Gaami Review: `గామి` మూవీ రివ్యూ, రేటింగ్..
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ప్రయోగాత్మక మూవీ `గామి`. విద్యధర కగిట దర్శకత్వం వహించిన చిత్రమిది. నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Gaami Review
విశ్వక్‌సేన్ చివరగా `ధమ్కీ` చిత్రంతో వచ్చాడు. ఇది ఫర్వాలేదనిపించుకుంది, కానీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు ప్రయోగాత్మక మూవీ `గామి` లో నటించారు. దాదాపు నాలుగేళ్లు షూటింగ్ చేసుకుంది. అఘోరల కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందింది. విద్యాధర్ కగిట దర్శకత్వంలో రూపొందింది. చాందినీ చౌదరీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. టీజర్,ట్రైలర్‌తో మెప్పించి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ నేడు శుక్రవారం(మార్చి 8)న మహిళా దినోత్సవం స్పెషల్‌గా రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Gaami Review
కథః
శంకర్(విశ్వక్ సేన్) ఒక అఘోర. తెలియని ఒక సమస్యతో బాధపడుతుంటాడు. అతన్ని ఏ మనిషి టచ్ చేసినా బాడీలో మార్పులు వస్తుంటాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. దీంతో తమ ఆశ్రమం నుంచి అతన్ని వెళేస్తారు. తనని చేరదీసిన గురువు వద్దకు వెళ్లాలని కాశీకి వెళ్తాడు. గురువు అప్పటికే చనిపోతాడు. అతని శిష్యుడి ద్వారా తనకు ఉన్న సమస్య తెలుసుకుంటాడు. దానికి పరిష్కారం హిమాలయాల్లోని త్రివేణి పర్వతంలో 36ఏళ్లకి ప్రకాశించే మాలిపత్రి చెట్టులో ఉంటుందని చెబుతాడు. వైద్ర తిథి రోజున మాత్రమే మాలిపత్రి ప్రకాశిస్తుంది. ఆ సమయంలోనే దాన్ని తీసుకుంటే తన సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెబుతాడు. అతను ఇచ్చిన మ్యాప్‌తో బయలు దేరతాడు. జాహ్నవి(చాందినీ చౌదరి) కూడా తన మెడికల్ ప్రయోగం కోసం దాన్ని పొందాలని అతనితో కలిసి వెళ్తుంది. హిమాలయాల్లో చాలా కష్టంగా వీరి ప్రయాణం సాగుతుంది. అడుగడుగున అడ్డంకులు ఎదురవుతాయి.
Gaami Review
మరోవైపు ఓ గ్రామంలో దేవదాసి దుర్గ(అభినయ) అనారోగ్యంతో బాధపడుతుంది. వృత్తిలో కొనసాగలేకపోతుంది. ఆ వృత్తిని వదిలి తన కూతురు ఉమా(హారిక పెద్ద) వద్దకు వెళ్తుంది. కానీ ఆ ఊరు గుడికి దేవదాసి లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతుంటాయి. దీంతో తన దుర్గ కూతురుని ఆ వృత్తిలోకి తీసుకోవాలనుకురావాలని ఊరు పెద్ద సర్పంచ్ ఆదేశిస్తారు. కానీ ఆమె ఆ వృత్తికి సెట్‌కాదని వైద్యులు నిర్ణయిస్తారు. అరుదైన జెన్యూవుతో జన్మించిందని చెప్పి ఆ అమ్మాయిని ఓ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కి పంపిస్తారు.
ఇంకోవైపు ఆ మెడికల్ రీసెర్చ్ లో అనేక హింసలకు గురవుతుంటాడు ఓ కుర్రాడు (సబ్జెక్ట్ సీ-333). అందులో నుంచి తప్పించుకునే ప్రయత్నం అనేక అడ్డంకులను ఫేస్ చేస్తుంటాడు. మరి శంకర్‌కి మాలి పత్రి దొరికిందా? తిరిగి మామూలు మనిషిలా మారాడా? ఉమాకి సంబంధించి మెడికల్ రీసెర్చ్ లో ఏం తేలింది? ఆ మెడికల్ క్యాంప్‌లో మగ్గే కుర్రాడు దాన్నుంచి బయటపడ్డాడా? లేదా? అసలు ఈ మూడు కథలకు ఉన్న సంబంధం ఏంటి? అసలు శంకర్ ఎవరు? అనేది `గామి` చిత్ర అసలు కథ.
Gaami Review
విశ్లేషణః
`గామి` ఒక ప్రయోగాత్మక మూవీ. స్క్రీన్ ప్లే పరంగా ఇది `కేరాఫ్ కంచెరపాలెం` సినిమాని గుర్తు చేస్తుంది. సేమ్ అలానే ఉంటుంది. అయితే చూడ్డానికి అఘోర, శివుడు, కాశీ, హిమాలయాలు అనే హంగామా సినిమాలో కనిపిస్తుంది. కానీ దానిలోని అసలు కథ వేరే. సైన్స్, మూఢనమ్మకాలకు ముడివేస్తూ చేసిన చిత్రమిది. ఒక విభిన్నమైన ప్రయత్నమని చెప్పొచ్చు. ఒకేసారి మూడు కథలను పారలల్‌గా నడిపిస్తుంటాడు. విశ్వక్ సేన్ తన సమస్య కోసం హిమాలయాల్లో సాహసం చేస్తుంటే, దేవదాసిగా అభినయ స్ట్రగుల్ అవుతుంది. ఆ వృత్తి నుంచి బయటపడేందుకు ఆమె పాప స్ట్రగుల్ అవుతుంది. మరోవైపు మెడికల్ క్యాంపులో కుర్రాడు ఆ హింసల నుంచి బయటపడేందుకు స్ట్రగుల్ అవుతుంటారు. మూడు కథల్లోనూ బతకడం కోసం పోరాటం అనేలా సాగుతుంది. అయితే ఇందులో సినిమా ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది. ప్రతి ఎలిమెంట్‌కి సస్పెన్స్ పెట్టి సినిమాని నడిపించాడు దర్శకుడు. ఆడియెన్స్ అలా ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక దశలో అది అర్థం కాక విసుగు పుట్టించేలా ఉంటుంది.
కథ పరంగా చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. కానీ దాన్ని ఆడియెన్స్ కి అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. అనేక అంశాలను సస్పెన్స్ తో వదలడంతో ఆడియెన్స్ లో బిగ్ కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. సస్పెన్స్ అంశాలు ఒకదశలో చిరాకు పెట్టించేలా ఉంటాయి. మెడికల్ క్యాంప్‌లో జరిగే ప్రయోగాలు ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా లేవు. అవి కథకి సింక్ అయ్యేలా లేవు. మరోవైపు అమ్మాయి ఉమా.. అమ్మాయా, అబ్బాయా అని చెప్పే విషయంలోనూ లాజిక్ మిస్ అయ్యింది. సినిమాలో చూస్తున్నదానికి మెడికల్‌గా చెప్పేదానికి పొంతన కుదరలేదు. అలాగే హిమాలయాల్లో సింహంతో పోరాటం కనెక్టింగ్‌గా లేదు. అసలు చాందిని చౌదరి పాత్ర ఎందుకు పెట్టారో అర్థం కాదు. హిమాలయాల జర్నీనే మొదటి భాగం మొత్తం చూపించారు. అయా సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. కథ పరంగా స్క్రీన్ ప్లే పరంగా మేజర్ లోపంగా చెప్పొచ్చు. క్లైమాక్స్ లోనూ క్లారిటీ లేదు. చాందిని చౌదరి పాత్రలోనూ క్లారిటీ లేదు. హిమాలయాల్లో అంత ఈజీగా తిరగడం కన్విన్సింగ్‌గా లేదు. ఒక పర్వతంనుంచి మరో పర్వతానికి వెళ్లానికి కావాల్సిన సన్నివేశాల్లో, ఈ క్రమంలో వచ్చే డ్రామా ఏమాత్రం పండలేదు. సినిమా కాబట్టి ఏదైనా జరుగుతుందనేలా ఉంది.
