MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • అవసరాల ‘101 జిల్లాల అందగాడు’ రివ్యూ

అవసరాల ‘101 జిల్లాల అందగాడు’ రివ్యూ

ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’సినిమాలతో ఫీల్‌ గుడ్‌ సినిమాల దర్శకుడు అవసరాల శ్రీనివాస్ . ఆయన తాజాగా ఆయన రచయితగా, హీరోగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బట్టతల వల్ల ఒక యువకుడు ప్రేమ, పెళ్లి  విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.

3 Min read
Surya Prakash | Asianet News
Published : Sep 03 2021, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
101 Jillala Andagadu

101 Jillala Andagadu

'ఊహలు గుసగుసలాడే’ ,‘జో అచ్యుతానంద’ ఈ రెండు అవసరాల శ్రీనివాస్ రచననుంచి వచ్చిన సినిమాలు. ఆ సినిమాలు చూసిన వారికి..అవసరాలపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది.అవసరాల శ్రీనివాస్ నటించిన లేదా రచించిన లేదా డైరక్షన్ చేసిన సినిమా అంటే ఖచ్చితంగా అందులో మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ ఉంటుంది. కావాల్సిన ఫన్ ఉంటుంది...ఇదీ సగటు ప్రేక్షకుడు నిశ్చితాభిప్రాయం. ఆయన రచించి, నటించిన చిత్రం ఇది. అందులోనూ ఫన్నీ కాన్సెప్టు  అవసరమైన మ్యాటర్ ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాం. ఆ ఎక్సపెక్టేషన్స్ ని అవసరాల అందుకున్నారా..అసలు ఈ చిత్రం కథేంటి,బట్టతల బాబుగా అవసరాల ఏ మేరకు మెప్పించాడో చూద్దాం.

211
101 Jillala Andagadu

101 Jillala Andagadu

బేసిక్ ప్లాట్
గొత్తి సూర్యనారాయణ (అవసరాల శ్రీనివాస్) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తూంటాడు. తన కోలిగ్ అంజలి(రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అంతా సవ్యంగా నడుస్తోంది..సూర్య నారాయణ జీవితం నెక్ట్స్ లెవిల్ కు వెళ్ళబోతోంది అనుకున్న సమయంలో  సూర్యనారాయణ గురించిన ఓ తట్టుకోలేని నిజం బయిటపడుతుంది.నిలదీస్తుంది. బ్రేకప్ కు వెళ్లిపోతుంది.

311
101 Jillala Andagadu

101 Jillala Andagadu

 ఏదైతే తాను ఇన్నాళ్లు మ్యానేజ్ చేస్తూ వచ్చాడో ఆ నిజం బయిటపడటంతో  సూర్యనారాయణ తట్టుకోలేకపోతాడు. ఇంతకీ ఆ నిజం ఏమిటి అంటే అతనకి ఉన్నది నిజమైన జుట్టు కాదు. సూర్యనారాయణది బట్టతల. విగ్ తో ఇన్నాళ్లూ మ్యానేజ్ చేసాడు. ఇప్పుడు ఆ విగ్ సీక్రెట్ తెలిసిపోయి విడిపోయిన ఆ జంట మళ్లీ ఒక్కటి ఎలా అయ్యారు. అసలు విగ్ ఎందుకు పెట్టుకున్నాడు  సూర్యనారాయణ అనే విషయాలు తెరపై సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

411
101 Jillala Andagadu

101 Jillala Andagadu


  కథ,కథన విశ్లేషణ

కొత్త కాన్సెప్టులతో ఖచ్చితంగా సినిమాలు రావాలి. అయితే ఆ కాన్సెప్టు ఎక్కడో విన్నట్లు లేదా చూసినట్లు అనిపించకూడదు. అవసరాల తాజా చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్ చూడగానే మనకు  బాలీవుడ్ హిట్ మూవీ ‘బాల’గుర్తు వచ్చేయటం మన తప్పు కాదు..మన జ్ఞాపకశక్తికి నిదర్శనమూ కాదు. ఆ హిందీ సినిమా అందరికు గుర్తుండిపోయే కాన్సెప్టుతో రెడీ అవ్వటమే అందుకు కారణం. అయితే మరి ఈ సినిమాకు ..సదరు హిందీ చిత్ర రాజానికి పోలిక ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. అయితే ఆ సినిమా ఈ సినిమా ఒకటి కాదు..కానీ ఒకటే. సోల్ ఐడియాని తీసుకుని అల్లుకున్న కథ అనిపిస్తుంది.. తెలుగులో కొన్ని కొత్త సీన్స్ ఉన్నాయి. 

