Kitchen Tips: పప్పులకు పురుగులు పట్టకూడదంటే ఇలా చేయండి..
Kitchen Tips: ప్రతి వంటగదిలో రకరకాల పప్పు దినుసులు దర్శనమిస్తుంటాయి. కానీ ఈ పప్పులను ఎంత జాగ్రత్తగా పెట్టినా.. పురుగులు మాత్రం వాటిని వదలవు. సగానికి సగం పురుగులే తింటుంటాయి. అయితే కొన్నిన చిట్కాలను ఫాలో అయితే పప్పులకు పురుగులు పట్టనే పట్టవు.

భారతీయ ఆహారంలో పప్పుధాన్యాలు చాలా ముఖ్యమైనవి. పప్పులతో సాంబారు, కూర, టొమాటో పప్పు మొదలైన ఆహారాన్ని తయారు చేసుకుని తింటుంటారు. పప్పుధాన్యాలు ప్రతి వంటగదిలో తప్పకుండా ఉంటాయి. ఇవి కేవలం రుచికే కాదు.. వీటిలో ప్రోటీన్లు, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే వీటిని ఎప్పుడూ వంటగదిలో ఉండేలా చూసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో కొనేస్తుంటారు. ధరలు మారుతూ ఉంటాయని.. వర్షాకాలంలో తరచుగా బయటకు వెళ్లలేమని.. వంటి వివిధ కారణాల వల్ల పప్పుధాన్యాలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేస్తారు.
కానీ పప్పుధాన్యాలను పెద్ద మొత్తంలో నిల్వ చేయడం కష్టం. ఎందుకంటే పప్పుధాన్యాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు వాటిలో చిన్న చిన్న పురుగులు (కీటకాలు) కనిపిస్తాయి. పప్పుదినుసుల వద్దకు పురుగులు రాకుండా నిరోధించడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పుధాన్యాలను పురుగుల నుండి రక్షించడం చాలా సులువు. దీనికోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ వంటగదిలోని కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. పప్పుధాన్యాల్లోని పురుగులను వదిలించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించవచ్చు. అవేంటంటే..
పసుపు: పప్పుధాన్యాల్లో పురుగులను నివారించడానికి పసుపును ఔషదంలా పనిచేస్తుంది. ఇందుకోసం కొంచెం పసుపును తీసుకుని చిన్న చిన్న బంతులను తయారు చేసి, వాటిని పప్పుధాన్యాలు నిల్వ చేసే కంటైనర్ లో ఉంచండి. ఇలా చేయడం వల్ల గింజలకు పురుగులు పట్టవు.
పలావ్ ఆకు: పురుగులను నివారించడానికి పలావ్ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. పప్పు దినుసులు ఉంచిన కంటైనర్ లో పలావ్ ఆకులను ఉంచినా పప్పు దినుసులకు పురుగులు పట్టవు.
వెల్లుల్లి: వంటగదిలో అనేక విధాలుగా ఉపయోగించే వెల్లుల్లి.. పప్పు దినుసుల్లో ఉండే పురుగులను కూడా వదిలిస్తుంది. వెల్లుల్లితో పాటుగా లవంగాలను అదే కూడా వేస్తే పప్పులకు పురుగులు అసలే పట్టవు.
వేప ఆకు: వేప ఆకులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పప్పుల కంటైనర్లలో వేపాలకు వేస్తే కీటకాలను దూరంగా ఉంటాయి. చీడపీడలు గింజలను పాడుచేయకుండా దూరంగా ఉంచడానికి రైతులు ఉపయోగించే పాత పద్ధతి ఇది.
ఆవనూనె: ఆవనూనెను వంటకు ఉపయోగిస్తారు. ఇది వంట రుచిని పెంచుతుందని అందరికీ తెలుసు. పప్పుధాన్యాలలో చీడపీడలను నివారించడానికి కూడా ఈ నూనెను ఉపయోగిస్తారు. అవును, పప్పుకు కొద్దిగా ఆవనూనెను జోడించి,తరువాత బాగా ఎండలో ఆరబెట్టండి. ఆ తర్వాత ఒక కంటైనర్ లో పోస్తే పురుగులు అసలే పట్టవు.
ఇది కాకుండా.. పప్పు దినుసులు తెచ్చిన తర్వాత వాటిని నీళ్లలో కడిగి రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టండి. గింజలను గాలి చొరబడని గట్టి కంటైనర్ లో నిల్వ చేయండి.
గింజలు, పిండిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు. వాటిని మీరు తాజాగా ఉన్నప్పుడే ఉపయోగించాలి. అప్పుడే మీ వాటిలో ఉండే పోషకాలు మీకు అందుతాయి. ముఖ్యంగా పురుగులు పట్టిన షెల్ఫ్ లను తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి.