టైట్ అండర్ వేర్ తో ఆ ప్రాబ్లం వస్తుందట జాగ్రత్త..
టైట్ గా ఉండే అండర్ వేర్ లను ధరించడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారినప్పటికీ.. వీటి వల్ల సంతాన సమస్యలు ఎదురవుతున్నాయని పలు అధ్యయానాలు హెచ్చరిస్తున్నాయి.

మార్కెట్ లో మగవారి కోసం రకరకాల లో దుస్తులు అందుబాటులో ఉంటాయి. అందులో బ్రీఫ్ లు, బాక్సర్ లు వంటి ఎన్నో రకాల ఇన్నర్ లు రకరకాల డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని రకాల లో దుస్తులు పురుషులలో వంధ్యత్వం సమస్యను పెంచుతాయన్న సంగతి మీకు తెలుసా..? నిజానికి టైట్ గా ఉండే లో దుస్తులను వేసుకోవడం వల్ల పురుషుల స్పెర్మ్ నాణ్యత 25 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతే కాదు ఇది వారి లైంగిక శక్తిని కూడా బలహీనపరుస్తుందట.
underwear
లో దుస్తుల ద్వారా స్పెర్మ్ నాణ్యత ఎలా ప్రభావితమవుతుంది:
పురుషుల్లో వృషణాలలో స్పెర్మ్ ఏర్పడుతుంది. ఇది చాలా సున్నితమైన భాగం. ఇది ఉష్ణోగ్రత ద్వారా కూడా ప్రభావితమవుతుంది. ఆరోగ్యకరమైన వీర్యాన్ని తయారు చేయడానికి పురుషులకు సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత అవసరం.
ఇలాంటి పరిస్థితిలో బిగ్గరగా ఉండే ఇన్నర్స్ ను వాడటం వల్ల వేడి, చెమట ఎక్కువ అవుతుంది. దీని వల్ల వృషణాలు ఆరోగ్యకరమైన స్పెర్మ్ ను తయారు చేయలేవు. అలాగే స్పెర్మ్ నాణ్యత కూడా బాగా తగ్గుతుంది.
అండర్ వేర్ లను వేసుకోవడం 1920లో ప్రారంభమైంది. ఈ సమయంలో పురుషులు చాలా వదులుగా ఉండే బాక్సర్ లాంటి లో దుస్తులనే వేసుకునే వారు. సుమారు 10 సంవత్సరాల తరువాత బిగ్గరగా ఉండే అండర్ వేర్ లను వేసుకోవడం ప్రారంభమయ్యింది. ఈ అండర్ వేర్ లు పూర్తిగా చర్మానికి అత్తుక్కుపోతాయి.
చాలా మంది పురుషులు చిన్నగా, బిగ్గరగా ఉండే అండర్ వేర్ లనే ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టైట్ గా ఉండే అండర్ వేర్ లను వేసుకోవడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. అందుకే పురుషులు ఎప్పుడూ వదులుగా ఉండే బాక్సార్లనే వేసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు.