BeautyTips: అందమైన ముఖం కోసం.. అద్భుతమైన ఆలు ఫేస్ ప్యాక్స్!
Beauty Tips: బంగాళదుంప ఆహారంగానే కాదు అందానికి కూడా పనిచేస్తుంది. బంగాళదుంపతో పెట్టుకునే ఫేస్ ప్యాక్స్ మొహానికి ఎంతో మెరుపుని తీసుకువస్తాయి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వాటి వల్ల లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బంగాళదుంపలు ఆహారం కోసమే కాదు, అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. బంగాళాదుంప లో ఉండే విటమిన్ సి, బి సిక్స్, తోపాటు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ చర్మానికి ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తాయి.
వీటి వలన మెరిసే చర్మం పొందవచ్చు. ముందుగా చర్మం తెల్లబడటానికి బంగాళదుంపల ఫేస్ ప్యాక్ చేద్దాం. దీనికోసం మూడు టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె సరిపోతుంది. బంగాళదుంప రసాన్ని తేనెతో కలిపి ముఖానికి మరియు మెడకి పట్టించండి.
తర్వాత పది పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. ఇలా వారానికి రెండుసార్లు చేయటం వలన ముఖం మీద ముడతలు త్వరగా రాకుండా నివారించవచ్చు. అలాగే మెరిసే చర్మం కోసం బంగాళదుంప, నిమ్మకాయ ఫేస్ మాస్క్ తయారు చేద్దాం.
దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంపల రసం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, హాఫ్ టీ స్పూన్ తేనె బాగా కలిపి ముఖానికి మరియు మెడ అంతటా అప్లై చేయండి. 15 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత నీటితో బాగా కడగండి. ఇలా రోజు తప్పించి రోజు చేయటం వలన మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి.
అలాగే చర్మం టోనింగ్ లో కూడా బాగా సహాయపడతాయి. అలాగే మొటిమల కోసం బంగాళదుంప మరియు టమాటో ఫేస్ మాస్క్ తయారు చేద్దాం. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప రసం, ఒక టేబుల్ స్పూన్ టమోటా రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి మెడకి అప్లై చేయండి.
తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో కడుక్కోండి. మొటిమలు మాయమయ్యే వరకు ప్రతిరోజు ఇలా చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వలన చర్మం ఎర్రబడటం, అలాగే బ్యాక్టీరియాను మీ చర్మం నుంచి దూరం చేయటంలో ఈ మాస్క్ ఎంత ఉపయోగపడుతుంది.