Asianet Image


 మిగతా విభాగాలు పనితీరు చూస్తే...

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ గ్యాప్ తర్వాత చేసిన తెలుగు సినిమా. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్  నేచురల్ గా,ప్రెష్ గా ఉండేలా చూసుకున్నాడు. . ‘ధూమ్‌ధామ్ దోస్తాన్’, ‘చమ్కీల అంగీలేసి’, ‘ఓరి వారి’ పాటలు బాగున్నాయి. అయితే అక్కడక్కడా తమిళ ప్లేవర్ అక్కడక్కడా మెరిసింది. సత్యన్ సూర్యన్ కెమెరా వర్క్ బ్రిలియెంట్ అని చెప్పాలి. ఈ సినిమా కష్టంలో సింహభాగం అతనిదే. సినిమాకు తగ్గ రా టోన్ ని సెట్ చేయటంలో కెమెరా వర్క్ ప్రధాన పాత్ర వహించింది. నవీన్ నూలి ఎడిటింగ్ కొంత బోర్ ని,స్లో ని తగ్గిస్తే బాగుండేది. రైటింగ్ సైడ్ చూస్తే డ్రామా పండించే దిసగా సక్సెస్ అయ్యారు కానీ సినిమా కథకు ఉండాల్సిన కొన్ని ఎలమెంట్స్ ని,సర్పైజ్ లను వదిలేసారు. అయితే లోకల్ ప్లేవర్ ని తీసుకురావటంలో మాత్రం వందశాతం సక్సెస్ అయ్యారు. యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాలో మరో హైలెట్ గా ఉన్న డిపార్టమెంట్.  డైలాగులు ఒరిజనల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే నాని రెగ్యులర్ సినిమా కి ఇది నెక్ట్స్ లెవిల్.

710
Dasara Movie Review

Dasara Movie Review


నటీనటుల్లో...

నటీనటుల మేకోవర్‌లు, బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల ప్రపంచాన్ని చూపించడం, వారు అనుసరించే ఆచారాల వరకు.. దసరా సరికొత్త అనుభూతిని అందిస్తుంది. నాని పక్కా మాస్ లుక్స్‌తో  తన విశ్వరూపం చూపించాడు. వెన్నెలగా నటించిన కీర్తి సురేశ్, విలన్‌గా చేసిన మలయాళ నటుడు షైన్ చాకో పాత్రల్లో పోటీపడ్డారు.  కీర్తి సురేష్ లో ఇంత మంచి నటి ఉందని ..మహా నటి తర్వాత మళ్లీ మనకు అనిపిస్తుంది. వెన్నెల లాంటి ప్రేయసి మనకూ ఉండాలి, చాకో ని మనమూ కొట్టాడాలని ప్రేక్షకులు కదిలిపోయేలా తెరకెక్కించారు. ధరణికి స్నేహితుడిగా నటించిన కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టికి కూడా సహజంగా చేసుకుంటూ పోయాడు. సాయికుమార్, ఝాన్సీ సపోర్టింగ్ పాత్రల్లో ఓకే. సముద్ర ఖని పాత్ర ఎందుకనో అసమగ్రంగా ఉంది. 

810
Asianet Image


బాగున్నవి?
 
ధరణిగా చెలరేగిపోయిన నాని నటన
ఇంటర్వెల్
క్లైమాక్స్ ఎమోషన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ

బాగోలేనివి?
 చాలా చోట్ల సినిమాటెక్ లిబర్టీ తీసుకోవటం
స్లో నేరేషన్
చాలా  Predictable జరిగే కథ
సెకండాఫ్ లో బోర్ మూమెంట్స్

910
Asianet Image

ఫైనల్ థాట్

కొత్త దర్శకులు మేకింగ్ స్టైల్ లో విభిన్నత చూపించటం,కొత్త విజువల్స్ ప్రెజెంట్ చేయటం దాకా శభాష్ అనిపించుకుంటే చాలదు. కథ,కథనంలోనూ  కొత్తదనం చూపించాలి. 
 
Rating:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
 

1010
Asianet Image


బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు
 డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ : విజయ్‌ చాగంటి
ఫైట్స్: రియల్ సతీష్, అన్బరివ్
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
Run time: U/A, 2h 36m 
విడుదల తేదీ: 30/03/2023

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
నాని (నటుడు)
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved