MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Green Chillies: ఈ చిన్న ట్రిక్‌తో కుండీలోనే బుట్టెడు పచ్చిమిర్చి కాసేలా చేయవచ్చు

Green Chillies: ఈ చిన్న ట్రిక్‌తో కుండీలోనే బుట్టెడు పచ్చిమిర్చి కాసేలా చేయవచ్చు

Green Chillies: ఇంట్లో కుండీలో పచ్చిమిర్చిని సులువుగా పండించేయవచ్చు. మంచి విత్తనాలతో పాటూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వానాకాలంలో మిరప విరగకాస్తుంది. ముఖ్యంగా చిన్న సింపుల్ ట్రిక్ ఉపయోగించాలి. అదేంటో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 18 2026, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుండీలోనే పచ్చిమిర్చ మొక్కను పెంచేయండిలా
Image Credit : AI

కుండీలోనే పచ్చిమిర్చ మొక్కను పెంచేయండిలా

పచ్చిమిర్చి మొక్కను పెంచడం కోసం ఇదే సరైన సమయం. వానకాలం ఆరంభంలోనే విత్తనాలు నాటితే అవి మొలకెత్తే అవకాశాలు ఎక్కువ.  ఆరోగ్యకరమైన మొక్కకు మంచి విత్తనాలు చాలా ముఖ్యం. ఇందుకోసం నర్సరీ నుండి పచ్చిమిర్చి విత్తనాలను కొనవచ్చు లేదా ఇంట్లో ఎండు మిరపకాయల నుండి కూడా విత్తనాలను తీయవచ్చు. చిన్న కంటైనర్‌లో మట్టి నింపి విత్తనాలను నాటాలి. మట్టి తేమగా ఉండేలా చూసుకోండి. సుమారు 5-7 రోజుల్లో చిన్న మొక్కలు రావడం మొదలవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మట్టిని ఇలా కలపండి
Image Credit : gemini AI

మట్టిని ఇలా కలపండి

పచ్చిమిర్చి మొక్క వేర్లు బాగా లోతుగా వెళితే మొక్క బలంగా ఉంటుంది. ఇందుకోసం కనీసం 12 అంగుళాల లోతు ఉన్న కుండీని తీసుకోవాలి. దాన్ని కేవలం మట్టితో నింపకుండా 50 శాతం గార్డెన్ మట్టి, 30 శాతం వర్మీకంపోస్ట్, పశువుల ఎరువు, 20 శాతం ఇసుక లేదా కోకోపీట్ తీసుకోని... అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమం మట్టిని తేలికగా, గాలి ఆడేలా, పోషకాలతో నింపుతుంది. దీంతో మొక్క వేగంగా పెరుగుతుంది.

34
ఎండ, నీరు ఎంత అవసరం
Image Credit : Asianet News

ఎండ, నీరు ఎంత అవసరం

మొక్కలు మొలిచాక 4 నుంచి 5 అంగుళాల పొడవు పెరిగాక, వాటిని పెద్ద కుండీలోకి మార్చుకోవాలి. మొక్కలు తీసేటప్పుడు వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. ఒక కుండీలో ఒకటి లేదా రెండు మొక్కలు మాత్రమే నాటాలి. అప్పుడే వాటికి తగినంత స్థలం, పోషణ లభిస్తుంది. పచ్చిమిర్చి మొక్కకు రోజూ కనీసం 5-6 గంటల ఎండ అవసరం. బాల్కనీ, టెర్రస్ లేదా ఎండ తగిలే కిటికీ దీనికి ఉత్తమమైన ప్రదేశం. ఎండ సరిగా తగలకపోతే పూలు రాలిపోయి కాయలు కాయవు.

44
ఈ ట్రిక్ పాటించండి
Image Credit : Asianet News

ఈ ట్రిక్ పాటించండి

కుండీలోని మట్టిని ఎప్పుడూ తేమగా ఉంచండి. కానీ అవసరానికి మించి మాత్రం నీళ్లు పోయవద్దు. ఎక్కువ నీటి వల్ల వేర్లు కుళ్లిపోవచ్చు. మట్టి మరీ పొడిగా ఉంటే మొక్క బలహీనపడుతుంది. మట్టి పై పొర పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీళ్లు పోయండి. 

మొక్క కొంచెం పెద్దయ్యాక, దాని పై భాగాన్ని (టాప్ గ్రోయింగ్ టిప్) తేలికగా తుంచండి.  దీనివల్ల మొక్కకు ఎక్కువ కొమ్మలు వచ్చి పూలు, మిరపకాయల సంఖ్య పెరుగుతుంది. మిరప మొక్కలకు ఆకు ముడత, ఇతర కీటకాల సమస్యలు రావచ్చు. వారానికి ఒకసారి వేప నూనె స్ప్రే చేయండి. అలాగే పుల్లటి మజ్జిగను నీళ్లలో కలిపి స్ప్రే చేయవచ్చు. అరటిపండు, గుడ్డు తొక్కల నీటిని పోయడం ద్వారా కూడా మిరపకాయలు బాగా కాసేలా చేసుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Related Stories
Recommended image1
Shiva Yogam: వారం రోజుల్లో అరుదైన శివయోగం.. ఆ మహాశివుని అనుగ్రహం ఈ 3 రాశులవారిపైనే
Recommended image2
Gold Haaram: ఇలాంటి అందమైన బంగారు హారాలు మీ దగ్గర ఒక్కటైనా ఉండాల్సిందే.. చూస్తే వావ్ అనేలా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved