- Home
- Entertainment
- Movie Reviews
- ఆ సినిమా చేసినందుకు ఏడాదిపాటు ఏడ్చిన అనుష్క శెట్టి..అంతకంటే దారుణమైన మూవీ ఉంది కానీ
ఆ సినిమా చేసినందుకు ఏడాదిపాటు ఏడ్చిన అనుష్క శెట్టి..అంతకంటే దారుణమైన మూవీ ఉంది కానీ
అనుష్క శెట్టి తన కెరీర్ లో చేసిన ఓ మూవీ వల్ల ఏడాది పాటు ఏడ్చిందట. కానీ ఆ చిత్రమే అనుష్క జాతకాన్ని మార్చేసింది. టాలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ గా ఎదిగేందుకు కారణం అయింది.

అనుష్క శెట్టి ఫస్ట్ మూవీ 'సూపర్'
హీరోయిన్లు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నిలదొక్కుకోవడం చాలా కష్టం. తొలి సినిమా కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. నటన, గ్లామర్ విషయంలో మెప్పించాలి. ఆడియన్స్ లో గుర్తింపు పొందాలి. అప్పుడు తదుపరి చిత్రాల్లో అవకాశాలు ఉంటాయి. అనుష్క శెట్టి టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అయినప్పటికీ ఆమెకి తొలి చిత్రం పీడకలలా మిగిలిందట.
యోగా టీచర్ గా పనిచేస్తున్నప్పుడు..
అనుష్క శెట్టి అక్కినేని నాగార్జున సరసన సూపర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సూపర్ మూవీ బ్యాడ్ మూవీ ఏమీ కాదు. అనుష్కకి కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఆ మూవీ లో నటించడం వల్ల అనుష్క ఏడాది పాటు ఏడ్చిందట. అనుష్క యోగా టీచర్ గా పనిచేస్తున్నప్పుడు పూరి జగన్నాధ్ గారు చూశారు. సినిమా ఆడిషన్స్ కి రావాలని అడిగారు. నేను యోగా క్లాస్ ఉందని తప్పుంచుకున్నాను. శుక్రవారం వస్తానని చెప్పారు. ఆయన గురువారమే మరోసారి గుర్తు చేస్తూ ఫోన్ చేశారు.
నాగార్జున నాకు స్పెషల్
దీనితో ఆడిషన్స్ కి వెళ్ళాను. ఆల్రెడీ మరో అమ్మాయికి ఆడిషన్స్ చేస్తూ ఫోటో షూట్ చేస్తున్నారు. ఆమె గ్లామరస్ గా ఫోజులు ఇస్తుండడం చూసి నేను కూడా అలాగే చేయాలేమో అని ఏడ్చేశాను. అసలు ఫోటో షూట్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ నాగార్జున గారు.. ఈ అమ్మాయికి ఏమీ తెలియదు కానీ పొటెన్షియల్ ఉంది అని నమ్మారు. దీనితో సూపర్ మూవీలో నాకు అవకాశం ఇచ్చారు. అందుకే నాకు నాగార్జున గారు అంటే ఎంతో స్పెషల్.
సూపర్ మూవీ వాళ్ళ ఏడాది పాటు ఏడ్చా
అయితే సూపర్ మూవీలో నటించడం వల్ల ఏడాది పాటు ఏడ్చాను. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని అనుకున్నాను. మాది చాలా సాంప్రదాయబద్దమైన కుటుంబం. సూపర్ మూవీలో చాలా మోడ్రన్ గా కనిపించాలి. గ్లామరస్ గా పొట్టి బట్టలు వేసుకోవాలి. అలాంటివి నాకు అస్సలు అలవాటు లేదు. తెలియని వ్యక్తులతో అంత క్లోజ్ గా మూవ్ అవ్వడం కూడా తెలియదు అని అనుష్క తెలిపింది.
చేయకుండా ఉండాల్సిన చిత్రం అదే
ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల అలా పొట్టి బట్టలు వేసుకోవడం భరించలేకపోయా. అందుకే ఏడాది పాటు ఏడుస్తూనే ఉన్నా అని అనుష్క శెట్టి తెలిపింది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీ తనకు అలవాటైపోయింది అని అనుష్క పేర్కొంది. అలవాటు లేకపోవడం వల్లే సూపర్ మూవీలో నటిస్తున్నప్పుడు ఏడ్చినట్లు అనుష్క పేర్కొంది. అయితే తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన సినిమా గురించి చెబుతూ ఒక్క మగాడు మూవీ అని అనుష్క తెలిపింది.