MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?

Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?

Drishyam 3 Review: మోహన్‌ లాల్‌, మీనా కలిసి నటించిన `దృశ్యం 3` సినిమా నేడు గురువారం విడుదలైంది. మరి ఈ చిత్రం మొదటి రెండు సినిమాల మాదిరిగా మెప్పించిందా? 

4 Min read
Author : Aithagoni Raju
Published : May 21 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దృశ్యం 3 మూవీ రివ్యూ
Image Credit : Asianet News

దృశ్యం 3 మూవీ రివ్యూ

దృశ్యం సినిమాలకు ఇండియా వైజ్‌గా మంచి క్రేజ్‌ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు పెద్ద హిట్‌ అయ్యాయి. దేశంలోని పలు భాషల్లో రీమేక్‌ అన్ని చోట్ల విజయం సాధించాయి. తెలుగులోనూ వెంకటేష్‌ హీరోగా వచ్చిన విషయం తెలిసిందే. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్‌, మీనా నటిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్‌ వచ్చింది. దీనికి జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించగా, మోహన్‌ లాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నేడు గురువారం(మే 21)న విడుదలైంది. తెలుగులోనూ దీన్ని రిలీజ్‌ చేశారు. మరి ఈ మూవీ గత చిత్రాల మాదిరిగానే మెప్పించిందా? తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దృశ్యం 3 మూవీ కథ
Image Credit : Asianet News

దృశ్యం 3 మూవీ కథ

దృశ్యం సినిమా కథ అందరికి తెలిసిందే. తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడబోయిన కుర్రాడు వరుణ్‌ని జార్జ్ కుట్టి(మోహన్‌ లాల్‌) కూతురు అంజు(అన్సిబా హాసన్‌) కొట్టడంతో అతను చనిపోతాడు. ఈ కేసులో తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నం, ఎత్తులకుపై ఎత్తులే ఈ మూవీ అనేది తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌లో దానికి కొనసాగింపుని చూపించారు. రెండో పార్ట్ లో కేసు క్లోజ్‌ అవుతుంది. కానీ ఆ నీడ, దాని అనుమానాలు, వాటి ప్రభావం జార్జ్ కుట్టీ ఫ్యామిలీని వెంటాడుతూనే ఉంటాయి. తను టెన్షన్‌ పడుతుంటాడు. ఇందులో ఆయన హీరో హరి(బీజూ మీనన్‌)తో సినిమా చేస్తాడు. అది పెద్ద హిట్‌ అవుతుంది. ఆ ఆనందంలో తన పెద్ద కూతురు మ్యారేజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుంటారు. కానీ వరుసగా రిజెక్ట్స్ అవుతుంటారు. ఎవరో వీరి గురించి, కేసు గురించి చెప్పి పెళ్లి సంబంధాలను చెడగొడుతుంటారు. దీని వెనకాల ఎవరున్నారనేది తెలుసుకునే పనిలో ఉంటాడు జార్జ్ కుట్టి. మరోవైపు ఎట్టకేలకు కూతురుకి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఒక ఎన్‌ఆర్‌ఐ సంబంధం ఓకే అవుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇంతలో ఈ కేసుని మళ్లీ ఓపెన్‌ చేస్తారు. కొన్ని ఆధారాలు దొరకడంతో మళ్లీ ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్ చేస్తారు. ఈ సారి ఇందులో ఐజీ ఇన్‌వాల్వ్ అవుతారు. అలాగే చనిపోయిన వరుణ్‌ ఫాదర్‌ ప్రభాకర్‌(సిద్ధిఖీ) కూడా వస్తాడు. తన భార్య మానసిక పరిస్థితి చూడలేక ఎలాగైనా జార్జ్ కుట్టీ ఫ్యామిలీకి శిక్ష పడాలని ప్రయత్నిస్తుంటాడు. పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తారు. మరి అది సాధ్యమైందా? జార్జ్ కుట్టీ ఫ్యామిలీకి శిక్ష పడిందా? జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు ఏం చేశాడు? ఈ కేసులో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Roja Selvamani : రోజా లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏఏ కార్లు, ఎన్ని ఉన్నాయో తెలుసా..?
Related image2
Balakrishna: బాలయ్య జాతకంలో అతి పెద్ద గండం, ఆదివారం ఆయన అస్సలు చేయకూడని పని ఏదో తెలుసా?
36
దృశ్యం 3 మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

దృశ్యం 3 మూవీ విశ్లేషణ

దృశ్యం సినిమా తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు హీరో చేసే పోరాటమే ఈ చిత్రం. తన తెలివితో, ఎత్తులకు పై ఎత్తులు వేయడమే సినిమా. గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా అదే తరహాలో ఎంగేజ్‌ చేసిందా? ట్విస్ట్ లు, టర్న్ లతో సాగిందా? అవి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయా? అంటే ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఒక తరహా కథతో మొదటి రెండు భాగాలు చూడటంతో మూడో పార్ట్ పై మరింత అంచనాలున్నాయి. దాన్ని మించిన ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయని అంతా భావించారు. కానీ ఆ స్థాయిలో `దృశ్యం 2` లేదని చెప్పొచ్చు. సినిమా ప్రారంభం నుంచి చాలా స్లోగా సాగుతుంది. కథ ముందే తెలియడంతో ఇందులో కథనం ఊహించినట్టుగానే ఉంటుంది. దీనికితోడు కథలో ఇంటెన్సిటీ మూడ్‌ని క్రియేట్‌ చేయడానికి దర్శకుడు చాలా టైమ్‌ తీసుకున్నారు. దీంతో స్లోగా సాగుతుంది. బోరింగ్‌గా ఉంటుంది. మధ్య మధ్యలో థ్రిల్‌ ఎలిమెంట్లు ఒకటి రెండు యాడ్‌ చేశారు. కానీ అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. మొదటి భాగం వరకు టైమ్‌ పాస్‌లాగానే తీసుకెళ్లారు. ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌ అంశాలు కనిపించవు. కాకపోతే ఆ కేసుకి సంబంధించిన చర్చ మాత్రం నడుస్తూనే ఉంది. దాన్ని కవర్‌ చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఇక ఇంటర్వెల్‌ ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేస్తుంది. సెకండాఫ్‌లో వేగం పెరిగింది. పెళ్లి ఆగిపోతుందా? లేదా అనే ఉత్కంఠ ఆకట్టుకుంది. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్ కావడంతో కథనం పలు మలుపులు తీసుకుంటుంది. కొత్త ట్విస్ట్ లు యాడ్‌ అవుతుంటాయి. అయితే అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. ఊహించినట్టుగానే అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలో అవి కామనే అని ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ వాహ్‌ ఫ్యాక్టర్స్ మాత్రం లేవు. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగుంది. పోలీసులకు, హంతకుడి తండ్రికి హీరో ఇచ్చే ట్విస్ట్, షాక్‌ మాత్రం అదిరిపోతుంది. ఈ కేసుకి ముగింపు పలికేలా ఈ మూవీ ముగింపు ఇచ్చారు. కానీ హంతకుడి తల్లి ద్వారా సీక్వెల్‌కి హింట్‌ ఇచ్చారు. అదే ఇందులో ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్టర్‌. సినిమా స్లోగా సాగడంతో ఎంగేజ్‌ చేసే అంశాలు మిస్‌ అయ్యాయి. చాలా వరకు డ్రై ఫీలింగ్‌ తెప్పిస్తుంది. సినిమాలో క్లైమాక్స్ మినహా ఏదీ ఆకట్టుకోలేకపోయింది. గత రెండు చిత్రాలతో పోల్చితే ఇది తేలిపోయిందని చెప్పొచ్చు.

46
దృశ్యం 3 మూవీలో ఆర్టిస్ట్ ల నటన
Image Credit : Asianet News

దృశ్యం 3 మూవీలో ఆర్టిస్ట్ ల నటన

జార్జ్ కుట్టీ పాత్రలో మోహన్‌ లాల్‌ మరోసారి అదరగొట్టారు. తన నటనతోనే మాయ చేశారు. నిజానికి కథ, కథనంలో విషయం లేదు, కానీ మోహన్‌ లాల్‌ నటన ఆకట్టుకుంటుంది. ఆయన భార్య రాణి పాత్రలో మీనా ఎప్పటిలాగే చేసుకుంటూ వెళ్లింది. మెప్పించింది. మధ్య మధ్యలో నవ్వించే ప్రయత్నం చేసింది. అంజు పాత్రలో అన్సిబా హస్సన్‌ సెటిల్డ్ గా బాగా చేసింది. చిన్నమ్మాయిగా ఎస్తేర్‌ అనిల్‌ ఆకట్టుకుంది. అలరించింది. వరుణ్‌ తండ్రి ప్రభాకర్‌ పాత్రలో సిద్ధిఖీ మెప్పించారు. ఆయన పాత్ర ఎంట్రీతో కథ సరికొత్త మలుపులు తీసుకుంటుంది. జర్నలిస్ట్ గా వీణా నందకుమారి పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే మిగిలిన పాత్రధారులు ఆయా పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

56
దృశ్యం 3 మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

దృశ్యం 3 మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

ఈ మూవీ టెక్నీకల్‌గా బాగుంది. విజువల్‌గా కనువిందు చేస్తుంది. అలాగే ఆర్‌ఆర్‌ ఆకట్టుకుంది. వీఎస్‌ వినాయక్‌ ఎడిటింగ్‌ స్పీడ్‌ పెంచాల్సింది. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఎంగేజ్‌ చేయడంలో విఫలమయ్యారు. ట్విస్ట్ లను సరిగా రాసుకోలేకపోయారు. మన ఆడియెన్స్ కి పెద్దగా థ్రిల్‌ ఇవ్వలేకపోయాయి. కథ లేకపోవడంతో టైమ్‌ పాస్‌ ఎలిమెంట్లకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది సినిమాని బోరింగ్‌గా మార్చింది. దీనికితోడు డబ్బింగ్‌ పెద్ద మైనస్‌.

66
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

 స్లోగా, బోరింగ్‌గా సాగే దృశ్యం 3. మధ్య మధ్యలో చిన్న మెరుపులు, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. గత రెండు సినిమాలతో పోల్చితే డిజప్పాయింట్‌ చేస్తుంది.

రేటింగ్‌: 2.5

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image2
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Recommended image3
The Red Bag Movie Review: ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ, మహిళా నేపథ్యంలో సాగే క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Roja Selvamani : రోజా లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏఏ కార్లు, ఎన్ని ఉన్నాయో తెలుసా..?
Recommended image2
Balakrishna: బాలయ్య జాతకంలో అతి పెద్ద గండం, ఆదివారం ఆయన అస్సలు చేయకూడని పని ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved