ఎంత మంచివాడవురా! రివ్యూ

First Published 15, Jan 2020, 1:51 PM

--సూర్య ప్రకాష్ జోశ్యుల
సాధారణంగా నెగిటివ్ టైటిల్ కు జనం బాగా కనెక్ట్ అవుతూంటారు. ఎంత చెడ్డవాడివిరా అంటే వెంటనే ఆసక్తిగా అటు వైపు తల తిప్పుతారు. ఈ విషయం తెలిసినా పాజిటివ్ నెస్ కు పట్టం కడుతూ `ఎంత మంచివాడ‌వురా!` అంటూ కల్యాణ్ రామ్ సంక్రాంతి రేసులోకి దిగారు. ఇప్పటికే రెండు పెద్ద స్ట్రైయిట్ సినిమాలు తమ సత్తా చూపుతూ..పందెం కోళ్లులా భాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నాయి. వాటి మధ్యలో ఈ సినిమా దిగింది. ఏమో శతభానంభవతి సినిమాలా హిట్ కొట్టేస్తుందేమో, ఫ్యామిలీలకు పండగ చేసేస్తుందేమో అని అంతా ఆశించారు. దానికి తోడు గుజరాత్ లో పెద్ద హిట్టైన ఆక్సిజన్ అనే చిత్రానికి రీమేక్ కావటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా, ఈ చిత్రం కథేంటి, మంచివాడికి జనం బాగా మార్కులు వేస్తున్నారా వంటి విషయాలు చూద్దాం.
 
కథేంటి....పాటిటివిటీకు బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు బాలు(కళ్యాణ్ రామ్). చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోవడంతో అనాధగా పెరగటంతో..తనలాంటి వాళ్లు కనపడితే వెంటనే సాయం చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటాడు. షార్ట్ ఫిలింలలో నటిస్తూ అతనికో ఆలోచన వస్తుంది.  ‘ఆల్ ఈజ్ వెల్ రిలేటివ్స్ సప్లయర్స్’ అనే స్టార్టప్ స్టార్ట్ చేస్తాడు. ఒంటరితనంతో బాధపడే వాళ్లకు జనాలని సప్లై చేయటమే ఈ స్టార్టప్ సంస్ద ఆశయం. ఈ క్రమంలో తన వద్దకు వచ్చిన కుటుంబాల్లో వారి అవసరానికి తగ్గట్లు కొడుకుగా, మరొకరుగా మారుతూంటాడు...మారు పేర్లతో ముందుకు వెళ్తూంటాడు. అయితే ఇలా వేరు వేరు చోట్ల వేరు వేరు పేర్లతో చలామణి అవటం...

అతని బాల్య స్నేహితురాలు నందిని (మెహ‌రీన్‌) కి అనుమానం వస్తుంది. ఆమె మన మంచోడు చేసే షార్ట్ ఫిల్మ్ లకు ప్రొడ్యూసర్ అన్నమాట. దాంతో ఆమె ఇతనిపై ఓ కన్నేసి, ఇన్విస్టిగేట్ చేస్తూంటుంది. ఈ క్రమంలో తణికెళ్ల భరణి కుటుంబానికి కొడుకుగా వెళ్లిన మంచోడుకు అక్కడ లోకల్ గా అతడు సినిమాలో లాంటి సమస్యలు ఎదురౌతాయి. ఇసుక మాఫియా నడిపే గంగరాజు గంగరాజు(రాజీవ్ కనకాల)తో ఓ గొడవ అవుతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేసాడు. అక్కడ నుంచి బాలు జీవితంలో ఏ మార్పులు వస్తాయి.. అసలు  ‘ఆల్ ఈజ్ వెల్ రిలేటివ్స్ సప్లయర్స్’ స్టార్టప్ సక్సెస్ అవుతుందా వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. సినిమా అంటే ఇలాగే ఉండాలా..ఏం టీవి సీరియల్ గా ఉండకూడదా అని భావించి తీసినట్లు సీన్స్ వచ్చి పోతూంటాయి. అలాగే కథలో పెద్దగా కాంప్లిక్ట్ లేకపోవటంతో చాలా సీన్స్ పరమ బోర్ గా సాగుతాయి. దానికి తోడు బడ్జెట్ పెద్దగా లేకపోవటమో ఏమో కానీ నాశిరకంగా ఉంటాయి.   ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌ ఎమోషన్‌ సప్లయిర్‌’ అనే కొత్త కాన్సెప్ట్‌  ఆలోచింప చేసే విధంగా ఉందికానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం ఆ అవకాసం మనకు ఇవ్వదు. ఫస్టాఫ్ లో ముడేసి, సెకండాఫ్ లో దాన్ని విప్పటం మీదే దృష్టి పెట్టారే కానీ , ఆ క్రమంలో వచ్చే సీన్స్ ఎంత వరకూ ఎంగేజ్ చేస్తాయని చూసుకోలేదు.

అలాగే కథ చిన్నది కావటంతో కథనంపై పూర్తిగా దృష్టి పెట్టాల్సింది. స్క్రీన్ ప్లేని మరింత ఇంట్రస్టింగ్ గా చేసుకోవాల్సింది. ఎనభైల నాటి వ్యవహారంలా  స్క్రీన్ ప్లేలో ఓ విషయం దాచి పెట్టి..దాన్ని ఎలివేట్ చేయటమే ప్రధానాంశంగా అనుకోవటమే దెబ్బ కొట్టింది. ఈ కాలం ప్రేక్షకుడు వరల్డ్ సినిమాని చూడటం అనేది  పెద్ద విషయంగా భావించటం లేదు. అలాంటి స్దాయికి ఎదిగిన వారిని ఆకట్టుకోవాలంటే ఈ స్దాయి సరిపోదు. దానికి తోడు కామెడీ కూడా అనుకున్న స్దాయిలో పండలేదు. క్లైమాక్స్ అయితే పరమ రొటీన్ డ్రామా.

టెక్నికల్ గా..దర్శకుడు వేగెశ్న సతీష్ ఒరిజనల్ ఆక్సిజన్ ని ఇక్కడ ఎడాప్ట్ చేయాలనుకున్నప్పుడు చేసిన మార్పులు..మారిన తెలుగు సినిమా కథ చెప్పేందుకు సరిపోలేదు. అక్కడికీ ఆయన స్వతహాగా రైటర్ కాబట్టి డైలాగులు వంటివి కొన్ని చోట్ల బాగా పేలాయి. సాంకేతికంగా ఈ సినిమాకు టీమ్ బాగానే పనిచేసినా ఫైనల్ అవుట్ పుట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అలాగే గోపిసుందర్ సంగీతం మ్యాజిక్ కూడా మిస్సైంది. ఎడిటింగ్ ఓ అరగంట లేపేయచ్చు, ఇంక ఈ సెకండాఫ్ పూర్తికాగా అనే ఫీల్ ని కలగ చేసింది. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ రాజ్ తోట ఈ చిత్రానికి మంచి ఫొటొగ్ర‌ఫీని అందించారు. నిర్మాణ విలువలు కొన్ని చోట్ల బాగున్నా...చాలా చోట్ల చుట్టేసిన ఫీల్ కలగ చేసాయి.

నటీనటుల్లో కళ్యాణ్ రామ్ సీన్స్ ఎలా ఉన్నా..లాగటానికి ట్రై చేసాడు. అయితే ఎమోషన్ సీన్స్ లో తేలిపోయాడు. మెహరీన్..మళ్లీ గ్లామర్ బొమ్మే.  కీ రోల్స్ లో కనిపించిన  శ‌ర‌త్‌బాబు, సుహాసిన‌ని, విజ‌య్‌కుమార్‌, వెన్నెల కిషోర్‌, రాజీవ్ క‌న‌కాల‌, ప‌విత్ర లోకేష్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించారు. రాజీవ్ క‌న‌కాల విల‌నిజ‌మ్ మెప్పించినా, అతన్ని విలన్ గా ఏక్సెప్టు చేయటం కష్టమే. వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను లు ఫన్ చేద్దామని చాలా ట్రై చేసారు కానీ ...సీన్స్ కలిసిరాక, కామెడీ పేలలేదు.

ఈ కథలో హీరో ..ఎమోషన్స్ పండించే జనాలని సప్లై చేసినట్లే...ఇలాంటి సినిమాలను భరించే జనాలను పంపించే స్టార్టప్ లు పెట్టాల్సిన అవసరం ఉంది.

Rating:1.5/5

Rating:1.5/5

loader