Valentine Beauty Tips : వాలెంటైన్ వీక్ అందంగా మెరిసిపోవాలనుకునే వారికోసం సూపర్ టిప్స్..
Valentine Beauty Tips : ప్రపంచంలోని ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురురుచూస్తున్న Valentine's Day మరికొన్ని రోజుల్లో రానుంది. ఇప్పటికే Valentines week కూడా మొదలైంది. దీంతో రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే అంటూ ఒక దాని తర్వాత ఒకటి వరుసగా వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో అమ్మాయిలు అందంగా కనిపించాలని ముచ్చటపడుతుంటారు.

Valentine Beauty Tips : ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వాలెంటైన్స్ డే మరికొన్ని రోజుల్లో రానుంది. ఇప్పటికే వాలెంటైన్ వీక్ స్టార్ట్ అవడంతో లవర్స్ లో సరికొత్త ఉత్సాహం వచ్చి చేరిందనే చెప్పుకోవాలి. ఈ వీక్ తో ఇప్పటికే ప్రేమికులు రోజ్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఈ రోజు ప్రపొజ్ డే లోకి అడుగుపెట్టారు. నెక్ట్స్ చాక్లేట్ డే కు కూడా వెల్ కమ్ చెప్పబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటేఈ వాలెంటైన్ వీక్ ప్రతిరోజూ పండగ వాతావరణం లాగే ఉంటుంది. అయితే ఈ ప్రేమికుల పండగను ఎలా జరుపుకోవాలి? ఏ డ్రెస్ వేసుకోవాలి? ఎలా అందంగా కనిపించాలా? అని అమ్మాయిలు తెగ ఆలోచనలో పడిపోతుంటారు. మరి ఈ వాలెంటైన్ వీక్ మీరు అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారా? మేకప్ ఎలా వేసుకోవాలి.. ఎలా రిమూవ్ చేసుకోవాలనే విషయంలో కొన్ని చిట్కాలను పాటించాలి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఈ వాలెంటైన్ వీక్ లో మీ లవర్ ను మెస్మరైజ్ చేసే అందం మీ సొంతం అవుతుంది. మరి ఇందుకోసం మీరేంచేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
మేకప్ రిమూవ్: వాలెంటైన్స్ డే రోజున మీరు అందంగా మెరిసిపోతేనే ఆ డే మీకు మరింత ప్రత్యేకంగా మారుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ఫేస్ కు వేసిన మేకప్ ను క్లీన్ చేసుకోవడం ముఖ్యం. అయితే మేకప్ రిమూవ్ చేసే ముందు నూనె లేదా మేకప్ క్లీనర్ తో శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని క్లీన్ చేసిన తర్వాత ఫేస్ కు నైట్ క్రీం ను రాయాలి. ఇలా చేయడం వల్ల మీ ఫేస్ Fresh కనిపించడంతో పాటుగా బ్యూటిఫుట్ గా కనిపిస్తుంది. అయితే ఎటైనా వెళ్లేటప్పుడు ఫేస్ కు మేకప్ ను ఎక్కువగా మేసుకోకుండా లైట్ గా వేసుకోండి.
క్లెన్సర్: ముఖాన్ని ఎంత క్లీన్ ఉంచుకుంటే అంత అందం మనసొంతమవుతుంది. కాబట్టి ప్రతి రోజూ మీ ఫేస్ ను క్లెన్సర్ ను ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. ఈ క్లెన్సర్ వల్ల ముఖ చర్మం Tight గా అవుతుంది. దాంతో మీ ఫేస్ నీట్ గా అవుతుంది. అంతేకాదు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందే కళ్లకు పెట్టుకున్న కాటుకను రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఐ ల్యాష్ లను కూడా తొలగించడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఈ టిప్స్ ను ఫాలో అయితే మీ కళ్లు ఆకర్షవంతంగా తయారవుతాయి. అంతేకాదు మీ స్కిన్ కూడా మెరిసిపోతుంది. కాగా క్లెన్సర్ తర్వాత స్కిన్ కు టోనర్ ను వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే టోనర్ వల్ల చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది కాబట్టి.
ఫేషియల్ : మేకప్ ను రిమూవ్ చేసిన వెంటనే క్లెన్సింగ్ ఉపయోగించాలి. ఆ తర్వాత టోనర్ ను రాయాలి. ఆ తర్వాత నైట్ క్రీమ్ ను అప్లై చేయాలి. దీన్ని ఎలా చేయాలంటే .. నైట్ క్రీం ను తీసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు ముఖానికి మెల్లిగా మసాజ్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే మేకప్ వల్ల ఏర్పడ్డ మరకలు పోతాయి. అంతేకాదు స్కిన్ నిగనిగా మెరిసిపోతుంది. ముఖ్యంగా డల్ నెస్ కూడా మటుమాయం అవుతుంది. కాబట్టి ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదిరిపోయే అందం మీ సొంతం అవుతుంది. ఇక వాలెంటైన్స్ డేకు మీ అందంతో మీ ప్రియురాలిని లేదా ప్రియుడిని ఆశ్చర్యానికి గురిచేస్తారు.