ఇండియాలో టాప్ 10 రిచ్ ఫ్యామిలీస్ ఎవరో తెలుసా?
భారీ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించి భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారసత్వంగా వ్యాపారాలను నడిపిస్తూ దేశంలోనే అత్యంత ధనవంత కుటుంబాల జాబితాలో నిలిచాయి కొన్ని ఫ్యామిలీస్. దేశంలో టాప్ 10 రిచ్ ఫ్యామిలీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖేష్ అంబానీ కుటుంబం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారతదేశ నెంబర్ వన్ ధనికుడు. వారి కుటుంబ సంపద సుమారు 95.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ముఖేష్ అంబానీ ప్రపంచంలో అత్యంత ధనికుల జాబితాలో 18వ స్థానంలో ఉన్నాడు. ముఖేష్ అంబానీ కుటుంబంలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక వ్యాపార విభాగంలో పనిచేస్తున్నారు.
గౌతమ్ అదానీ కుటుంబం
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుటుంబం 62.3 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉంది.గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. అదానీ గ్రూప్ వ్యాపారం ఎన్నో రంగాల్లో విస్తరించిన విషయం తెలిసిందే.
శివ్ నాడార్ కుటుంబం
హెచ్.సి.ఎల్. అధినేత శివ్ నాడార్ కుటుంబం దేశంలో అత్యంత ధనికుల జాబితాల్లో 3వ స్థానంలో ఉంది. నాడార్ కుటుంబ ఆస్తుల విలువ 42.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో ధనికుల జాబితాల్లో వీరి కుటుంబం 37వ స్థానంలో ఉంది.
సావిత్రి జిందాల్ కుటుంబం
సావిత్రి జిందాల్ కుటుంబం అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో 4వ స్థానంలో ఉంది. వీరి కుటుంబం ఓ.పి. జిందాల్ గ్రూప్‌ను నిర్వహిస్తుంది. ఈ కుటుంబం 38.5 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉంది. ప్రపంచ ధనికుల జాబితాలో 41వ స్థానంలో ఉన్నారు.
దిలీప్ షాంఘ్వీ కుటుంబం
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అధినేత దిలీప్ షాంఘ్వ కుటుంబం 5వ స్థానంలో ఉంది. వీరి కుటుంబ సంపద 29.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ ధనికుల జాబితాలో దిలీప్ షాంఫ్వీ కుటుంబం 59వ స్థానంలో ఉంది.
సైరస్ పూనావాలా కుటుంబం
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా కుటుంబం సంపద 22.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచ ధనికుల జాబితాలో ఈ కుటుంబం 89వ స్థానంలో ఉంది.
కుమార్ బిర్లా కుటుంబం
ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార్ బిర్లా కుటుంబం దేశంలో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో ఉంది. వీరి కుటుంబం సంపాదన 21.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో టాప్ 100 ధనిక కుటుంబాల్లో కుమార్ బిర్లా ఫ్యామిలీ ఒకటి.
కుషాల్ పాల్ సింగ్ కుటుంబం
డిఎల్ఎఫ్ లిమిటెడ్ అధినేత కుషాల్ పాల్ సింగ్ కుటుంబం ఇండియాలో రిచ్ ఫ్యామిలీస్ లో ఒకటి. వీరి కుటుంబ ఆదాయం 18.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
రవి జైపురియా కుటుంబం
వరుణ్ బెవరేజెస్ అధినేత రవి జైపురియా కుటుంబ సంపద సుమారు 17.9 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో అత్యంత సంపన్నుల కుటుంబాల జాబితాలో వీరు 9వ స్థానంలో ఉన్నారు.
రాధాకృష్ణ దమానీ కుటుంబం
డిమార్ట్ అధినేత రాధాకృష్ణ దమానీ కుటుంబం దేశంలో అత్యంత ధనిక కుటుంబాల జాబితాలో 10వ స్థానంలో ఉంది. వీరి ఆదాయం 15.8 బిలియన్ డాలర్లుగా ఉంది.