MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • `డియర్‌ ఉమ` మూవీ రివ్యూ

`డియర్‌ ఉమ` మూవీ రివ్యూ

Dear Uma Movie Review:  గతంలో సమ్మర్‌లో పెద్ద సినిమాల హడావుడి ఉండేది. కానీ గత రెండుమూడేళ్లుగా పెద్ద సినిమాలు రావడం లేదు. మీడియం రేంజ్‌ మూవీస్‌, తక్కువ బడ్జెట్‌ చిత్రాలే సందడి చేస్తున్నాయి. అందులో కూడా కొన్ని చిత్రాలు మాత్రమే ఆడుతున్నాయి. ఈ వారంలో రెండు మీడియం రేంజ్‌ మూవీస్‌ `ఓడెల 2`, `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీస్‌తోపాటు చిన్న మూవీ `డియర్‌ ఉమ` వచ్చింది. ఇందులో కొత్త వాళ్లు నటించడం, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 18 2025, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
dear uma movie review

dear uma movie review

Dear Uma Movie Review: పృథ్వీ అంబర్‌, సుమయ రెడ్డి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `డియర్‌ ఉమ`. సాయి రాజేష్‌ మహాదేవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సుమయ రెడ్డి నిర్మాత. ఆమె ఈ చిత్రానికి కథ అందిస్తూ నిర్మించడం విశేషం. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం(ఏప్రిల్‌ 18)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
dear uma movie review

dear uma movie review

కథః 
ఉమ(సుమయ రెడ్డి) పట్లెటూరిలో పెరిిగిన అమ్మాయి. డాక్టర్‌ కావాలని కలలు కంటుంది. కష్టపడి చదివి ఎంబీబీఎస్‌ లో సీటు సంపాదిస్తుంది. తన డాక్టర్‌ స్టడీ పూర్తి చేసి సొంతంగా ఆసుపత్రి నిర్మించి తన తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. ఆ పనిలోఆమె బిజీగా ఉంటుంది. మరోవైపు దేవ్‌(పృథ్వీ అంబర్‌)కి మ్యూజిక్‌ అంటే ఇష్టం. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదగాలనుకుంటాడు. మ్యూజిక్‌పై ఇష్టంతో చదువుల్లో వెనకబడతాడు.

అదే సమయంలో కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మ్యూజిక్‌ వల్లే ఆమె దేవ్‌కి బ్రేకప్‌ చెబుతుంది. దీంతో హార్ట్ బ్రేక్‌ అవుతుంది. బాగా డ్రింక్‌ తీసుకుని ఇంటికెళ్లగా, తండ్రి ఇంటి నుంచి గెంటేస్తాడు. దీంతో మళ్లీ తాను రాక్‌ స్టార్‌ కావాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ అన్ని రకాలుగా ఫెయిల్‌ అవుతాడు. ఫ్రెండ్‌ ఆర్ట్ గ్యాలరీలో పార్ట్ టైమ్‌ జాబ్‌ చేస్తుంటాడు. అక్కడ ఓ డైరీ ద్వారా ఉమా.. దేవ్‌ జీవితంలోకి వస్తుంది.

దీంతో ఉమతోనే ప్రేమలో పడతాడు. ఉమకి తన ప్రేమని వ్యక్తం చేయాలని భావిస్తాడు. కానీ అంతలోనే ఆమె జీవితంలోని షాకింగ్‌ విషయం తెలుస్తుంది. మరి ఆ షాకింగ్‌ విషయం ఏంటి? మెడికల్‌ మాఫియాపై ఉమ చేసిన పోరాటం ఏంటి? ఆమె పోరాటానికి దేవ్‌ ఎలా సపోర్ట్ గా నిలిచాడు?చివరికి ఏమైందనేది మిగిలిన కథ. 

36
dear uma movie review

dear uma movie review

విశ్లేషణః 
మెడికల్‌ మాఫియాపై థ్రిల్లర్‌గా తెరకెక్కించిన చిత్రం `డియర్‌ ఉమ`. కరోనా సమయంలో చాలా ప్రైవేట్‌ ఆసుపత్రులు అమాయక జనాలను ఎలా దోచుకున్నారనేది ఇందులో చూపించారు. వాస్తవాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. `ఠాగూర్‌` సినిమాని తలపించేలా కథనాన్ని రాసుకోవడం విశేషం. కథ పరంగా సుమయ రెడ్డి చెప్పాలనుకున్న సందేశం బాగుంది. నేటి ట్రెండీగా దాన్ని మలిచిన తీర బాగుంది.

దీనికి సంబంధించిన సందేశం సినిమాకి పెద్ద అసెట్‌. ఇక ఫస్టాఫ్‌ లో హీరోహీరోయిన్ల కథలను వెర్వేరుగా చూపించి, వాళ్లిద్దరు ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నాయి. ఉత్కంఠ భరితంగా, ఎమోషనల్‌గా ఉన్నాయి.  హీరో లవ్‌ బ్రేకప్‌ సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడం కూడా ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. మరోవైపు దేవ్‌, ఉమల లవ్‌ ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొత్తగా అనిపిస్తుంది. విభిన్న నేపథ్యాలకు చెందిన హీరో హీరోయిన్‌ ఒక్కటి కావడం అనేది ఇంటర్వెల్‌లో హైలైట్‌గా నిలిచింది. 
 

46
dear uma movie review

dear uma movie review

సినిమా సెకండాఫ్‌ థ్రిల్లర్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. ఉమ మిస్సింగ్కి సంబంధించిన కేసు ఆద్యంతం ఉక్కంఠభరితంగా సాగుతుంది. హీరో రంగంలోకి దిగడం, తన ప్రియుయురాలి కోసం ఆయన అన్వేషణ కొనసాగించడంతో కథ సీరియస్‌గా, ఉత్కంఠభరితంగా మారుతుంది. ఉమకి సంబంధించి హీరో కలవాలనుకున్న వ్యక్తులంతా మర్డర్‌ కావడం షాకిస్తుంటుంది. 

ఇక అసలు విలన్‌ ఎవరు అనేది రివీల్‌ అయ్యే ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ సినిమాకి బలం. అయితే డ్రామా విషయంలో ఇంకాస్త డెప్త్ ఉంటే బాగుండేది. ఎమోషనల్‌ సీన్ల డోస్‌ తగ్గింది. చాలా సీన్లు ఎమోషన్‌గా కనెక్ట్ కావడం కష్టం. అదే సమయంలో మెడికల్‌ మాఫియా సీన్లు కూడా ఇంకా బాగా చూపించాల్సింది. ఓవరాల్ గా మంచి సందేశం అందించే చిత్రమవుతుందని చెప్పొచ్చు. 
 

56
dear uma movie review

dear uma movie review

నటీనటులుః 
ఉమగా సుమయ రెడ్డి బాగా చేసింది. ఓ వైపు కథ అందిస్తూ, నిర్మిస్తూ, మెయిన్‌ లీడ్‌గా నటించడం విశేషం. ఆమె అదరగొట్టింది. మల్టీటాలెంటెడ్‌గా మెప్పించింది. మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించింది. ఇక దేవ్‌ పాత్రలో పృథ్వీ అంబర్‌ కూడా బాగా చేశాడు. యాక్షన్‌తోపాటు ఎమోషనల్‌ సీన్స్ కూడా బాగా చేశాడు. అజయ్‌ ఘోష్‌ తనదైన నటనతో మెప్పించాడు. కమల్‌ కామరాజు పాత్రసర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పాత్రలు నవ్వులు పూయిస్తాయి. 
 

66
dear uma movie review

dear uma movie review

టెక్నీకల్‌గాః 
టెక్నీకల్‌గా మూవీ బాగుంది. రాజ్‌ తోట కెమెరా వర్క్ సహజంగా ఉంది. ఫ్రేమ్స్ కూడా బాగున్నాయి. రథన్ మ్యూజిక్‌  సినిమాకి మరో అసెట్‌గా నిలిచింది. కథకి తగ్గట్టుగా బీజీఎం, పాటలు బాగా కుదిరాయి. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు సాయి రాజేష్‌ మహా దేవ్ మూవీగా చాలా బాగా తెరకెక్కించాడు. సుమయ రెడ్డి కథని అంతేబాగా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే అన్ని ఎమోషన్స్ డోస్‌ కాస్త తగ్గింది. వాటిపై ఫోకస్ పెడితే సినిమా ఇంకా అదిరిపోయేది. 

ఫైనల్‌గా ః మెడికల్‌ మాఫియాపై మంచి సందేశాత్మక మూవీ. 
రేటింగ్‌ః 2.75
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329 & 387
AUSAUS
(41.1 ov) 429 & 67/8
Day 5 - Session 2
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Recommended image3
Killer Movie Review: కిల్లర్‌ మూవీ రివ్యూ.. సైఫై థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved