MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • ఎమోషనల్ థ్రిల్లర్ : 'శ్రీమతి ' రివ్యూ

ఎమోషనల్ థ్రిల్లర్ : 'శ్రీమతి ' రివ్యూ

మధ్య తరగతి మహిళ జ్యోతి జీవితంలో పిల్లలు లేకపోవడం ఒకే ఒక లోటు. స్నేహితురాలి సహాయం చేయాలని భావించిన జ్యోతి జీవితంలో ఏం జరిగింది? చివరికి ఏమైంది అనేది మిగతా కథ.

3 Min read
Author : Surya Prakash
Published : Nov 06 2024, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Janvi Rayala, srimathi movie

Janvi Rayala, srimathi movie

 స్టార్స్ లేకపోయినా చిన్న సినిమాలు చూడగలమా, ఇంట్రస్ట్ గా ఉంటాయా అంటే కొన్ని సార్లు అవుననే చెప్పాలి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా చివరిదాకా కూర్చోబెట్టగలిగితే సినిమాలు చిన్నా,పెద్దా తేడా లేకుండా చూడగలం ఆ విషయం శ్రీమతి అనే ఈ చిత్రం నిరూపించింది.

తెలుగు కుర్రాడు శశిధర్ రెడ్డి  పార్లపల్లి ( Sasidhar Reddy Parlapalli,) సినిమాపై ఫ్యాషన్ తో తనే నిర్మాతగా మారి చేసిన ఈ ప్రయత్నం కన్నడ ఆడియన్స్ ని మొదట అలరించింది. తెలుగులో రిలీజ్ చేయలేని పరిస్దితుల్లో యూట్యూబ్ లో పెడితే ఇక్కడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జనం బాగా మాట్లాడటమే ఈ సినిమా సక్సెస్ అయ్యింది అనటానికి గుర్తు. అసలు ఈ సినిమా కథేంటి, చూడదగ్గ కంటెంట్ ఉన్న సినిమానేనా వంటి వివరాలు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Janvi Rayala, srimathi movie

Janvi Rayala, srimathi movie


స్టోరీ లైన్

జ్యోతి (జాన్వి రాయల) ఓ మధ్య తరగతి మహిళ. ఆమె  భర్త కిషోర్ (ప్రశాంత్ ) బ్యాంక్ మేనేజర్. అయితే ఆమెకు ఒకటే లోటు పిల్లలు లేకపోవటం. అటు అత్తవారి వైపు నుంచి ప్రెజర్ ఉంటుంది. ఈ క్రమంలో భర్త తో కలిసి పిల్లలు పుట్టడం లేదని గైనాకాలజిస్ట్ ని కలవటంతో సినిమా మొదలవుతుంది. డాక్టర్ సలహా తీసుకున్న ఆమె ఇంటికి వచ్చాక, తన చిననాటి స్నేహితురాలు సవిత (రూపా రాయప్ప) నుంచి కాల్ రావటంతో ఆనందపడుతుంది. చాలా కాలం క్రితం కలిసిన ఆమె ఇప్పుడు టచ్ లోకి రావటం ఆనందం కలిగిస్తుంది. ఆమెను తన ఇంటికి తీసుకువస్తుంది. 
 

36
Janvi Rayala, srimathi movie

Janvi Rayala, srimathi movie


సవితది లో మిడిల్ క్లాస్. భర్త, ఓ కొడుకు. ఆమె అప్పటికే సమస్యల్లో ఉంటుంది. జ్యోతి ఇంటిని, ఆమె బంగారం, డబ్బు చూసి ఆశ్చర్యపోతుంది. సంతోషపడుతుంది. అక్కడ నుంచి వాళ్లిద్దరూ తరుచుగా కలుస్తూంటారు. ఓ రోజు సవిత బాగా డల్ గా ఉండటం గమనించి విషయం ఏంటని జ్యోతి అడుగుతుంది. దాంతో సవిత తన కష్టాలు చెప్పుకుంటుంది.

తన నాయనమ్మకు ఒంట్లో బాగోలేదని, వెళ్లి చూడాలని ఉన్నా, వెళ్లలేని పరిస్దితి అంటుంది. అందుకు కారణం తనకు తన నాయనమ్మ ఇచ్చిన నగలు తాను తాకట్టు పెట్టడమే అంటుంది. ఇప్పుడు తన ఒంటిపై నగలు లేకపోతే ముందే బెంగ పెట్టుకుని నాయనమ్మ చనిపోతుంది అని చెప్తుంది. జ్యోతి కు ఎలా ఓదార్చలో అర్దం కాదు.  

46
Janvi Rayala, srimathi movie

Janvi Rayala, srimathi movie


అయితే సవితే దానికి ఓ ఉపాయం చెప్తుంది. నువ్వు నాకు సాయిం చేయాలనుకుంటే ఓ ఐదు లక్షలు అప్పుగా ఇస్తే తాకట్టు పెట్టిన నగలు తెచ్చుకుంటానంటుంది. నా దగ్గర అంత డబ్బు లేదని జ్యోతి అంటే..అయితే నీ నగలు ఓ వారం రోజులు నాకు ఇవ్వు...బంగారం షాపులో నా నగలు తాకట్టు విడిపించి, ఆవిడను చూసి వచ్చాక ఇచ్చేస్తాను అంటుంది.

జ్యోతి మొదట ఒప్పుకోకపోయినా స్నేహ ధర్మం కోసం సానుభూతితో సరే అంటుంది. తన బంగారం ఇస్తుంది. దాన్ని తాకట్టు పెట్టి సవిత నగలు విడిపిస్తుంది. అయితే ఆ తర్వాత సవిత అసలు స్వరూపం తెలుస్తుంది. దాంతో అటు భర్తకు చెప్పలేక, ఆ ఐదు లక్షలు ఇవ్వలేక, సవితను పట్టుకోలేని  పరిస్దితుల్లో జ్యోతి ఏం చేసింది. చివరకు ఏమైంది అనేది మిగతా కథ.

56
Janvi Rayala, srimathi movie

Janvi Rayala, srimathi movie


ఎలా ఉంది

చెప్పుకోవటానికి చిన్న స్టోరీ లైన్ అయినా ఇంట్రస్టింగ్ డైరక్టర్ నేరేట్ చేసారు. ఎక్కడా కొత్త దర్శకుడు సినిమా అనిపించదు. కథలోకి మొదటి పది నిముషాల్లోనే వచ్చి లాక్ చేసేయటంతో చివరి దాకా చూస్తాము. జ్యోతి పాత్ర మనకు తెలిసి ఉన్నదే, మన కుటుంబాల్లో చూసిందే అనిపిస్తుంది. అలా తెలియకుండానే కథలోకి వెళ్లిపోతాము. ఫస్టాఫ్ ఇంట్రస్టింగ్ నడిపిన దర్సకుడు సెకండాఫ్ కొద్దిగా లాగినట్లు అనిపిస్తుంది.

మళ్లీ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ లో కథపూర్తిగా దారిలో పడుతుంది. ఈ కథ మనకు తెలిసిన వాళ్లదే అనిపించటం, జ్యోతి  పాత్ర ఏమౌతుందా, సమస్య నుంచి ఎలా బయిటపడుతుంది అని మనలో ఆలోచన పుట్టించటంలో డైరక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. టెక్నికల్ గా అధ్బుతం అని చెప్పలేం కానీ ఉన్నంతలో బాగుంది. ఆర్టిస్ట్ ల నుంచి మంచి ఫెరఫార్మెన్స్ రాబట్టారు. డైరక్టర్ కు మంచి బడ్జెట్ ఇస్తే మంచి సినిమా చేయగలడు అనిపించింది.

66
Janvi Rayala, srimathi movie

Janvi Rayala, srimathi movie

చూడచ్చా
నిరభ్యంతరంగా చూడచ్చు. ఇంట్రస్టింగ్ నేరేషన్. ముఖ్యంగా మహిళలకు బాగా నచ్చుతుంది.

ఎక్కడుంది

సినిమా యూట్యూబ్ లో శ్రీమతి అనే టైటిల్ తో ఉంది , ఉచితంగానే చూడవచ్చు. 
, 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved