Beauty Tips: మెరిసిపోయే అందం కోసం.. జపనీస్ అమ్మాయిల టెక్నిక్ వాడదాం!
Beauty Tips: జపాన్ మహిళల చర్మం అద్దంలా మెరిసిపోతూ భలే గ్లోయింగ్ గా ఉంటుంది. అందుకోసం వారు ఎలాంటి టెక్నిక్స్ వాడతారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
జపాన్ మహిళలు వారి వయసు కన్నా చిన్నగా కనిపిస్తారు. వారి చర్మం మెరిసిపోతూ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే స్కిన్ కేర్ రొటీన్ మాత్రమే కాదు ఆహారం విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
వారు తీసుకునే ఆహారంలో ఒమేగా త్రీ పుష్కలంగా ఉంటాయని, అదేవిధంగా తక్కువ మొత్తంలో చక్కెర ఆహారాలు, ఉప్పు, మాంసాన్ని తీసుకుంటారు. అలాగే వారు చర్మ సంరక్షణ కోసం వాడే కండిషనర్లు, ఫేస్ ప్యాక్ లు మాస్కులు, ఇలా వాళ్ళ లిస్టు చాలా పెద్దగా ఉంటుంది.
అయితే అందమైన చర్మం కోసం వీళ్ళు రోజు రెండుసార్లు క్లెన్సింగ్ తప్పనిసరిగా చేస్తారు. ఉదయం పూట ఆయిల్ బేస్డ్ క్లంజర్ తో సున్నితంగా ముఖంపై మసాజ్ చేస్తూ, వేలు కొనలతో ముఖాన్ని సాఫ్ట్ గా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో సున్నితంగా కడిగేయాలి.
చర్మం నుంచి మరింత లోతుగా శుభ్రం చేయటానికి మలినాలను, చమట మరియు అవశేష కాలుష్యాన్ని తొలగించడానికి నీటి ఆధారిత ఫోమింగ్ క్లీన్జర్ వస్తుంది. తర్వాత చర్మాన్ని రీహైడ్రేట్ చేయటానికి తేలికపాటి ఔషధంతో ముఖంపై సున్నితంగా రుద్దాలి.
ఇక చివరి దశలోమాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి. ఇది హైడ్రేషన్ లో బ్లాక్ చేసి చర్మాన్ని బొద్దుగా చేస్తుంది. వారు ఈ విధానాన్ని కచ్చితంగా ప్రతిరోజు ఫాలో అవుతారు అలాగే మీరు అనుసరించే చర్మ సంరక్షణ పద్ధతిని జేబ్యూటీ అంటారు. సహజ పద్ధతులతో అందంగా కనిపించటమే వీరి ప్రత్యేకత.
తక్కువ ఉత్పత్తులు ఎక్కువ లాభం అనేది వీరి ఫిలాసఫీ. అలాగే చర్మాన్ని సున్నితంగా మెరిసే లాగా చూడాలి అనుకుంటే పదే పదే ధర్మాన్ని రుద్దడం, స్క్రబ్ చేయడం లాంటివి అసలు చేయకూడదు అంటారు జపనీస్ బ్యూటీషియన్స్.