- Home
- Life
- weight loss: బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తింటే.. బరువు తగ్గడం కాదుకదా విపరీతంగా పెరుగుతారు జాగ్రత్త
weight loss: బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను తింటే.. బరువు తగ్గడం కాదుకదా విపరీతంగా పెరుగుతారు జాగ్రత్త
weight loss: కొన్ని రకాల పండ్లు బరువును తగ్గించడానికి సహాయపడితే.. మరికొన్ని పండ్లు మాత్రం వెయిట్ ను మరింత పెంచుతాయి. అలాంటి వాటిని బరువు తగ్గాలనుకునేవారు అస్సలు తీసుకోకూడదు.

weight loss diet
weight loss: ప్రతి ఒక్కరూ తమను తాము స్లిమ్ గా, ఫిట్ గా ఉంచుకోవాలని భావిస్తారు. ఇందుకోసం జిమ్, యోగా, మంచి డైట్ ను ప్లాన్ చేస్తారు కూడా. ఇక వీరి డైట్ లో తీసుకునే పండ్లు , కూరగాయలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారి డైట్ లో ఖచ్చితంగా విటమిన్లు, ఖనిజాలతో సహా అనేక పోషకాలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ కొన్ని రకాల పండ్లు బరువును తగ్గించడం కంటే పెంచడానికి ఎక్కువ సహాయపడతాయి. ఏ పండ్లు తీసుకోవాలి, ఏ పండ్లను తీసుకోకూడదు వంటి విషయాలపై అవగాహన లేకుండా తింటే విపరీతంగా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
British physician and dietitian Dr. మైఖేల్ ప్రతిరోజూ బరువు తగ్గాలనుకునే వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనుకునే దానిపై సలహాలు సూచనలను ఇస్తుంటారు. వారి ఇన్ స్టాగ్రామ్ ద్వారా మీరు ఆ విషయాలను తెలుసుకోవచ్చు. మైఖేల్ మోస్లీ ప్రకారం.. మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు కొన్ని రకాల పండ్లను అస్సలు తినకూడదు.
బరువు తగ్గే సమయంలో ఈ పండ్లకు దూరంగా ఉండండి..
డాక్టర్ మైఖేల్ మోస్లీ ప్రకారం.. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్ని పండ్లనైనా తినొచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రం స్పెషల్ డైట్ ను ఫాలో అయినట్టైతే అలాంటి వారు కొన్ని రకాల పండ్లను తీసుకోకపోవడమే మంచిది. అవే మామిడి, అరటి, పుచ్చకాయ మరియు పైనాపిల్. ఈ పండ్లలో సహజ చక్కెర కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోండి..
అదే సమయంలో బరువు తగ్గించే ఆహారంలో మీరు ఆపిల్స్, బెర్రీస్, రాస్బెర్రీస్, ద్రాక్ష లేదా అవోకాడోను తినవచ్చు. సాధారణ ప్రదేశంలోని మామిడిలో 45 గ్రాముల చక్కెర కంటెంట్ ఉంటుందని ఆయన చెప్పారు. ద్రాక్షలో 23 గ్రాములు, రస్బరీలో 5 గ్రాములు, అవకాడోలో 1.33 గ్రాముల చక్కెర లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మామిడి, పైనాపిల్, అరటి, పుచ్చకాయ వంటి పండ్లకు దూరంగా ఉండాలి. తక్కువ బరువు ఉన్నవారు ఈ పండ్లను బేషుగ్గా తినవచ్చని ఆయన చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పండ్లు మరియు కూరగాయలను ఆహారంలో తీసుకునే వ్యక్తులు రోజుకు కనీసం ఐదుసార్లు అనేక రకాల వ్యాధులను నివారించవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను అడ్డుకుంటారని వెల్లడిస్తోంది.