Forehead: నుదుటి ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటివారో చెప్పేయొచ్చు తెలుసా?
ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తిత్వం ఒకేలా ఉండదు. చేసే పనులను బట్టి, ప్రవర్తించే తీరును బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. కానీ నుదురు ఆకారాన్ని బట్టి కూడా మీరు ఎలాంటి వారో చెప్పేయొచ్చట. అది ఎలాగో ఒకసారి చూసేయండి.

నుదుటి ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వం గురించి చెప్పొచ్చనే విషయం మీకు తెలుసా? నిజానికి, ముఖంలోని ప్రతి అంశం మన వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు చెబుతుంది. మీ నుదురు వెడల్పుగా, సన్నగా లేదా M ఆకారంలో ఉంటే, అది మీ రూపాన్ని మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వం గురించి కూడా చెబుతుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
పెద్ద నుదురు:
పెద్ద నుదురు ఉన్నవాళ్లు తెలివైనవాళ్లు, ఓపెన్ మైండెడ్ ఉంటారు. వీళ్లు ఏదైనా తొందరగా నేర్చుకుంటారు. ఏ పనైనా సులువుగా చేయగలరు. జీవితంలో ఒడుదుడుకులను ఎలా ఎదుర్కోవాలో వీళ్లకు బాగా తెలుసు. అందుకే చాలామంది వీళ్ల దగ్గర సలహా తీసుకోవడానికి ఇష్టపడతారు.
వీళ్లు ఎక్కువగా సోషల్ మీడియాలో ఆకర్షణగా ఉంటారు. ఈ లక్షణం సాధారణంగా సెలబ్రిటీలు, సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ దగ్గరే ఉంటుంది. ముఖ్యంగా ఈ నుదురు ఉన్నవాళ్లలో ఉండే లోపం ఏంటంటే, వీళ్లు కోపం వచ్చినప్పుడు తమలోని మంచి లక్షణాలను మర్చిపోతారు.
చిన్న నుదురు :
చిన్న నుదురు ఉన్నవాళ్లు ఎక్కువగా తమ మనసుకు నచ్చినట్టు చేస్తారు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసినా, కలిసి పనిచేసేవాళ్లనే పార్టనర్స్ గా చేసుకుంటారు. వేరేవాళ్ల మాటలు వారికి నచ్చవు. వారికి నచ్చినట్టుగా జీవితాన్ని గడుపుతారు.
వంపు తిరిగిన నుదురు:
నుదురు వంపు తిరిగి ఉంటే మీరు చాలా సైలెంట్ గా ఉంటారు, ఎక్కువ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్లని ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తారు. ముఖ్యంగా వేరేవాళ్లతో మాట్లాడేటప్పుడు పాజిటివ్ గా మాట్లాడి వాళ్లని ప్రోత్సహిస్తారు. అందుకే అందరూ వీరిని బాగా ఇష్టపడతారు. మీలో ఉండే ఈ సైలెంట్ గుణమే ఎలాంటి కష్టమైన పరిస్థితులనైనా ఈజీగా దాటడానికి హెల్ప్ చేస్తుంది.
M ఆకారపు నుదురు ఉన్నవాళ్లు :
M ఆకారంలో నుదురు ఉంటే మీరు చాలా క్రియేటివ్ గా ఉంటారు. కళాత్మకంగా ఉంటారు. ఏదో ఒక కళ ద్వారా మిమ్మల్ని మీరు వ్యక్తపరుస్తారు. మీరు సాధారణంగా సైలెంట్ గా, ఓపికగా ఉంటారు. కోపం వచ్చినా వేరేవాళ్ల మీద ఎలాంటి ద్వేషం పెట్టుకోరు. మీరు మీ జీవితాన్ని చాలా అందంగా గడుపుతారు, ఓటములను బాగా హ్యాండిల్ చేస్తారు. మీలో మంచి ఊహ, క్రియేటివిటీ ఉండటం వల్ల మీరు పనిచేసే చోట మంచి అభివృద్ధిని చూస్తారు.