కాకినాడ టూర్... కాకినాడలో పర్యాటకులు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో కాస్త సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి ప్రదేశానికి వెళ్లాలని ఆలోచిస్తారు. కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియక గందరగోళంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణం (Kakinada town) సందర్శన సరైనది. కాకినాడ సందర్శన పర్యాటకులకు ఆకట్టుకునేలా (Impressive) ఉంటుంది. కాకినాడ సందర్శన మీకు తప్పకుండా నచ్చుతుంది. అయితే ఇప్పుడు మనం కాకినాడలో సందర్శించవలసిన కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ ప్రధాన ఓడరేవుగా (Port) ప్రసిద్ధి. వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న దీన్ని మినీ ముంబై (Mini Mumbai) అని కూడా అంటారు. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన సాగర తీరాలు (Pleasant beaches) పర్యాటకుల మనసును హత్తుకుంటాయి.
వాణిజ్య పరంగానూ, పర్యాటక పరంగానూ మంచి గుర్తింపు పొంది స్మార్ట్ సిటీ (Smart City) గా పిలవబడుతోంది. ఎన్నో ప్రత్యేకతలను కలిగిన కాకినాడ ప్రాంత సందర్శనకు పర్యాటకులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంత సందర్శన పర్యాటకులకు ఒక మధురమైన జ్ఞాపకంగా (Sweet memory) మిగిలిపోతుంది.
హోప్ ఐల్యాండ్: హోప్ ఐల్యాండ్ (Hope Island) కారణంగానే కాకినాడ తీర ప్రాంతం పరిరక్షించబడుతోంది. ఈ ద్వీపం సహజసిద్దంగా (Naturally) 500 ఏళ్ల క్రితం ఏర్పడినది. ఈ ద్వీపం కారణంగా బంగాళాఖాతం నుంచి వచ్చే ఆటుపోట్ల నుంచి తీరం కోతకు గురికాకుండా కాపాడుతుంది. ఈ ద్వీపం కారణంగా తీరంలో ఓడకు లంగరు వేసినప్పుడు అవి స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది.
హోప్ ఐల్యాండ్ సాగర తీరంకు మధ్యలో ఉండి తీరానికి రక్షణ కవచంగా (Protective shield) ఉంది. ఈ హోప్ ఐల్యాండ్ సందర్శన పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. 23 కిలోమీటర్ల మేర తీరం వెంబడి హోప్ ఐల్యాండ్ ద్వీపం విస్తరించి ఉంది. కాకినాడ తీరం నుండి హోప్ ఐల్యాండ్ మధ్య ఉండే ప్రాంతాన్ని కాకినాడ బే (Kakinada Bay) అని అంటారు.
కోరంగి అభయారణ్యం: కాకినాడ పట్టణం (Kakinada town) నుంచి 14 కిలోమీటర్ల దూరంలో కోరంగి అభయారణ్యం (Korangi Sanctuary) ఉంది. ఈ కోరంగి అభయారణ్యం ఉప్పెనల నుంచి కాకినాడ తీర ప్రాంతాన్ని కాపాడడానికి రక్షణ కవచంగా ఉంది. ఈ అడవి ప్రాంతాన్ని 1998లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ అడవి ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం, చెక్క వంతెనలు, పార్కులు (Parks), బోటు షికారు (Boating) పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఈ ప్రాంత సందర్శనలో మనం అనేక జంతు జీవ జలాన్ని, పక్షి జాతులను చూడవచ్చు. కాకినాడలో తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఇది.
రావణబ్రహ్మ గుడి: ఉప్పాడకు అతి దగ్గరలో మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవస్థానం కలదు. ఈ దేవాలయాన్ని రావణబ్రహ్మ గుడి (Ravanabrahma Gudi) అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో రావణుడికి పూజలు జరిగే ఏకైక ప్రదేశం ఇది. ఈ దేవస్థానంతో పాటు పాదగయ క్షేత్రం, కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, బిక్కవోలు దేవాలయం (Bikkavolu Temple) ఇలా ఎన్నో దేవాలయాలు కాకినాడలో చూడవచ్చు.
కాకినాడ ప్రత్యేకతలు: కాకినాడ పేరు వినగానే అందరికీ ముందుగా గొట్టం కాజాలు (Gottam kajalu) గుర్తుకొస్తాయి. ఇక్కడి అరటి ఆకులోని భోజనం పర్యాటకులకు చాలా నచ్చుతుంది. కాకినాడ వెళ్లినప్పుడు అక్కడి అనేక సాంప్రదాయ వంటలను (Traditional dishes) మనము రుచి చూడవచ్చు.