Beauty Tips: కాంతులీనే అందమైన ముఖం కోసం.. నెలకి రెండుసార్లు ఫేషియల్ అవసరం!
Beauty Tips: ఒకప్పుడు ఫేషియల్ అనేది ఫంక్షన్లకి మాత్రమే చేయించుకునేవారు కానీ నేటి వాతావరణ కాలుష్యం కి ఫేషియల్ అనేది ఈ రోజుల్లో అవసరంగా మారిపోయింది. అయితే ఫేషియల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి అనేదానిపై అవగాహన పెంచుకుందాం.
సాధారణంగా మహిళలు నెలలో ఒకసారి లేదంటే రెండుసార్లు ఫేషియల్ చేయించుకుంటారు. అయితే చాలామంది గృహిణులు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. కానీ చక్కనైన కాంతులీనే ముఖం కోసం కచ్చితంగా నెలకి రెండుసార్లు ఫేషియల్ చేయించుకోవడం అవసరం అంటున్నారు డెర్మటాలజిస్టులు.
అసలు ఎందుకు ఫేషియల్ చేయించుకోవాలంటే నేటి కాలుష్య ప్రపంచంలో దుమ్ము, ధూళి, జిడ్డుకి చర్మం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అలాగే చర్మాన్ని అందవిహీనంగా మార్చే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మరియు మొటిమలు ఏర్పడటానికి కారణం అవుతుంది .
ఫేషియల్ చేయించుకుంటే చర్మ రంద్రాలు శుభ్రపడటమే కాకుండా మృత కణాలను కూడా తొలగిస్తుంది. అలాగే చర్మానికి హాని కలిగించే వ్యర్ధాలను ఫేషియల్ మసాజ్ ద్వారా బయటికి పంపించవచ్చు. దీనివలన చర్మం మరింత ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది.
మీకు పొడి చర్మం ఉన్నట్లయితే నెలకు రెండుసార్లు ఫేషియల్ చేయించుకోవడం వల్ల మీ చర్మాన్ని తేమగా మరియు మీ ముఖం కాంతివంతంగా ఉంచుతుంది. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఫేషియల్ విషయంలో జాగ్రత్తపడాలి. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఫేషియల్ చేయటం వలన చికాకుకి గురవుతుంది.
దీనివలన లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఫేషియల్ చేయడం ద్వారా ఫేస్ కి ఎక్స్పోలియేషన్ ద్వారా డెడ్ స్కిన్ మరియు మలినాలని తొలగిస్తారు. దీనితోపాటు సాఫ్ట్ గా ఉండే ఫేస్ ప్యాక్ లు మరియు క్రీములు చర్మానికి ఓదార్పు మరియు హైడ్రేషన్ ఇవ్వబడుతుంది.
అలాగే ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి మరియు ముఖ ఆకృతిని మెరుగుపరచడంలోని సహాయపడుతుంది. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా ఖచ్చితంగా నెలకి రెండుసార్లు ఫేషియల్ చేయించుకోండి. మీకు ఏమాత్రం అవగాహన ఉన్న ఇంట్లోనే చేసుకోవటం మరింత ఉత్తమం.