511
101 Jillala Andagadu

101 Jillala Andagadu

అలాగే మరీ హిందీ సినిమా గుర్తు రాకూడదని పడ్డ జాగ్రత్తలు కనిపిస్తాయి. ఆ ప్రాసెస్ లో సినిమా డల్ అయ్యిపోయిన వైనం, పండాల్సిన కొన్ని కామెడీ సీన్స్ లు మిస్ ఫైర్ అవటమూ అర్దమవుతుంది. అలాగే ఇలాంటి స్టోరీలైన్ కు ఎవరు స్క్రీన్ ప్లే రాసినా ట్రీట్మెంట్ చేసినా దాదాపు ఒకే రకమైన సీన్స్ వస్తాయి. వాటిని తప్పించటం అంటే సహజంగా వచ్చే సన్నివేశాలను వద్దనుకోవటమే. అందుకేమో ఈ సినిమా చూస్తే ఇంకా చేయచ్చు కదా మధ్యలో వదిలేసారేంటి అనిపిస్తుంది. వదులుగా లూజు ముడి వేసినట్లు అనిపిస్తుంది కాంప్లిక్ట్. ఎలాగో హీరో,హీరోయిన్స్ కలవకపోరు..అందుకు బట్టతలా..కట్టుకున్న బట్టలు అడ్డం రావు అని అరకొరగా సినిమాలు చూసే ప్రేక్షకుడుకి కూడా స్పష్టంగా తెలుసు. 

611
101 Jillala Andagadu

101 Jillala Andagadu


మరి అలాంటప్పుడే కదా...మన సత్తా చూపించాలి. అదే ఇక్కడ మిస్సైందనిపిస్తుంది. స్క్రిప్టులో పండాల్సిన ఎమోషన్, ఫన్ లేవు. చాలా ప్లాట్ గా కథ,కథనం నడిచాయి. అలాగే తెలిసిన కథని కొత్తగా చెప్పాలంటారు. కానీ ఇక్కడ చాలా ప్రెడిక్టబుల్ గా చెప్పాలి. జోక్ లు అక్కడక్కడా పండాయి. ఇంటర్వెల్ కు ముందు ఏదో జరుగుతోంది అనిపించింది. కానీ సెకండాఫ్ లో ఏమీ జరగలేదు. 

711
101 Jillala Andagadu

101 Jillala Andagadu


కామెడీకు మరీ ఇంత క్యాజువల్ ఎప్రోచ్ పనికిరాదేమో అని డౌట్ వచ్చేలా చాలా సీన్స్ ఉన్నాయి. ఏదైమైనా కాంప్లిక్ట్ లో బలం లేనప్పుడు ఎంత మంచి డైలాగులు రాసుకున్ననా, ఎన్ని కొత్త సీన్స్ కలవరించినా ఫలితం పేడతక్కడే.  ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ గా  ఉంది. సెకండాఫ్  ఎమోషనల్ టర్న్ తీసుకున్నారు. క్లైమాక్స్ లో మనం ముందు మనకు నచ్చాలి.. ఎదుటివాడికి కాదు అని చెప్పే ప్రయత్నం చేసారు. అది బాగుంది.

811
101 Jillala Andagadu

101 Jillala Andagadu

టెక్నికల్ గా..

ఇలాంటి సినిమాలకు ప్లస్ గా నిలవాల్సింది డైలాగ్స్. అవి ఈ సినిమాలో చాలా బాగున్నాయి. సంగీతం జస్ట్ ఓకే అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ అద్బుతం అని చెప్పలేం కానీ బాగుంది. ఎడిటర్ కాస్త ల్యాగ్ లు తీసేసి స్పీడు పెంచితే బాగుండేది. మరింత స్పీడుగా కథ పరుగెత్తాలి. అవసరాల ట్రేడ్ మార్క్ కనపడింది కానీ గత చిత్రాల స్దాయిలో అయితే లేదు. సీన్స్ పండినట్లుగా సినిమా పండలేదు.
 

911
101 Jillala Andagadu

101 Jillala Andagadu

నటీనటుల్లో ..

అవసరాల అదరకొట్టాడు.ఇవ్వటానికి బట్టతల తప్ప ఏమి లేనపుడు ఎందుకు కన్నట్టమ్మ’ అంటూ గొత్తి సూర్యనారాయణ పాత్రలో అవసరాల శ్రీనివాస్ చెప్పిన డైలాగ్.. బట్ట తల వల్ల బాధపడే వారి బాధలను కళ్లకు కట్టినట్లు అనిపిస్తుంది. రుహాని శర్మ అర్బన్ అమ్మాయి పాత్రలో  కనిపించింది. గుర్తుండిపోదు కానీ అలా నడిచిపోయింది. రోహిణి, రమణ భరద్వాజ్ వంటి కొన్ని పాత్ర‌లు ప‌ర్వాలేద‌నిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

1011
101 Jillala Andagadu

101 Jillala Andagadu


ఫైనల్ థాట్
బట్టతల మనుష్యులకే కాదు ..ఒక్కోసారి స్క్రిప్టుకు కూడా వచ్చేస్తుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:  2.5/5 

1111
101 Jillala Andagadu

101 Jillala Andagadu

నటీనటులు : అవసరాల శ్రీనివాస్‌, రుహానీ శర్మ, రోహిని, రాకెట్‌ రాఘవ తదితరులు
నిర్మాతలు :   శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కథ: అవసరాల శ్రీనివాస్‌
దర్శకత్వం : రాచకొండ విద్యాసాగర్
సంగీతం :  శక్తికాంత్ కార్తీక్ 
విడుదల తేది : సెప్టెంబర్‌ 3, 2021

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..
Recommended image2
ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
Recommended image3
3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved