MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • సమంత స్పై థ్రిల్లర్‌ : 'సిటడెల్‌: హనీ బన్నీ' రివ్యూ

సమంత స్పై థ్రిల్లర్‌ : 'సిటడెల్‌: హనీ బన్నీ' రివ్యూ

ఎఫ్‌బీఐ, ఎంఐ6, బీఎన్‌డీ, ఎఫ్‌ఎస్‌బీ, రా, ఐఎస్‌ఐలాగే సిటాడెల్‌ అనేది ఒక ఫిక్షనల్  స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ఫ్రాన్స్‌లో దీనిని స్థాపిస్తారు. 

4 Min read
Surya Prakash
Published : Nov 09 2024, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Citadel: Honey Bunny, Samantha, Spy Thriller

Citadel: Honey Bunny, Samantha, Spy Thriller


 స్టార్ హీరోయిన్ సమంత వరస పెట్టి వెబ్ సీరిస్ లు చేస్తున్నారు. రీసెంట్​గా 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్​సిరీస్​తో ప్రేక్షకులను పలకరించారు.

ప్రస్తుతం ఈ సిరీస్​ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.   మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం ఓ నటిగా తన బాధ్యత అని సమంత చెప్తున్న ఈ సీరిస్ ఎలా ఉంది. చూడదగ్గ సీరిస్ యేనా, అసలు కథేంటి విశేషాలు చూద్దాం. 

210
Citadel: Honey Bunny, Samantha, Spy Thriller

Citadel: Honey Bunny, Samantha, Spy Thriller

స్టోరీ లైన్ 

ముంబైలో హిందీ సినిమాల్లో మంచి నటి అవ్వాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తూంటుంది హనీ (సమంత). ఆ క్రమంలో  ఆమెకు స్టంట్ మాస్టర్ బన్నీ (వరుణ్ ధావన్) తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే బన్నీ తనని పెంచి పెద్ద చేసిన బాబా (కే కే మీనన్) నేతృత్వంలోని ప్రైవేట్ సీక్రెట్ ఏజెన్సీకి సీక్రెట్ స్పై గా  పనిచేస్తూంటాడు.  

ఆ విషయం ఎవరకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూంటాడు. ఓ ఆపరేషన్  లో హనీ సాయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఆమె తనకు కూడా ఏజెంట్ గా ట్రైనింగ్ ఇవ్వమని కోరడంతో, అయిష్టంగానే బాబా ఆమెను తన టీంలో తీసుకుంటాడు. కఠినమైన ట్రైనింగ్ తర్వాత ఆమె వారితో కలిసి మిషన్లలో పాల్గొంటుంది. ఇదీ హనీ ప్లాష్ బ్యాక్. 

310
Citadel: Honey Bunny, Samantha, Spy Thriller

Citadel: Honey Bunny, Samantha, Spy Thriller


ఇప్పుడు ఓపెన్ చేసే సరికి... నైనిటాల్  లో ఓ కెఫేలో పనిచేసే  హనీ (సమంత) చాలా కు నాడియా (కశ్వీ మజ్ముందార్‌) ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన హనీని ఓ వ్యక్తి వెంబడిస్తాడు.

అది గమనించి అతని  నుంచి తప్పించుకుందామనుకుంటుంది. కానీ ఈ  క్రమంలో హనీ పట్టుబడుతుంది. అయినా కష్టపడి వారినుంచి  తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్తుంది.  అయితే హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొందరు వ్యక్తులు అక్కడికి కూడా వస్తారు. 

410
Citadel: Honey Bunny, Samantha, Spy Thriller

Citadel: Honey Bunny, Samantha, Spy Thriller


ఇదిలా ఉంటే  చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం ఎక్కడో  విదేశాల్లో ఉన్న బన్నీ (వరుణ్‌ ధావన్‌)కి తెలుస్తుంది. దీంతో హనీని వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. పాపను ఎత్తుకుపోవటానికి ట్రై చేస్తారు. ఇంతకీ హనీ వెంట పడుతున్న వాళ్లు ఎవరు?  

తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీ, తన భార్యని కలవగలిగారా. ? చివరకు హనీ , ఆమె కూతురు నాడియా ఏమయ్యారు?  అలాగే ప్రైవేటు సీక్రెట్‌ ఏజెన్సీ హెడ్  గురు (కేకే మేనన్‌) వెతుకుతున్న అర్మార్డ్‌ అనే వస్తువు సంగతి ఏమిటి? చివరకు ఏమైంది? వంటి వివరాలు  తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!
 

510
Citadel: Honey Bunny, Samantha, Spy Thriller

Citadel: Honey Bunny, Samantha, Spy Thriller


ఎలా ఉంది


ఈ సీరిస్ రెండు వేర్వేరు కాలాలను ఒకేసారి చూపెడుతూ సాగుతుంది. ఒకటి 1992లో మరొకటి 2000 సంవత్సరంలో జరుగుతున్నట్లు చూపిస్తూ నాన్‌-లీనియర్‌ స్క్రీన్‌ప్లేతో కథను నడిపించారు.    

ఈ వెబ్​సిరీస్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్‌ సిరీస్‌'సిటడెల్‌'కు ఇది ఇండియన్‌ వెర్షన్‌. ఇందులో సమంతతోపాటు బాలీవుడ్​ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్​సిరీస్​లో సమంత నటనకుగాను ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే కథ మాత్రం అంత స్ట్రాంగ్ గా లేదనిపిస్తుంది. 

