MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Beauty Tips: ఇలా చేస్తే.. 40 ఏండ్ల వారు కూడా 20 ఏండ్ల వారిలా కనిపిస్తారు..

Beauty Tips: ఇలా చేస్తే.. 40 ఏండ్ల వారు కూడా 20 ఏండ్ల వారిలా కనిపిస్తారు..

Beauty Tips: కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే 40 సంవత్సరాల వయస్సులో కూడా.. మీరు 25 సంవత్సరాల వయస్సు వారిలా కనిపిస్తారు. ఇందుకోసం మీ జీవనశైలిలో కొద్దిగా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. 

2 Min read
Mahesh Rajamoni
Published : Jun 23 2022, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వయస్సు పెరుగుతున్న కొద్దీ.. ముఖంపై ముడతలు, తెల్లవెంట్రుకలు, మచ్చలు, చర్మం కాంతివంతంగా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ లక్షణాలను ఆపడం అంత సులువు కాదు. ఎందుకంటే మన జీవిన శైలి, ఆహారం వంటివన్నీ వయస్సుపై ప్రభావం చూపిస్తాయి. దీంతోనే మీ వయస్సు తొందరగా కనిపించడం ప్రారంభిస్తుంది. అనారోగ్యమైన ఆహారమే కాదు.. పని ఒత్తిడి కూడా మిమ్మల్ని  అకాల వృద్ధాప్యం (Aging)లోకి నెట్టేస్తాయి. కానీ వృద్ధాప్యాన్ని నియంత్రించవచ్చు. ఇందుకోసం మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 చిట్కాలను పాటిస్తే 40 ఏళ్ల వయసులో కూడా మీరు 25 ఏళ్ల యువతలా కనిపిస్తారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 
 

26

ఆరోగ్యకరమైన ఆహారం (Healthy foods): 

తీరికలేని జీవిత౦లో తినడానికి, తాగడానికి కూడా సరిగ్గా టైం లేని వారు చాలా మందే ఉన్నారు. టైం దొరికిందంటే చాలు ఏదో తిన్నామా అంటే తిన్నామా అనిపిస్తున్నారు. ఈ అలవాటు మారాలి. ఉదయం నుంచి రాత్రి భోజనం వరకు.. మీరు మీ ప్లేట్ లో ఆరోగ్యకరమైన ఆహారమే ఉండేట్టు చూసుకోవాలి. పండ్లు (Fruits), కూరగాయలు (Vegetables), పప్పుధాన్యాలు (Legumes), గుడ్లు, చికెన్ తో సహా పోషక పదార్థాలను మీ రోజు వారి ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాలి.  ఫైబర్ (Fiber), ప్రోటీన్ (Protein), విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ఫాస్ట్ ఫుడ్ (Fast food)కు దూరంగా ఉండాలి. ఇది మీ శరీరానికి బలాన్ని, శక్తిని ఇస్తుంది. ఈ ఆహారాలు మీరు యవ్వనంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి. 

36

విత్తనాలు (Seeds),గింజలు (Nuts)తినాలి: 

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో బలం తగ్గిపోతుంది. మీరు పూర్తిగా బలహీనపడుతుంటారు. దాంతో మీరు చిన్న చిన్న పనులను కూడా చేయలేరు. ఊరికే అలసిపోతుంటారు. అందుకే వాల్ నట్స్ (Walnuts), బాదంపప్పు (Almonds), చియా సీడ్స్ (Chia seeds), గుమ్మడికాయ గింజలు (Pumpkin seeds), అవిసె గింజల (Flax seeds)ను డైట్ లో చేర్చుకోవాలి. ఇవి మీకు శక్తినిస్తాయి. అలాగే మీరుు యంగ్ గా కనిపించేలా చేస్తాయి. 

46
Health Tips-Excessive water intake is detrimental to health

Health Tips-Excessive water intake is detrimental to health

నీళ్లను ఎక్కువగా తాగాలి: 

నీళ్లే సర్వ రోగ నివారిణీ. ఎందుకంటే శరీరానికి సరిపడా నీళ్లను తాగితే మనకు ఎలాంటి రోగాలు రావు. అందులోనూ నీళ్లను సరిగ్గా తాగని వారికే ముఖంపై ముడతలు వస్తుంటాయి. ఈ ముడతలు పోయి.. చర్మం యంగ్ గా కనిపించాలంటే మీరు రోజూ ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. నీళ్లు  శరీరంలో ఉన్న విషాన్ని బయటకు పంపుతుంది. ఇది ముఖంపై గ్లోను తెస్తుంది.
 

56

ప్రతిరోజూ వ్యాయామం చేయాలి:

బిజీ లైఫ్ కారణంగా చాలా మంది వ్యాయామం చేయలేకపోతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. క్రమం తప్పకుండా కొద్ది సేపైనా వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి రోగాలు రావు. వ్యాయామం మీ శరీరాన్ని ఫిట్ గా , బిగుతుగా ఉంచుతుంది. అందులోనూ వయసు పెరిగే కొద్దీ బరువు కూడా పెరుగుతుంది. దానిని వదిలించుకోవడానికి మిమ్మల్ని మీరు స్లిమ్ గా,  ఫిట్ గా ఉంచుకోవడానికి వ్యాయామం చాలా అవసరం. కాబ్టటి సమయం దొరికినప్పుడల్లా వ్యాయామం చేస్తూ ఉండండి. 
 

66
beauty sleep for health

beauty sleep for health

శరీరానికి నిద్ర తక్కువైతే అది కణాల వయసు మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి నిద్రపోవడం మర్చిపోతే కొన్నాళ్ళకు మిమ్మల్ని మీరే మర్చిపోతారు అన్నది గుర్తించుకోవాలి. కనుక శరీరానికి తగినంత నిద్ర కూడా తప్పనిసరి. అలాగే శరీరానికి శారీరిక శ్రమ (Physical activity) కూడా అవసరం. రోజులో కొద్ది సమయాన్ని వ్యాయామానికి, యోగాకు కేటాయించాలి. ఇలాంటి మంచి అలవాట్లను (Good habits) అలవరచుకుంటే వృద్ధాప్యానికి దూరంగా ఉండి ఆరోగ్యంగా.. యవ్వనంగా.. ఉంటారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved