భీమా ప్రీమియర్స్ రివ్యూ: గోపీచంద్ నట విశ్వరూపం, ఆ ఎపిసోడ్స్ కి గూస్ బంప్స్!
హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా. శివరాత్రి కానుకగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీమా యూఎస్ ప్రీమియర్స్ ముగిశాయి.
Bimaa Review
ఒకప్పుడు గోపీచంద్ టాలీవుడ్ మాస్ హీరోల్లో ఒకరు. దాదాపు స్టార్ హీరో రేంజ్. మాస్ ఆడియన్స్ కి గోపీచంద్ చిత్రాలు ఫీస్ట్ అని చెప్పాలి. అయితే గోపీచంద్ వరుస పరాజయాలతో రేసులో వెనుకపడ్డాడు. గోపీచంద్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోతుంది. ఈ మధ్య కాలంలో విడుదలైన పక్కా కమర్షియల్, రామబాణం నిరాశపరిచాయి.
Bimaa Review
దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా భీమా చేశాడు. ఈ చిత్ర ట్రైలర్ లో గోపీచంద్ కష్టం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మార్చి 8న భీమా విడుదల చేశారు. ఏ హర్ష దర్శకుడు కాగా, కేకే రాధామోహన్ నిర్మించారు.
Bimaa Review
గోపీచంద్ కి జంటగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటించారు. నాజర్, నరేష్, వెన్నెల కిషోర్, పూర్ణ కీలక రోల్స్ చేశారు. భీమా పరశురామ క్షేత్రం అనే ఓ ప్రదేశంలో ముడిపడిన కథ. ఆ ప్రాంతం వేదికగా జరిగే అరాచకాలు అరికట్టేందుకు హీరో గోపీచంద్ పోలీస్ గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది....
Bimaa Review
భీమా చిత్ర ప్రీమియర్స్ ముగిశాయి. మూవీ చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దాం. భీమా చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ లేపుతాయట. గోపీచంద్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారట.
Bimaa Review
ఊరమాస్ క్యారెక్టర్ లో గోపీచంద్ విశ్వరూపం చూపాడట. రెండు భిన్నమైన పాత్రలు చాలా ఇంటెన్సిటీ కలిగి ఉంటాయట. యాక్షన్ ఎపిసోడ్స్ గోపీచంద్ ఇరగదీశాడని ఆడియన్స్ టాక్. హీరోయిన్స్ ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మల పాత్రలు కథలో కీలకంగా ఉంటాయట.
Bhimaa
హర్ష దర్శకత్వం పర్లేదు అంటున్నారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ బీజీఎమ్ ఆకట్టుకుందని అంటున్నారు. సినిమాలో కొన్ని మైనస్ లో ఉన్నప్పటికీ యాక్షన్ మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఈ వీకెండ్ కి భీమా కూడా మంచి ఛాయిస్ అని సోషల్ మీడియా జనాల అభిప్రాయం...