610


ఈ సీరిస్ కు పెద్ద ఇబ్బంది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే. ప్రస్తుతం జరిగే కథ, అందులోని పాత్రలకు ఉన్న ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటనేది  పూర్తిగా అర్దమయ్యే దాకా మనకు  గందరగోళంగానే అనిపిస్తుంది.   మొదట్లోనే కథలోకి వచ్చినట్లు అనిపించినా మొదటి రెండు ఎపిసోడ్‌లలో సిరీస్‌లోని కీలక పాత్రలు,

వారి నేపథ్యాలు  పరిచయం చేయటం కోసం మొత్తం స్క్రీన్  టైమ్ తీసుకున్నారు. దాంతో అక్కడేమీ జరిగినట్లు అనిపించదు. మూడో ఎపిసోడ్ దాకా కథలోకి వెళ్లలేదు.  కొన్ని సీన్స్ లో ఎమోషన్ ప్రధానమైనా టోటల్ గా యాక్షన్ డామినేట్ చేసింది. స్క్రిప్టు ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. ఏ పాత్రకీ మనని పూర్తిగా కనెక్ట్ కానివ్వరు డైరక్టర్స్. 
 

710


ఇంతకీ  సిటాడెల్‌ అంటే ఏమిటి

ఎఫ్‌బీఐ, ఎంఐ6, బీఎన్‌డీ, ఎఫ్‌ఎస్‌బీ, రా, ఐఎస్‌ఐలాగే సిటాడెల్‌ అనేది ఒక ఫిక్షనల్  స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ఫ్రాన్స్‌లో దీనిని స్థాపిస్తారు. ఒక్క దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి సంరక్షణ బాధ్యత ప్రధాన లక్ష్యంగా ఈ ఏజన్సీ పనిచేస్తుంది.

‘సిటాడెల్‌’ను ఎలాగైనా నాశనం చేసి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కొందరు ధనిక బృందాలు కలిసి ‘మాంటికోర్‌’ అనే సొంత స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు. సిటడెల్‌లో టాప్‌ స్పై ఏజెంట్లులను తప్పుదోవ పట్టించి వాళ్లను అంతం చేసేందుకు మాంటికోర్‌ ప్రయత్నిస్తుంది. మరి ఆ దాడి నుంచి హనీ. బన్నీ ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? సిటాడెల్‌ను పునరుద్థరించి, మాంటికోర్‌ను అడ్డుకునేందుకు వీళ్లు చేసిన ప్రయత్నం ఏంటి? అన్నది కథ.
 

810


డైరక్టర్స్ ద్వయం  రాజ్‌ అండ్‌ డీకే గతంలో ‘ఫ్యామిలీమ్యాన్‌’, ‘ఫర్జీ’ వంటి సక్సెస్ ఫుల్ సిరీస్‌లు అందించారు. దాంతో ఈ సీరిస్ పై అందరి దృష్టీ పడింది. కానీ వాటితో పోలిస్తే ఈ సీరిస్ తేలిపోయిందనే చెప్పాలి.

  వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), సమంత (Samantha) కీలక పాత్రల్లో నటించటం చాలా వరకూ కలసి వచ్చింది.  అయితే ఇలాంటి సీరిస్ లకు, సినిమాలకు ట్విస్ట్ లు ప్రధానం. అవి ఎలా పే ఆఫ్ అయ్యాయి అనేదానిపై సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మాగ్జిమం డైరక్టర్స్  రాజ్, డీకే లు జాగ్రత్తపడ్డారు.  అయితే కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. . ప్రతి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా విభజించటం కాస్త కన్ఫూజన్ కు గురి చేస్తుంది. 
 

910


సమంత ఎలా చేసిందంటే..

సిటడెల్ : హనీ బన్నీ'లో నటించడం సమంతకు  ఓ సవాలే. అందులో ఆమెది  హీరోకు సమానమైన పాత్ర. యాక్షన్‌ సీన్స్​లో కూడా హీరోతో సమానంగా చేశారు. ఇక  వరుణ్ ధావన్ కండలు చూపెట్టే పోగ్రామ్ పెట్టుుకున్నారు. అలాగే హనీ కూతురుగా చేసిన నదియా (కశ్వీ మజుందార్)ని చాలా సహజంగా నటించింది.

మరీ ముఖ్యంగా బాబా ఏజెంట్ టీమ్ నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె చేసే స్టంట్స్ ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.   కేకే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీమ్, సిమ్రాన్, శివాంకిత్ పరిహార్, సోహమ్ మజుందార్ వంటివారు పాత్రల పరిధి మేరకు నటించారు. సిమ్రాన్ చాలా రోజుల తర్వాత కనిపించింది.
 

1010
Samantha Ruth Prabhu remuneration for Citadel Honey Bunny series on amazon prime video

Samantha Ruth Prabhu remuneration for Citadel Honey Bunny series on amazon prime video


చూడచ్చా

 సమంత అభిమానులకు బాగా నచ్చుతుంది.   అలాగే యాక్షన్ సీరిస్ లు, స్పై సీరిస్ లు  చూసేవాళ్లకు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. 

ఎక్కడుంది

అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది, ఆరు ఎపిసోడ్స్ ,ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు 50 నిముషాలు ఉంది.
 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved