MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • మృణాల్ ఠాకూర్, శ్రీలీల, కృతిశెట్టి.. సాయిపల్లవి.. మొదటి సినిమాతో స్టార్లుగా మారిన హీరోయిన్లు ఎవరంటే..?

మృణాల్ ఠాకూర్, శ్రీలీల, కృతిశెట్టి.. సాయిపల్లవి.. మొదటి సినిమాతో స్టార్లుగా మారిన హీరోయిన్లు ఎవరంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తు అయితే అందులో పోరాడి సక్సస్ అవ్వడం మరో ఎత్తు.. ఆతరువాత అందరికంటే బెటర్ అనిపించుకుని స్టార్ గా ఎదగడం ఇంకో ఎత్తు. కాని ఇవేలి లేకుండానే ఫస్ట్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ టాలీవుడ్ బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.  

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 15 2023, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇండస్ట్రీలోకి రావడమే కాదు.. తెలివిగా నెట్టుకురావడం కూడా తెలియాలి. లేకుంటే చాలా తక్కువ టైమ్ లోనే ఫెయిడ్ అవుట్ అయిపోతుంటారు. కాని మొదటి సినిమాతోనే స్టార్లుగా ఎదిగి.. ఆ స్టార్ డమ్ ను నిలబెట్టుకుంటూ..తెలివిగా నెట్టుకొస్తున్న టాలీవుడ్ బ్యూటీస్ గురించి చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రీసెంట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాలు ఠాకూర్. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమాతో ఎక్కడికో వెళ్ళి పోయింది మృణాల్ ఇమేజ్. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతారామం సినిమాలో ఆమె పర్ఫామెన్స్ కు.. బ్యూటీకి ఫిదా అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్. ఈసినిమాలో ఆమె ఎక్స్ పోజింగ్ చేసింది లేదు. సినిమా అంత అచ్చతెలుగు ఆడపడుచులా చీరలోనే కనిపిస్తుంది. కాని మృణాల్ నటనకు, అందానికి ఫిదా అయిపోరు. ఈ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. కాని ఆలోచించి అడుగులువేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం నాని హీరోగా రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది బ్యూటీ. స్టార్ హీరోలు కూడా మృణాల్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. 

38

ఇక ఈ లిస్ట్ లో ఉన్న మరో హీరోయిన్ శ్రీలీల. ఈ హీరోయిన్ ది మరీ విచిత్రమైన పరిస్థితి. మొదటి సినిమా ప్లాప్ అయినా కూడా శ్రీలీలకు మంచి ఇమేజ్ వచ్చింది టాలీవుడ్ లో. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్ళి సందడి సినిమాతో శ్రీలీలా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాని శ్రీలీల బ్యూటీకి మాత్రం జనాలు ఫిదా అయిపోయారు. మేకర్స్ ఆమె వెంట పడటం స్టార్ట్ చేశారు. అవకాశాలు వరుస కట్టాయి. రీసెంట్ గా రవితేజ్ తో కలిసి ధమాకాలో మెరుపులు మెరిపించి 100 కోట్ల హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల.. బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. 

48

ఇక ఉప్పెనసినిమాతో స్టార్ గామారిపోయింది కృతిశెట్టి. బేబమ్మగా పాపులర్ అయ్యింది. ఈసినిమా తరువాత స్టార్ హీరోలు కృతి శెట్టి ఉంటేనే సినిమా అన్నట్టుగా మారిపోయిందిపరిస్థితి. వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ కూడా కొట్టేసింది. ఉప్పెన తరువాత నాని, నాగచైతన్య,రామ్ లాంటియంగ్ స్టార్ హీరోల సరసన మెరిసింది బ్యూటీ. రామ్ తో  నటించి వారియర్ సినిమాతో  గట్టి దెబ్బ తగలడంతో.. కాస్త చూసి సినిమాలు సెలక్ట్ చేసుకుంటుంది. 

58
Sai Pallavi

Sai Pallavi

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ సాయిపల్లవి. తన నటనతో అందరినీ ఫిదా చేసేసింది. తెలంగాణ యాసతో తెలుగు వాళ్లకి మరింతగా దగ్గర అయింది. స్టార్ హీరో సరసన అవకాశం రావడం కాదు.. హీరోయిన్ కు మంచి క్యారెక్టర్ ఉండి. సినిమాలో ఇంపార్టెన్స్ ఉండాలి అనికోరుకుంటుంది బ్యూటీ. అందుకే మహేష్ సరసన నటించే అవకాశం వచ్చినా వదులుకుంది. తనకు నచ్చిన సినిమాలు. కథా బలం ఉన్న సినిమాలు సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తుంది బ్యూటీ. 
 

68
Payal Rajput

Payal Rajput

ఇక ఒక్క సినిమాతో స్టార్ డమ్ వచ్చి.. దాన్ని నిలబెట్టుకోలేకపోయిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో పాయల్ రాజ్ పుత్ ఒకరు.ఆర్.ఎక్స్. 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కూడా ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసింది. డిస్కోరాజా, వెంకిమామా, తీస్ మార్ ఖాన్ వంటి సినిమాల్లో నటించింది. కాని ఆర్ ఎక్స్ 100 తరువాత పాయల్ కుసాలిడ్ హిట్ పడలేదు. తన సినిమాల సెలక్షన్.. కథల విషయంలో జాగ్రత్త లేకపోవడమే.. తనకెరీర్ ఇలా అవ్వడానికి కారణం అంటోంది పాయల్. ఇక రీసెంట్ గా మంచు విష్ణు తో కలిసి జిన్నా సినిమాలో కూడా నటించింది పాయల్ రాజ్ పుత్. 

78

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. తెలుగులో వరుస ఆఫర్లు రావడం.. పెద్ద పెద్ద హీరోలందరితో దాదాపు నటించేసింది రకుల్ ప్రీత్ సింగ్. కాని ఈ హీరోయిన్ కెరీర్ లో సక్సెస్ రేటు తక్కువనే చెప్పాలి. ఇక ఇప్పుడు అయితే అసలు టాలీవుడ్ లో అవకాశాలే లేవు. దాంతో బాలీవుడ్ బజన చేస్తోంది బ్యూటీ. కాని అక్కడ కూడా సక్సెస్ లు రావడంలేదు అనే చెప్పాలు. ఇక ఈ భామకు ఓటీటీనే దిక్కు అయ్యేట్టు ఉంది. 

88
Samantha ruth prabhu

Samantha ruth prabhu

ఇక టాలీవుడ్ లో పక్కా ప్లాన్ తో కెరీర్ ను తీసుకువెళ్తున్న హీరోయిన్ సమంత. ఫస్ట్ మూవీ ఏం మాయ చేసావే సినిమాతో  సూపర్ హిట్ అందుకుని స్టార్ గా ఎదిగింది సమంత.  అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.  పెళ్లి, విడాకుల తరువాత కూడా బిజీ హీరోయిన్ గానే ఉంది సమంత. ఏజ్ పెరుగుతున్న కొద్ది ఆమె డిమాండ్పరుగుతుంది.రీసెంట్ గా సమంత నటించిన యశోద చిత్రం మంచి విజయం సాధించింది. సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉంది. కాని ఆమె అనారోగ్యం కారణంగా ముందు ముందు సినిమాలు చేస్తుందో లేదో క్లారిటీ లేదు. ఇలా ఇంకా చాలా మంది  హీరోయిన్లు ఫస్ట్ సినిమాతోనే హిట్టుకొట్టిన వారు ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image2
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image3
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved