Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • డార్క్ చాక్లెట్లు.. ఆ కోరికలను పెంచుతాయా?

డార్క్ చాక్లెట్లు.. ఆ కోరికలను పెంచుతాయా?

World Chocolate Day 2023: వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ సామర్థ్యం, లైంగిక కోరికలు, లిబిడో తగ్గడం సర్వ సాధారణం. కానీ ప్రస్తుతం చిన్న వయసు వారు కూడా ఈ లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు లిమిట్ లో డార్క్ చాక్లెట్లను తింటే ఇలాంటి సమస్యలేమీ ఉండవని నిపుణులు చెబుతున్నారు.   

Mahesh Rajamoni | Updated : Jul 07 2023, 11:47 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

డార్క్ చాక్లెట్లతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నిపుణులు ప్రకారం.. డార్క్ చాక్లెట్లు సెక్స్ డ్రైవ్ కు కూడా ఎంతో సహాయపడతాయి. ఇవి లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 
 

27
Asianet Image

డార్క్ చాక్లెట్ లో లైంగిక పనితీరును, కోరికలను పెంచే ఎన్నో సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫెనిలేథైలామైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని ఫీల్ గుడ్ హార్మోన్ అయిన డోపామైన్ ఉత్పత్తి కావడానికి సహాయపడుతుంది. ఇది ఆనందం, ఉద్వేగం భావాలను పెంచుతుంది. 
 

37
Asianet Image

డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఈ ఫ్లేవనాయిడ్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి లైంగిక పనితీరుపై సానుకూల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడతుతుంది. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లను క్రమం తప్పకుండా తినడం వల్ల పురుషులు, మహిళల్లో లైంగిక పనితీరు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

47
Asianet Image

డార్క్ చాక్లెట్ లో లిబిడో, లైంగిక పనితీరును మెరుగుపరిచే ఎన్నో సమ్మేళనాలు ఉన్నాయి. దీనిలో ఉండే ఫెనిలేథైలామైన్ డోపామైన్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే సెక్స్ కోరికలను పెంచుతుంది. డార్క్ చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు జననేంద్రియ ప్రాంతానికి రక్తప్రవాహాన్ని పెంచుతాయి. దీంతో ఉద్వేగం పెరుగుతుంది. అలాగే లైంగిక పనితీరు మెరుగుపడుతుంది. 

57
Asianet Image

డార్క్ చాక్లెట్ లో అర్జినిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న పురుషులకు ఇది మంచి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

67
Asianet Image

అంతేకాక డార్క్ చాక్లెట్ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను కూడా తగ్గిస్తుంది.ఇది లైంగిక పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు సెక్స్ కోరికలు కలగవు. అయితే ఈ ఒత్తిడి తగ్గితే లైంగిక కార్యకలాపాల సమయంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

77
Dark Chocolate

Dark Chocolate

డార్క్ చాక్లెట్ ఒక సహజ కామోద్దీపన. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆనందం, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న హార్మోన్. ఇది భాగస్వాములిద్దరికీ మరింత సానుకూల, ఆహ్లాదకరమైన లైంగిక అనుభవానికి దారితీస్తుంది.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories