చలికాలంలో ఇల్లు వేడిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
సహజంగా ఇంటిని వెచ్చగా ఉంచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం..
Shivering
చలికాలం వచ్చేసింది. రోజు రోజుకీ చలి పెరిగిపోతోంది. బయటకు వెళితేనే కాదు.. ఇంట్లో కూడా చల్లగా ఉంటుంది. ఆ చలికి జలుబు, దగ్గు లాంటివది వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉంచాలంటే.. ఇల్లు వెచ్చగా ఉండాలి. మరి, సహజంగా ఇంటిని వెచ్చగా ఉంచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం..
First Sunrise
ఎంత చలికాలం అయినా.. ఏదో ఒక సమయంలో ఎండ వస్తుంది. ఆ సమయంలో సూర్య రశ్మి ఇంట్లోకి వచ్చేలా చేయాలి. ఎంత వీలైతే అంత వేడి ఇంట్లోకి వచ్చేలా చేయాలి. అంటే కర్టెన్స్ తీసేసి… కిటికీలు తీయాలి. అప్పుడు ఎండ డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తుంది. దాని వల్ల రోజులో కొంతవరకు అయినా రూమ్ వేడిగా ఉండటానికి సహాయం చేస్తుంది.
బయట వాతావరణం చల్లగా ఉండి.. ఆ చల్లగాలులు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇల్లు చల్లగా మారుతుంది. అందుకే.. ఆ చల్లదనం ముందు ఇంట్లోకి రాకుండా అడ్డుకోవాలి. దాని కోసం.. కాస్త మందపాటి కర్టెన్స్ ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా వీలైనంత వరకు ఇల్లు వేడిగా ఉంటుంది.
నార్మల్ గా సీలింగ్ ఫ్యాన్.. యాంటీ క్లాక్ వైస్ తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు కిందకు చల్లటి గాలులు పంపుతుంది. అలా కాకుండా.. క్లాక్ వైస్ తిరిగే ఫ్యాన్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఇవి రెండు రకాలుగా తిరగగలవు. అలాంటివి ఎంచుకుంటే.. చలికాలంలో క్లాక్ వైస్ తిప్పితే.. కిందకు వేడిగాలులు పంపుతాయి. రాత్రిపడుకునే ముందు వెచ్చగా ఉంటుంది.
వీలైనంత వరకు ఇంటిని కార్పెట్లతో నింపాలి. ఎందుకంటే… టైల్స్ చాలా తొందరగా చల్లగా మారిపోతాయి. అలా కాకుండా టైల్స్ పైన కార్పెట్ వేసి ఉంచితే… దాదాపు చాలా వరకు చల్లదనం తగ్గుతుంది. వెచ్చగా ఉంటుంది. ముఖ్యంగా పాదాలకు చల్లదనం తగలకుండా ఉంటుంది.
exhaust fan
వంట చేసే సమయంలో కిచెన్ లో ముందుగా మనం చేసే పని ఎక్సాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయడం. ఇలా చేయడం వల్ల కిచెన్ లోని వేడి బయటకు వెళ్లేలా చేస్తుంది. కానీ.. చలికాలంలో మాత్రం ఈ ఎక్సాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయకూడదట. దానిని ఆన్ చేయకుండా ఉండటం వల్ల కిచెన్ లో వేడి.. ఇల్లంతా వేడిగా ఉంచేలా సహాయం చేస్తుంది.