MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Beauty Tips: హై హీల్స్ వాడుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు?

Beauty Tips: హై హీల్స్ వాడుతున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు?

 Beauty Tips: ఈ రోజుల్లో అమ్మాయిలు హై హీల్స్ వేసుకోవడం సాధారణ అయిపోయింది. ఇవి వేసుకోవటం వలన అందంగా కనిపిస్తాం కానీ వాటి వల్ల జరిగే నష్టాలని ఎవరూ పట్టించుకోవటం లేదు. హై హీల్స్ వేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

Navya G | Published : Aug 30 2023, 12:04 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

హై హీల్స్ చెప్పులు వేసుకుంటే నడకలో ఒకలాంటి హుందాతనం వస్తుంది. కొందరి ఆఫీసులలో యూనిఫాంలో  భాగంగా రోజూ హై హీల్స్ వేసుకోవాలి. అయితే హై హీల్స్ అప్పుడప్పుడు వేసుకుంటే పర్వాలేదు కానీ ప్రతిరోజు వేసుకోవడం వలన వచ్చే నష్టాలు దీర్ఘకాలికంగా ఉంటాయి అవేంటో చూద్దాం.

26
Asianet Image

హై హీల్స్ వేసుకోవడం వల్ల అలైన్మెంట్ దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలోని కండరాలు, కీళ్లు శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీర్ఘకాలం హై హీల్స్ వాడటం వలన పాదం వెనుక భాగంలో లోపం ఏర్పడుతుంది. బొటనవేళ్లలో కూడా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది.

36
Asianet Image

 హై హీల్స్ ధరించినప్పుడు మెదడుకు వెళ్లే నరాలు ఒత్తిడికి గురై మెదడు కార్యక్రమాలు సరిగ్గా జరగవు. హై హీల్స్ చెప్పులతో బ్యాక్ పెయిన్ వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ చెప్పులు శరీర గురుత్వ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి మారుస్తాయి. దీంతో బ్యాక్ పెయిన్ మొదలవుతుంది.

46
Asianet Image

హైహిల్స్ షేప్ కారణంగా పాదాల మీద అధిక భారం పడుతుంది. వెన్నుముక, మెడ వీటి పైన కూడా అధిక భారం పడి  ఆ భాగాలు నొప్పికి గురవుతాయి. హైహిల్స్ ధరించడం వలన ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

56
Asianet Image

 కాళ్లు, నడుము, తుంటి ఎముకలు విరిగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎముకలు బలహీనంగా ఉంటే హై హీల్స్ ధరించడాన్ని అవాయిడ్ చేయటం మంచిది. అలాగే హై హీల్స్ వేసుకుని గంటల తరబడి నిలబడటం వల్ల మోకాలు నొప్పి సమస్య వస్తుంది.

66
Asianet Image

కాబట్టి హై హీల్స్ చెప్పులు వేసుకోవడం వలన కలిగే నష్టాలని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఈ చెప్పులు వేసుకోండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఇలాంటి చెప్పులు వేసుకోవాల్సి వస్తే తగిన ప్రికాషన్స్ తీసుకోండి. లేదంటే మీరు ఎదుర్కోబోయే ప్రమాదాలు చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories