Women Health: 30 ఏండ్లు నిండిన మహిళలకు మాత్రమే.. వీటిని తినకపోతే ఆ రోగాలొస్తయ్ జాగ్రత్త..
Women Health: ఆడవారికి 30 ఏండ్లు నిండితే చాలు అనేక రోగాలు అటాక్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులో ఆడవారిలో శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. వీటివల్ల డయాబెటిస్, మానసిక సమస్యలు, High blood pressure, థైరాయిడ్ , ఊబకాయం వంటి సమస్యలెన్నో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల ఈ సమస్యలు రాకుండా చేయొచ్చు.

అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా.. ఏజ్ మీద పడుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు వారిని చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వయసు పెరుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీరం శక్తిని, పటుత్వాన్ని కోల్పోతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి 30 ఏండ్లు నిండగానే వారి శరీరంలో ఎన్నో మార్పలు చోటుచేసుకుంటాయి. అదే ఆడవారికి 40 ఏండ్లు నిండేసరికి కండరాలు, ఎముకలు బలహీనంగా మారుతాయి.
women health
ఆ ఏజ్ ఆడవారి శరీరంలో హార్లోన్లు సమస్యతుల్యంగా ఉండవు. అంతేకాదు.. ఈ వయసు వారు ఎక్కువ మొత్తంలో వెయిట్ పెరుగుతుంటారు. 30 ఏండ్లు దాటిన ఆడవారికి అనేక రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. థైరాయిడ్, మానసిక సమస్యలు, ఊబకాయం, డయాబెటిస్ అధిక రక్తపోటు వంటి ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
women health
కాబట్టి ఈ రోగాలు సోకకూడదంటే మహిళలు 30 ఏండ్లు దాటిన తర్వాత ఖచ్చితంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు సరిపడా నిద్ర ఉండేట్టు చూసుకుంటూ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే వీరికి ఎలాంటి జబ్బులు రావు. ఇంతకి 30 నుంచి 40 ఏండ్ల మధ్య నున్నఆడవారు ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి..
వెల్లుల్లి: 30 నుంచి 40 ఏండ్లు నిండిన ఆడవారికి వెల్లల్లు ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది anti-viral, Anti-bacterial లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి వీరికెంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా 40 ఏండ్లు నిండిన స్త్రీలకు బోలు ఎముకల జబ్బు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాధి రాకుండా ఈ వెల్లుల్లి రక్షిస్తుంది. అంతేకాదు మహిళలకు ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ ఎంతో సహాయపడుతుంది.
గ్రీన్ వెజిటేబుల్స్: ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ కె, కాల్షియం, ఐరన్, బీటాకెరోటిన్, లూటిన్, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తింటే రక్తం పెరుగుతుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా మారుతాయి.
గుడ్లు: గుడ్డులో పోషకాలు మెండుగా ఉంటాయి. 30 ఏండ్లు దాటిన ప్రతి మహిళా రోజుకు కనీసం ఒక్క గుడ్డన్నా.. తినాలని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డులో ఎన్నో ప్రోటీన్లు, మంచి కొవ్వులను కలిగి ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్డును మొత్తం తింటే ఆరోగ్యం బాగుంటుంది.
డార్క్ చాక్లెట్: 30 దాటిన ఆడవారు ఇతర చాక్లెట్లకు బదులుగా డార్క్ చాక్లెట్లను తినడమే వారి ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్.. డయాబెటీస్, రక్తపోటు, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
సిట్రస్ ఫ్రూట్స్: సిట్రస్ ఫ్రూట్స్ లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతే కాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.