Gaami Review
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. మ్యూజిక్, బీజీఎం అదిరిపోయింది. సినిమాని ఎంగేజ్ చేయడంలో మేజర్ పాత్ర పోషించింది. బ్యాక్ బోన్ లా నిలుస్తుంది. మరోవైపు విజువల్స్ మాత్రం వండర్‌లా ఉన్నాయి. విజువల్స్ లో క్లారిటీ లేకపోయినా ఒక కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. అకట్టుకుంటాయి. ఇలా టెక్నీకల్‌గా సినిమా చాలా బ్రిలియంట్‌గా ఉంది. కానీ సినిమాని కన్‌ఫ్యూజన్ లేకుండా తీస్తే ఇంకా బాగుండేది. లాజిక్స్ విషయంలో జాగ్రత్త పడితే సినిమా స్థాయి వేరేలా ఉండేది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా గామి ఒక ప్రయోగాత్మక మూవీలా నిలుస్తుంది. కానీ సాధారణ ఆడియెన్స్ కి కనెక్ట్ కావడం కష్టం.
నటీనటులుః
శంకర్ పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం సినిమాలో కనిపిస్తుంది. మాస్ హీరోగాకనిపించే విశ్వక్‌సేన్‌ని ఇలాంటి పాత్రలో చూడటం కూడా చాలా హార్డ్ గానే అనిపిస్తుంది. ఆయన లుక్, పడే కష్టాలకు, ఆయన డైలాగ్ డెలివరీ సింక్ కుదరలేదనిపిస్తుంది. చాందిని చౌదరి ఫర్వాలేదనిపిస్తుంది. దేవదాసిగా అభినయ బాగా చేసింది. హృదయాన్ని కదిలించేలా ఉంది. ఉమాగా హారిక పెద్ద పాత్ర సైతం ఆకట్టుకునేలా ఉంది. ఆ అమ్మాయి చాలా నేచురల్‌గా చేసింది. మెడికల్ క్యాంప్‌లో కుర్రాడు కూడా మెప్పించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.
టెక్నీకల్‌గాః
సినిమాకి టెక్నికల్ టీమ్ పెద్ద అసెట్. వీఎఫ్‌ఎక్స్ అదిరిపోయాయి. చిన్న సినిమాకి ఈ రేంజ్ విజువల్స్ అంటే అభినందించాల్సిందే. ఇక కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ కెమెరాతో వండర్ క్రియేట్ చేశాడు. అలాగే సంగీతం మరో పెద్ద అసెట్. మెయిన్‌గా బీజీఎం వేరే లెవల్‌లో ఉంది. సినిమాని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిందనడంలో అతిశయోక్తి లేదు. నరేష్ కుమారన్ బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చారు. ఇక దర్శకుడు విద్యధర కగిట లో విషయంలో ఉందని నిరూపించే చిత్రమిది. చాలా హైలీ ఇంటలిజెంట్‌తో తీశాడు. కానీ సాధారణ ఆడియెన్స్ కి అర్థమయ్యేలా తీయడంలో సక్సెస్ కాలేకపోయాడు. లాజిక్కులపై వర్క్ చేయాల్సింది. మూడు కథలకు పెట్టిన లింక్ విషయంలో మరింత వర్క్ చేయాల్సింది. క్లైమాక్స్ ని అర్థాంతరంగా వదిలేయడం మేజర్‌మైనస్. స్క్రీన్ ప్లే మేజర్ మైనస్.
ఫైనల్‌గాః `గామి` టెక్నీకల్‌గా బ్రిలియంట్‌గా ఉన్నా అర్థంకానీ ప్రయోగం.
రేటింగ్‌ః 2.25